ఏప్రిల్ 08 మంగళవారం రాశిఫలాలు
మేష రాశి
ఈ రాశివారికి ఈ రోజు శుభ ఫలితాలున్నాయి. వ్యాపారంలో మంచి లాభం పొందే అవకాశం కనిపిస్తోంది. భాగస్వామ్యంలో నూతన ఒప్పందాన్ని ఖరారు చేయవచ్చు. మీ ప్రియమైన వారితో ఉండే వివాదాలు దూరమవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం మీకుంటుంది. మీ పనులకు సంబంధించి మరొకరిపై ఆధారపడకండి. ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు.
వృషభ రాశి
లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసినా దాని నియమాలపై పూర్తి దృష్టి పెట్టండి. అవసరమైన పనులు వేగం పుంజుకుంటాయి. మీరు ప్రత్యర్థుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంతో ముడిపడిన వారు శుభవార్త వినవచ్చు. రాజకీయాల్లో పనిచేసే వారు తమ శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. మీ అభివృద్ధికి అడ్డంకులుగా ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.
మిథున రాశి ఈ రోజు మీకు సానుకూల ఫలితాలను తెస్తుంది. విద్యార్థులు ఏదైనా పోటీలో పాల్గొంటే కచ్చితంగా విజయం సాధిస్తారు. మీ తెలివితేటలతో పెద్ద లక్ష్యాన్ని సాధిస్తారు. ఇంట్లో సమస్యల గురించి మీరు పెద్దలతో మాట్లాడాలి. చిన్న పిల్లలతో కొంత సమయం ఆనందంగా గడుపుతారు. సంతానం వైపు నుంచి శుభవార్త వినవచ్చు. మీలో అదనపు శక్తి ఉండటం వల్ల మీ పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు.
కర్కాటక రాశి
ధార్మిక కార్యక్రమాలపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది. సంప్రదాయలను అనుసరిస్తారు. సౌకర్యాలు పెరుగుతాయి. పాత స్నేహితులను కలుస్తారు. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వారు శుభవార్త వింటారు. సింహ రాశి
ఈ రోజు మీరు ధైర్యంగా ఉంటారు. కొత్త వ్యక్తులతో పరిచయం పెంచుకోవడంలో మీరు విజయవంతం అవుతారు. సామాజిక కార్యక్రమాలపై మీరు పూర్తి దృష్టి పెడతారు. వ్యాపారానికి అవసరమైన సమాచారాన్ని మీరు సులభంగా సేకరించగలుగుతారు. కుటుంబ విషయాలపై మీరు పూర్తి దృష్టి పెట్టాలి. పెండింగ్ లో ఉన్న ఒప్పందాలు ఖరారు అవుతాయి.
కన్యా రాశి ఈ రోజంతా మీరు ఆనందంగా ఉంటారు. మీ ప్రవర్తనతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. కుటుంబంలో ఎవరికైనా వివాహం ఖరారయ్యే అవకాశం ఉండొచ్చు. ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే ఆ డబ్బు మీ దగ్గరకు చేరుతుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఎదైనా లక్ష్యంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలి.
తులా రాశి కొత్త పనులు ప్రారంభించేందుకు ఈ రోజు మంచిది. పిల్లలకు సంబంధించిన పనులు పూర్తిచేసేందుకు ప్రయత్నించాలి. స్నేహితులను కలుస్తారు. మీరున్న రంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. కొత్త శత్రువులు ఏర్పడే అవకాశం ఉంది. స్వార్థంగా ఆలోచించవద్దు. సామాజిక రంగాల్లో పనిచేసే వారి గౌరవం పెరుగుతుంది. వృశ్చిక రాశి
ఈ రోజు ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఎవరి నుంచి అప్పు తీసుకోవద్దు. వ్యాపారంలో ఎవరి మాట విని డబ్బులు పెట్టుబడి పెట్టొద్దు..భవిష్యత్ లో సమస్యలు పెరిగే అవకాశం ఉంది. పెరుగుతున్న ఖర్చులు మీకు తలనొప్పిగా మారుతాయి. విద్యార్థులు చదువులో ఏకాగ్రతతో ఉండాలి. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీ ఆగిపోయిన పని పూర్తవుతుంది.
ధనుస్సు రాశి
ఈ రోజు ఓ శుభవార్త వింటారు. ఉన్నతాధికారుల నుంచి మీకు పూర్తి సహకారం అందుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగవుతుంది. మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారి కోరిక నెరవేరుతుంది. ఉన్నతమైన పనుల్లో మీరు ముందుకు సాగుతారు. పని ప్రదేశంలో మీకు పెద్ద విజయం లభించడం వల్ల మీ సంతోషానికి అవధులు ఉండవు. ఎవరితోనూ అనవసరంగా గొడవ పడకండి. మకర రాశి
ఈ రోజు మీకు గౌరవం పెరుగుతుంది. కళా నైపుణ్యంలో మెరుగుదల వస్తుంది. మీరున్న రంగంలో మీ ధైర్యం పెరుగుతుంది. దీర్ఘకాలిక ప్రణాళికల్లో వేగం పెరుగుతుంది. మీ స్థానం పెరగడం వల్ల మీరు సంతోషంగా ఉంటారు. ఆలోచనకు తగ్గట్టుగా అన్ని పనులు పూర్తవుతాయి. వారసత్వ ఆస్తుల విషయంలో ఓ శుభవార్త వింటారు. ఆదాయం పెరగడం వల్ల మీరు సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో లాభదాయక అవకాశాలపై దృష్టి పెట్టాలి.
కుంభ రాశి
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. కొత్త పనిని ప్రారంభించడంలో మీకు అదృష్టం పూర్తిగా సహకరిస్తుంది. మీ పనుల్లో కొన్ని అడ్డంకులు వస్తున్నట్లయితే అవి తొలగిపోతాయి. వ్యాపారంలో మీకు లాభం ఉంటుంది. దీర్ఘకాలిక ప్రణాళికల్లో వేగం పెరుగుతుంది. ఆధ్యాత్మికత విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఏదైనా పని కారణంగా మీరు అకస్మాత్తుగా ప్రయాణం చేయాల్సి రావచ్చు.
మీన రాశి
ఈ రోజు మీరు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ పనుల్లో తెలివిగా ముందుకు సాగండి. ఇతరుల పనులపై దృష్టి పెడితే మీరు నష్టపోవాల్సివస్తుంది. మీ పనుల్లో ఎవరితోనూ సలహా తీసుకోవద్దు మీకు ప్రయోజనం ఉండదు. కుటుంబ సభ్యుల సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది. పనుల్లో తొందరపడే అలవాటును మానుకోవాలి.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ నక్షత్రం ప్రకారం కందాయ ఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.