2025 జూన్ 15 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu June 15th 2025
మేష రాశి (Aries) జూన్ 15, 2025
మేష రాశి వారికి ఈ రోజు చాలా ముఖ్యమైనది. పనికిరాని విషయాలపై దృష్టి పెట్టవద్దు. ఉద్యోగస్తులు పనిపై పూర్తి శ్రద్ధ వహించాలి. వ్యాపారులు నూతన ప్రణాళికల వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. మీ ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం చేసే ప్రదేశంలో మీ నైపుణ్యం బలపడుతుంది. మీ ప్రవర్తనపై శ్రద్ధ వహించండి.. మీతో కలిసి పనిచేసే వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి. వైవాహిక జీవితంలో ఏదో ఒక విషయంలో ఒత్తిడి పెరగవచ్చు.
వృషభ రాశి (Taurus) జూన్ 15, 2025
వృషభ రాశి వారికి ఈ రోజు బాగుంటుంది. మీలో సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. మీరు ఆకర్షణీయంగా ఉంటారు. ఉద్యోగం చేసే ప్రదేశంలో మీ స్థానం బలపడుతుంది. ఆదాయం పెరుగుతుంది..ఖర్చులు తగ్గుతాయి. కుటుంబంలో సామరస్యం ఉంటుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. మిథున రాశి (Gemini) జూన్ 15, 2025
మిథున రాశి వారికి ఈ రోజు బాగుంటుంది. మీరు పనిపై బాగా దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధిస్తారు.ఆదాయం పెరుగుతుంది. కుటుంబ వాతావరణం బాగుంటుంది కానీ వైవాహిక జీవితంలో ఏదో ఒక కారణంతో ఒత్తిడి పెరగవచ్చు. ప్రేమ జీవితం గడిపేవారి మధ్య ప్రేమ పెరుగుతుంది. రోజంతా ఆనందంగా ఉంటారు. కర్కాటక రాశి (Cancer) జూన్ 15, 2025
కర్కాటక రాశి వారికి ఈ రోజు బాగుంటుంది. ఎప్పటి నుంచో వస్తున్న సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. పిల్లల గురించి ముఖ్యమైన విషయాల గురించి చర్చించవచ్చు. గృహ సంబంధిత పనుల విషయంలో మీ బాధ్యత పెరుగుతుంది. సింహ రాశి (Leo) జూన్ 15, 2025
సింహ రాశి వారికి ఈ రోజు బావుంటుంది. చాలా కాలంగా ఉన్న పాత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కానీ అధిక పని కారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు. కొత్త ఆర్డర్స్ వస్తాయి. ప్రేమ జీవితం గడిపేవారికి కొన్ని సమస్యలుంటాయి. కూర్చున మాట్లాడుకోవడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు ప్రయత్నించండి.
కన్యా రాశి (Virgo) జూన్ 15, 2025
కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మీ సంబంధాలు మధురంగా ఉంటాయి. భవిష్యత్తు కోసం కొన్ని పెద్ద పథకాలపై పని చేస్తారు. ప్రేమ జీవితం గడిపేవారు కొంత నిరాశను ఎదుర్కోవలసి రావచ్చు. ఉద్యోగులు పనిచేసే ప్రదేశంలో మంచి ఫలితాలు పొందుతారు. రోజంతా వ్యాపార కార్యకలాపాల్లో బిజీగా ఉంటారు.
తులా రాశి (Libra) జూన్ 15, 2025 ఈ రోజంతా చాలా బిజీగా ఉంటారు. ఎక్కువ పనిభారాన్ని తీసుకోవద్దు. ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించండి..లేకపోతే అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితంలో కఠిన పరిస్థితులు ఎదురవుతాయి. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ప్రియమైన వారి గురించి బంధువులతో మాట్లాడతారు. పని విషయంలో ఎక్కువ కష్టపడితేనే మంచి ఫలితం లభిస్తుంది. వ్యాపారంలో పెద్ద వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి.
వృశ్చిక రాశి (Scorpio) జూన్ 15, 2025
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మధ్యస్తంగా ఉంటుంది. అనవసరమైన విషయాలను వదిలి మీ పనిపై దృష్టి పెడితే లాభపడతారు. ప్రేమ జీవితం గడిపేవారికి ఇది మంచి సమయం. అవివాహితులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. వివాహితుల జీవితం సంతోషంగా ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ధనుస్సు రాశి (Sagittarius) జూన్ 15, 2025
ధనుస్సు రాశి వారు ఈ రోజు కొన్ని పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటారు. పాత స్నేహితులతో మాట్లాడతారు. మనస్సు సంతోషంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం బాగుంటుంది. వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలో ఎవరైనా ఎక్కువగా మాట్లాడటం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపారులకు ఈ రోజు మంచి ఫలితాలు వస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.
మకర రాశి (Capricorn) జూన్ 15, 2025
మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. కొన్ని ఆగిపోయిన పనులు పూర్తవ్వడం వల్ల మీ ఆత్మవిశ్వాసం బాగుంటుంది. వ్యక్తిగత జీవితం - ఉద్యోగం మధ్య సమతుల్యతను కొనసాగించండి. వ్యాపారం వేగంగా ముందుకు సాగుతుంది. మీరు మీ కష్టానికి ప్రతిఫలం పొందుతారు. దాంపత్య జీవితంలో మంచి సమన్వయం ఉంటుంది.
కుంభ రాశి (Aquarius) జూన్ 15, 2025
కుంభ రాశి వారికి ఈ రోజు బాగుంటుంది. ధనం వచ్చే అవకాశం ఉంది, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్లడం వల్ల మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. ఏదైనా నూతన ప్రణాళికను అమలు చేయాలి అనుకుంటే మంచి జరుగుతుంది. కుటుంబంలో సంతోషం నిండి ఉంటుంది. తండ్రి పరిచయాల వల్ల మీ మనోధైర్యం బలపడుతుంది.
మీన రాశి (Pisces) జూన్ 15, 2025
మీన రాశి ఉద్యోగులు శుభవార్త వింటారు. మీ చుట్టూ ఉండేవారు మీకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. వ్యాపారులు లాభం పొందుతారు. ఆదాయం బాగుండటం సంతోషంగా ఉంటారు. దాంపత్య జీవితంలో ఏదో ఒక విషయంలో మనస్పర్థలు రావచ్చు. సోదరుల మధ్య సంబంధాలు బాగుంటాయి. ఏదైనా ముఖ్యమైన పనిలో ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ప్రియమైన వ్యక్తి రాకతో కుటుంబంలో సరదా వాతావరణం ఉంటుంది.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.