2025 జూన్ 21 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu June 21st 2025

మేష రాశి (Aries) జూన్ 21, 2025

ఈ రోజు  లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి.   మీ ప్రియమైన వారితో సంబంధాలను కొనసాగిస్తారు కానీ  రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.  పెరుగుతున్న ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి లేదంటే తర్వాత సమస్యలు ఎదుర్కోవచ్చు. చేపట్టిన పని ఏదైనా పూర్తికాకుండా ఆగిపోవచ్చు. ఎవరికైనా వాగ్దానం చేస్తే ఆలోచించండి...లేదంటే  దానిని నెరవేర్చడంలో సమస్యలను ఎదుర్కొంటారు. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృషభ రాశి (Taurus) జూన్ 21, 2025

ఈ రోజు మీకు కార్యాలయంలో మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో వేగం పెరుగుతుంది. కొంతమంది కొత్త వ్యక్తులను కలుస్తారు. వ్యాపార ప్రణాళికలు ఫలవంతమవుతాయి. పని రంగంలో మీకు మంచి లాభం వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వారికి పదోన్నతి లభిస్తుంది.  కుటుంబంలో ఎవరి వివాహంలోనైనా వస్తున్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ఏదైనా పని చేయడంలో మీకు సమస్యలు ఎదురైతే అవి తొలగిపోతాయి. వ్యక్తిగత విషయాల్లో ఎవరి సలహా తీసుకోకండి.

మిథున రాశి (Gemini) జూన్ 21, 2025

ఈ రోజు మీ ప్రతిష్ట పెరుగుతుంది. సామాజిక రంగాల్లో పనిచేసే వ్యక్తులు సత్కారాలు పొందుతారు. మీరు పనిపై పూర్తి నమ్మకం ఉంచండి.  ఇంట్లో సభ్యుల మధ్య ఏదైనా విషయంలో మనస్పర్థలు ఉంటే అవి తొలగిపోతాయి.  బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వ్యక్తులు పొదుపు పథకాలపై పూర్తి శ్రద్ధ చూపుతారు. మహిళా స్నేహితుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.  

కర్కాటక రాశి (Cancer) జూన్ 21, 2025

ఈ రోజు మీకు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది.  ఏదైనా రిస్క్ తీసుకుంటే సమస్యలు ఎదుర్కొంటారు.  సామాజిక విషయాలపై పూర్తి శ్రద్ధ వహించాలి. దీర్ఘకాలిక ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ మీరు ఏదైనా రహస్యంగా ఉంచితే, అది  బయటపడుతుంది.  ఉద్యోగంలో మార్పులు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మీకు మంచి అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీ ఇంట్లో ఏదైనా  మంగళకరమైన కార్యక్రమం నిర్వహించడం వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

సింహ రాశి (Leo) జూన్ 21, 2025

ఈ రోజు మీకు ఆకస్మిక లాభాలు వస్తాయి. మీకు కుటుంబ సభ్యుల ప్రేమ, సహకారం లభిస్తుంది. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. పెద్ద వ్యాధిగా మారే అవకాశం ఉంది. వ్యాపారంలో రిస్క్ తీసుకోవాల్సి వస్తే అనుభవజ్ఞుడైన వ్యక్తిని సంప్రదించండి.  పెద్దలతో మాట్లాడేటప్పుడు వినయంగా ఉండాలి.  రక్త సంబంధీకులతో ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. అప్పులు ఇవ్వాల్సి రావొచ్చు.  

కన్యా రాశి (Virgo) జూన్ 21, 2025

ఈ రోజు మీ  కీర్తి  పెరుగుతుంది. వ్యాపారంలో మీకు ప్రోత్సాహం లభిస్తుంది.  లావాదేవీల విషయంలో  జాగ్రత్తగా ఉండాలి. పని రంగంలో మీరు మీ  ఆలోచనలను సద్వినియోగం చేసుకుంటారు. మీరు మీకన్నా ఇతరుల పనులపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. భాగస్వామ్యంతో పని చేయడం వల్ల మీకు మంచి లాభం లభిస్తుంది. రాజకీయాలలో పనిచేసే వ్యక్తులకు ఈ రోజు ఏదైనా ముఖ్యమైన బాధ్యతలు తీసుకుంటారు.  

తుల రాశి (Libra) జూన్ 21, 2025

ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. మీరు పని చేసే ప్రదేశంలో రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ జీవితం గడుపుతున్న వ్యక్తులు తమ భాగస్వామితో ఏదైనా రహస్యంగా ఉంచినట్లయితే ఈ రోజు బయటపడుతుంది. మీ స్నేహితుడి ఆరోగ్యం గురించి  ఆందోళన చెందుతారు. పని ఏదైనా చాలా కాలంగా నిలిచిపోయినట్లయితే అది పూర్తయ్యే అవకాశం ఉంది. ఎవరి వాహనాన్ని మీరు వినియోగించవద్దు. ఇంట్లో ఏదైనా మతపరమైన కార్యక్రమం నిర్వహించవచ్చు.

వృశ్చిక రాశి (Scorpio) జూన్ 21, 2025

ఈ రోజు మీకు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. మీ ముఖ్యమైన ప్రణాళికలపై దృష్టి పెట్టండి. ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న వ్యక్తులు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. అప్పులు చేయాలి అనుకుంటే సులభంగా లభిస్తుంది. మీ కళా నైపుణ్యం మెరుగుపడుతుంది. మీరు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు ఏదైనా పోటీలో పాల్గొంటే  విజయం సాధిస్తారు. మీ సంతానం గురించి అసంతృప్తి ఉండవచ్చు.

ధనుస్సు రాశి (Sagittarius) జూన్ 21, 2025

ఈ రోజు మీకు తొందరపడి ఏదైనా పని చేయొద్దు. వ్యాపార పనులపై మీరు పూర్తిస్థాయి దృష్టి పెడతారు. పెద్దల నుంచి పూర్తి సహకారం పొందుతారు.  ఏదైనా ముఖ్యమైన విషయాన్ని ఇతరులతో పంచుకోకండి. పెద్దల సలహా , సూచనలను పాటించడం మీకు మంచిది. ఏదైనా విషయం గురించి అనవసరంగా గొడవపడతారు. మీ ప్రత్యర్థులు కొందరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. 

మకర రాశి (Capricorn) జూన్ 21, 2025

ఈ రోజు మీకు ఆర్థికంగా మంచి రోజు.  ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే,అది మీకు తిరిగి రావచ్చు. మతపరమైన యాత్రకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. మీ మనస్సులో కోరిక నెరవేరుతుంది. ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉంది. మీకు ధనలాభం వచ్చే అవకాశం ఉంది. పొట్టసంబంధిత సమస్యలు ఉండవచ్చు.

కుంభ రాశి (Aquarius) జూన్ 21, 2025

ఈ రోజు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీరు ఎవరికైనా వాగ్దానం చేస్తే దానిని సకాలంలో పూర్తి చేయాలి.  మీ జీవనశైలిని మెరుగుపరుస్తారు.  పని రంగంలో, మీరు మీ సహోద్యోగి కారణంగా మోసపోయే అవకాశం ఉంది.  మీ దినచర్యను మెరుగుపరచుకోవాలి లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.  బంధువులతో కొంత ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు.ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు. మీన రాశి (Pisces) జూన్ 20, 2025

ఈ రోజు మీ ఆలోచనలు సృజనాత్మకంగా ఉంటాయి. మీ నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. అందరినీ కలుపుకుపోయే ప్రయత్నంలో మీరు విజయం సాధిస్తారు. వ్యాపారంపై  పూర్తి దృష్టి పెడతారు, అప్పుడే మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. భాగస్వామ్యంతో ఏదైనా పని చేయడం మీకు విజయవంతమవుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు ఏదైనా చట్టపరమైన విషయంలో జాగ్రత్తగా ఉండాలి 

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.