మే 17 రాశిఫలాలు
మేష రాశి (Aries) - 17 మే 2025
ఈ రోజు మీ ప్రేమ జీవితం ఓ కొత్త మలుపు వస్తుంది. వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. కొంత డబ్బు సమకూర్చుకుంటారు. ఆస్తికి సంబంధించిన వివాదం ఉంటే సమసిపోతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
వృషభ రాశి (Taurus) - 17 మే 2025
వృషభ రాశి వారికి ఈ రోజు సంతోషాన్నిస్తుంది. ఒకేసారి చాలా పనులు చేయాల్సి రావడం వల్ల మీరు బిజీగా ఉంటారు. చేపట్టిన పనులు సులభంగా పూర్తిచేస్తారు. కుటుంబ బంధాలు బావుంటాయి. సమస్యలు తొలగిపోతాయి
మిథున రాశి (Gemini) - 17 మే 2025
ఈ రోజు మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలున్నాయి. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థులకు వారి కోరిక నెరవేరవచ్చు. మీకు పని ప్రదేశంలో ఏదైనా పని అప్పగించినట్లయితే దాన్ని సకాలంలో పూర్తి చేయాలి. అందరి సహకారంతో పనులు పూర్తిచేస్తారు. మీ మనసులోని విషయాలను ఎవరితోనూ పంచుకోకండి. కర్కాటక రాశి (Cancer) - 16 మే 2025
ఈ రోజు కర్కాటక రాశి వారికి నిరాశగా ఉంటుంది. ఏ పని చేపట్టినా మీకు నిరాశే ఎదురవుతుంది. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే, అనుభవజ్ఞులైన వ్యక్తి సలహా తీసుకుని చేయండి. మీరు మీ జీవిత భాగస్వామి కోసం కొత్త పని ప్రణాళికను రూపొందించవచ్చు. కుటుంబంలో ఏదైనా పూజా కార్యక్రమం జరగడం వల్ల బంధువులుంటాయి. సింహ రాశి (Leo) - 17 మే 2025
ఈ రోజు సింహ రాశి వారి వ్యాపారులు ఆర్థికంగా లాభపడతారు. అధ్యయనాలపై ఆసక్తి చూపిస్తారు. చేపట్టిన పనులు వాయిదా వేయొద్దు...వెంటనే పూర్తిచేయకుంటే సమస్యలు తప్పవు. ఎవరినీ నమ్మొద్దు. అప్పులు తీసుకున్నట్టైతే తిరిగి చెల్లించేందుకు ప్రయత్నించండి
కన్యా రాశి (Virgo) - 17 మే 2025
ఈ రోజు కన్యా రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఉద్యోగంలో ఉన్నవారు పార్ట్ టైమ్ పని చేయాలనుకుంటే వారి కోరిక నెరవేరుతుంది. మీరు పని ప్రదేశంలో ఉన్నతాధికారుల నుంచి పూర్తి సహకారం పొందుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీ పాత వ్యాధి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. వైద్య సలహా తీసుకోండి.
తులా రాశి (Libra) - 17 మే 2025
ఈ రోజు తులా రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులు ఏదైనా పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే కష్టపడి చదవాలి. మీ ఆత్మగౌరవం పెరగడం వల్ల మీరు అన్ని పనుల్లోనూ నిర్భయంగా ముందుకు సాగుతారు. డబ్బు అప్పుగా ఇచ్చేముందు అది తిరిగి వస్తుందో రాదో చూసుకోండి. జీవిత భాగస్వామితో అన్ని విషయాలు షేర్ చేసుకోండి.
వృశ్చిక రాశి (Scorpio) - 17 మే 2025
సామాజిక రంగాలలో పనిచేసే వారికి ఈ రోజు చాలా మంచిది. మీరు మంచి పనుల ద్వారా ఉన్నత స్థానాన్ని పొందవచ్చు. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. మీ మనసులో ఉన్న సమస్యల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడండి. పిల్లలకు కొంత బాధ్యత ఇస్తే వారు దాన్ని సరిగ్గా నిర్వహిస్తారు.
ధనుస్సు రాశి (Sagittarius) - 17 మే 2025
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. పిల్లల కెరీర్ గురించి ఆందోళన చెందుతారు. పని ప్రదేశంలో మీకు పదోన్నతి లేదా జీతం పెంపు వంటి శుభవార్త రావొచ్చు. మనసు సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఏదైనా విషయంపై గొడవ జరుగుతుంది..మీరు బాధపడతారు. మకర రాశి (Capricorn) - 17 మే 2025
ఈ రోజు మీ మనసులో మాట చెప్పాలి అనుకుంటే జాగ్రత్తగా తెలియజేయండి. మీరు చేసిన తప్పులు నిజాయితీగా అంగీకరిస్తే బంధం నిలబడుతుంది. ఉద్యోగులు పనివిషయంలో శ్రద్ధగా ఉండాలి. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం.
కుంభ రాశి (Aquarius) - 17 మే 2025
కుంభ రాశి వారికి ఆర్థికంగా మంచి రోజు. పిల్లల వైపు నుంచి ఏదైనా సంతోషకరమైన సమాచారం వింటారు. కుటుంబంలోని పెద్దలతో ఏదైనా విషయంపై గొడవ పడకండి. వ్యాపారం చేస్తున్న వారికి కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం బావుంటుంది.
మీన రాశి (Pisces) - 17 మే 2025
ఈ రాశివారికి సమస్యలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా విషయంపై గొడవ జరగుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. కొంతకాలంగా వెంటాడుతున్న ఆస్తి సమస్య పరిష్కారం అవుతుంది. తల్లిదండ్రుల సేవలో మీరు కొంత సమయం గడుపుతారు.
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.