ఏప్రిల్ 05 శనివారం రాశిఫలాలు

మేష రాశి

కొత్త ప్రారంభాలకు ఈ రోజు మీకు చాలా మంచిది. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. మార్కెటింగ్ రంగంలో ఉండేవారు ప్రయోజనం పొందుతారు. వైవాహికి జీవితం సంతోషంగా ఉంటుంది. వాణిజ్య ప్రయాణానికి అవకాశాలు ఉన్నాయి. జీవనశైలిలో కొత్తదనం ఉంటుంది. 

వృషభ రాశి

ఈ రోజు మీకు అనుకోని ఇబ్బంది ఎదురవుతుంది. అబద్ధాలు చెప్పడం మంచిదికాదు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు.  కొందరు పిల్లల గురించి ఆందోళన చెందుతారు. ఉన్నత అధ్యయనాల్లో విద్యార్థులకు కొంత ఇబ్బంది ఉంటుంది. 

మిథున రాశి

ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు. మీ ప్రవర్తనలో మర్యాద ఉంటుంది. విదేశాలకు ప్రయాణించే అవకాశం ఉంది. షాపింగ్ సమయంలో మీ బడ్జెట్‌ను జాగ్రత్తగా చూసుకోండి. ఈ రోజు మీరు షాపింగ్‌తో చాలా బిజీగా ఉండవచ్చు.  

కర్కాటక రాశి

రాజకీయాల్లో ఉండేవారికి ఈ రోజు మంచిది కాదు. పరిస్థితులపై తీవ్రంగా  స్పందించవద్దు..శాంతిగా ఉండేందుకు ప్రయత్నించండి.  డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. వ్యాపారాన్ని విస్తరించడంలో ఇబ్బంది ఉంటుంది. జీవిత భాగస్వామితో వివాదం ఉండవచ్చు. 

సింహ రాశి

ఈ రోజు నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యుల నుంచి అంగీకారం లభిస్తుంది. కొత్త ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. మీ కోరికలు నెరవేరుతాయి. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. 

కన్యా రాశి

ఈ రోజు మీకు చాలా మంచి రోజు.  ఏదైనా సమస్యకు జాగ్రత్తగా స్పందించండి. చిన్న పిల్లలతో మీ సంబంధాన్ని మంచిగా ఉంచండి. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు పొందుతారు. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు.  ఈ రోజు కెరీర్‌కు చాలా మంచి రోజు.

తులా రాశి

ఈ రోజు కొంత జాగ్రత్త వహించండి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఈ రోజు మీరు పరిశోధనలపై ఆసక్తి చూపిస్తారు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయటా మీపై గౌరవం పెరుగుతుంది. 

వృశ్చిక రాశి

మీపై మీరు అతి విశ్వాసాన్నిపెట్టుకోవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ఉద్రిక్తతకు అవకాశం ఉంది. స్నేహితులు మీపై కోపంగా ఉండవచ్చు. ఈ రాశి వృద్ధులు అనారోగ్యంతో బాధపడతారు. 

ధనస్సు రాశి

ఈ రోజు ఒత్తిడి తొలగిపోతుంది. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. భాగస్వామ్యంతో వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్లాన్ చేయవచ్చు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతారు. 

మకర రాశి

ఈ రోజు పాత సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నించండి. మీరు ఓ ముఖ్యమైన సమావేశానికి వెళ్లేట్టైతే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం హెచ్చుతగ్గులుగా ఉంటుంది.

కుంభ రాశి

ఈ రోజు మీపై  ఒత్తిడి పెరుగుతుంది.  పిల్లల తప్పు పిల్లలను విస్మరించవద్దు. సంభాషణ సమయంలో మాట తూలొద్దు.  మీ మాటలను ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఊహించని ఖర్చులు పెరుగుతాయి.

మీన రాశి

ఈ రోజు నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీరు పాత స్నేహితులను కలుస్తారు.  విద్యార్థులు అధ్యయనాలపై ప్రత్యేక శ్ర్ధ పెడతారు. కార్యక్షేత్రంలో ఉండే సమస్యలు పరిష్కరించుకోవడంలో సక్సెస్ అవుతారు.  

శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో  మీ నక్షత్రం ప్రకారం కందాయ ఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి 

గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.