మే 01 రాశిఫలాలు
మేష రాశి
మే నెల మొదటి రోజు మేష రాశి వారికి ఆశావాదంతో మొదలువుతుంది. అకస్మాత్తుగా లాభం వచ్చే అవకాశం ఉంది. మీరు మీ పనిలో విజయవంతం అవుతారు. మీ కలలు నెరవేరుతాయి. కెరీర్‌లో ముందుకు సాగే అవకాశం లభిస్తుంది. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కొత్త వ్యక్తులు మరియు పెద్దలను కలవడానికి కూడా మీకు అవకాశం లభించవచ్చు. వ్యాపార రంగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి అవకాశం లభించవచ్చు.
వృషభ రాశి
మే నెల మొదటి రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. మీరు చేపట్టే పనిలో విజయవంతం అవుతారు. మీ ధైర్యం పెరుగుతుంది. మీ ఆలోచనలు మరియు సామర్థ్యాలపై మీరు నమ్మకం ఉంచాలి . మీ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించాలి. శత్రువులు పొంచి ఉన్నారు అప్రమత్తంగా వ్యవహరించండి. మీ ప్రణాళికలను బహిర్గతం చేయొద్దు. కుటుంబ పెద్దల నుంచి మీకు ప్రేమ, సహకారం లభిస్తుంది. మీ మనస్సు ధర్మకార్యాల వైపు మళ్ళుతుంది.
మిథున రాశి మిథున రాశివారికి ఈ రోజు ఖర్చుతో కూడిన రోజుగా ఉండవచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని అనిశ్చితులను ఎదుర్కోవాల్సి రావచ్చు, ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. వ్యాపారంలో కొన్ని ఊహించని సంఘటనలను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన వాయిదా వేయండి. మీ వ్యక్తిత్వంలో కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది. ఆధ్యాత్మికత, తత్వశాస్తంర వైపు దృష్టి సారిస్తారు.
కర్కాటక రాశి
ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. చేపట్టిన పనిలో విజయం లభిస్తుంది. మీ శ్రమకు పూర్తి ఫలితం దక్కుతుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ బంధువుల నుంచి శుభవార్త వింటారు. దాంపత్య జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు రోజంతా బిజీగా ఉంటారు. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగం లేదా ఏదైనా టెండర్ పొందడానికి ప్రయత్నిస్తున్న వారు గుడ్ న్యూస్ వింటారు. ఏ పనిలోనైనా అధిక ఉత్సాహంతో ఉండకండి.
సింహ రాశి
సింహ రాశి వారు ఈ రోజు మంచి రోజు అవుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగులు పనిలో బిజీగా ఉంటారు...పడిన కష్టానికి ప్రశంసలు అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధం అవుతున్న వారికి సమయం కలిసొస్తుంది. పెరుగుతున్న ఖర్చులపై నియంత్రణ ఉంచుకోవడం అవసరం.
కన్యా రాశి ఈ నెల మీకు ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగులు పనిచేసే ప్రదేశంలో అధికారుల నుంచి సహకారం పొందుతారు. పెట్టుబడులలో మంచి లాభం లభిస్తుంది. వ్యాపారంలో డబ్బు సంపాదించే అనేక మార్గాలను మీరు సృష్టించవచ్చు. కొత్త ప్రాజెక్ట్ బాధ్యతను స్వీకరించే అవకాశం లభిస్తుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం స్పెండ్ చేస్తారు. మీ భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటారు. విద్యార్థులు మెరుగైన ఫలితాలు పొందుతారు.
తులా రాశి
ఈ రోజు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీ ఆలోచన తీరు, పనితీరు మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నించండి. తొందరపాటులో ఏ నిర్ణయం తీసుకోకండి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. ఏదైనా పని కారణంగా ప్రయాణం చేసే అవకాశం ఉండవచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని గందరగోళాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. సంతానం విషయంలో ఆందోళన ఉంటుంది
వృశ్చిక రాశి
ఈ రోజు మీకు సవాళ్లతో నిండి ఉంటుంది. చేసే పనిలో గందరగోళంగా అనిపిస్తుంది, అడ్డంకులను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ దృక్పథాన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉండవచ్చు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాయామం గురించి కూడా జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. విదేశీ ప్రయాణంకోసం ప్రయత్నిస్తున్నవారు విజయవంతం అవుతారు. సామాజిక కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు.
ధనుస్సు రాశి
ఈ రాశివారికి పెట్టుబడులు కలిసొస్తాయి. చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా అడుగులు ముందుకేస్తారు. కోర్టుకేసులలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం బావుంటుంది
మకర రాశి
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి కష్టపడాలి. కుటుంబంతో సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ధైర్యంగా దూసుకెళ్తేనే పనులు పూర్తవుతాయి. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి లేదంటే నష్టపోతారు. ధర్మకార్యాలు , ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు. కుంభ రాశి
ఈ రోజంతా మీకు గందరగోళంగా అనిపిస్తుంది. చేపట్టిన పనిని జాగ్రత్తగా చేయాలి..మీ చుట్టూ ఉన్న వారి నుంచి సహకారం తీసుకోవలసిన అవసరం ఉండవచ్చు. మీ పిల్లలతో సమయం గడపడానికి అవకాశం లభించవచ్చు. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామి భావోద్వేగాలు, మాటలపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది
మీన రాశి
ఈ రాశివారు ఈ రోజు లాభపడతారు. అదృష్టం కలిసొస్తుంది. కానీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సహనంగా వ్యవహరించడం వల్లనే మీకు మంచి జరుగుతుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.