2025 సెప్టెంబర్ 19 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu September 19th 2025
మేష రాశి
మేషరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి మహిళలు ఓ శుభవార్త వింటారు. ఈ రోజు మీ ఆలోచనలకు కార్యాలయంలో సీనియర్ల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. మీరు భవిష్యత్తు కోసం ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకోవచ్చు. మీ గౌరవం పెరుగుతుంది.
శుభ సంఖ్య: 3రంగు: ఎరుపుపరిహారం: హనుమంతునికి బెల్లం , శనగలు సమర్పించండి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రోజు చాలా బాగుంటుంది. మీ స్నేహితుడు లేదా బంధువు మిమ్మల్ని కలవడానికి వస్తారు. తెలియని వ్యక్తి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మతపరమైన పనులపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఒక బహుళజాతి సంస్థ నుంచి ఆఫర్ రావచ్చు. ప్రేమికులకు రోజు బాగుంటుంది. విద్యార్థులు చదువు కోసం విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. శుభ సంఖ్య: 6 రంగు: తెలుపుపరిహారం: లక్ష్మీదేవికి పాయసం సమర్పించండి.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. మీ సన్నిహితులు మీకు ఆశ్చర్యకర బహుమతులు ఇవ్వవచ్చు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి, విజయం లభిస్తుంది. విద్యార్థులకు ఈ రోజు బాగుంది. నూతన దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
శుభ సంఖ్య: 5రంగు: ఆకుపచ్చపరిహారం: తులసి మొక్కకు నీరు పోసి 11 సార్లు ప్రదక్షిణలు చేయండి.
కర్కాటక రాశి
ఈ రోజు మీ కోరికలను నెరవేర్చే రోజు. మంచి పేరు తెచ్చుకునే అవకాశం లభిస్తుంది. శత్రువులు దూరంగా ఉంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో మంచి లాభం రావడంతో ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.
శుభ సంఖ్య: 2రంగు: సిల్వర్పరిహారం: దుర్గామాతకు ఎర్రటి పువ్వులు సమర్పించండి.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలను తెస్తుంది. ఈ ఫలితం వ్యాపారానికి సంబంధించినది కావచ్చు. జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆదాయం పెరుగుతుంది. మీ పురోగతితో కుటుంబ సభ్యులు గర్వపడతారు. మనస్సులో కొత్త ఆలోచనలు వస్తాయి. ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి.
శుభ సంఖ్య: 1రంగు: బంగారుపరిహారం: సూర్య భగవానుడికి నీటిలో ఎర్రటి పువ్వులు వేసి సమర్పించండి.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఏదైనా పనిని పూర్తి చేయడానికి కొత్త మార్గాలను పరిశీలిస్తారు. కొత్త వాహనం ఆనందం లభిస్తుంది. జీవిత భాగస్వామి స, తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. విద్యార్థులు బాగా చదువుకుంటారు. ఉద్యోగులు కార్యాలయంలో మంచి పనితీరు కనబరుస్తారు. శుభ సంఖ్య: 7రంగు: ఆకుపచ్చపరిహారం: గణేశుడికి దూర్వా సమర్పించండి.
తులా రాశి
తులా రాశి వారికి ఈ రోజు మీకు బాగుంటుంది. పాలన , అధికారానికి సంబంధించిన పూర్తి ప్రయోజనం లభిస్తుంది. మీ కీర్తి పెరుగుతుంది. సంతానం విజయం ఆనందాన్నిస్తుంది. వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. ఇంట్లో మార్పులకు సంబంధించిన నిర్ణయం తీసుకోవడానికి రోజు మంచిది.
శుభ సంఖ్య: 6రంగు: గులాబీపరిహారం: లక్ష్మీదేవికి తామర పువ్వులు సమర్పించండి
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు బాగుంటుంది. వ్యాపారంలో నిలిచిపోయిన పథకాలు ప్రారంభించడం వల్ల బిజీగా ఉంటారు. ఏదైనా ప్రణాళిక విజయవంతమవుతుంది. పెళ్లి గురించి ఇంట్లో చర్చలు జరుగుతాయి. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. బ్యాంకులో పనిచేసే వారికి నచ్చిన ప్రదేశానికి బదిలీ కావచ్చు.
శుభ సంఖ్య: 9రంగు: ఎరుపుపరిహారం: హనుమాన్ చాలీసా పఠించండి
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ రోజు బిజీగా ఉంటుంది. విద్యార్థులు తమ పనిని వాయిదా వేయకూడదు. కొత్తే విషయాలపై ఆసక్తి పెరుగుతుంది, గురువుల సహకారం లభిస్తుంది. స్నేహితుల సహాయంతో ఆదాయ మార్గాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
శుభ సంఖ్య: 3రంగు: పసుపుపరిహారం: గురువారం పేదలకు శనగపప్పు దానం చేయండి.
మకర రాశి
మకర రాశి వారికి ఈ రోజు బాగానే ఉంటుంది. అనవసరమైన చిక్కుల నుంచి దూరంగా ఉండి. మతపరమైన ప్రదేశంలో సమయం గడుపుతారు. ప్రయాణ యోగం ఉంది. పాత స్నేహితుల సహకారం లభిస్తుంది. ప్రేమికులకు రోజు బాగుంది. విద్యార్థులకు విజయం యోగం ఉంది.
శుభ సంఖ్య: 8రంగు: నీలంపరిహారం: శని దేవాలయములో నూనె దీపం వెలిగించండి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా పని గురించి ఉత్సాహంగా ఉంటారు. పని సకాలంలో పూర్తవుతుంది. ఆదాయానికి కొత్త మార్గాలు పెరుగుతాయి. కళ, సాహిత్యంపై ఆసక్తి ఉంటుంది. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. పిల్లలు ఆటలలో బిజీగా ఉంటారు.
శుభ సంఖ్య: 4రంగు: ఊదాపరిహారం: రావి చెట్టుకు నీరు పోసి దీపం వెలిగించండి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మార్పులతో నిండి ఉంటుంది. పూర్వీకుల ఆస్తి నుంచి లాభం పొందుతారు. కుటుంబంతో కలిసి మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. రాజకీయాలలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో సాధారణం కంటే ఎక్కువ లాభం ఉంటుంది.
శుభ సంఖ్య: 7రంగు: లేత నీలంపరిహారం: విష్ణువుకి పసుపు పువ్వులు సమర్పించండి.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.