Pakistan Nostradamus: ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన రియాజ్ అహ్మద్ గౌహర్ షాహీ అప్పట్లో చెప్పిన భవిష్యవాణి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 20-25 సంవత్సరాల క్రితం ఆయన చెప్పన భవిష్య వాణిలో భాగంగా... 2025లో ఒక పెద్ద తోకచుక్క భూమిని ఢీకొంటుందని, దానివల్ల ప్రపంచం అంతం అవుతుందని ఆయన హెచ్చరించారని పేర్కొంటున్నారు.
బ్రిటీష్ మీడియాలో తన పుస్తకం 'ది రిలీజియన్ ఆఫ్ గాడ్' లో ఇదే విషయాన్ని ప్రస్తావించడంతో ఈ చర్చ మరింత పెరిగింది. అందుకే ప్రజలు 2025ను ప్రళయ సంవత్సరంగా పేర్కొంటూ చర్చించుకున్నారు. షాహీని అనుసరించేవారంతా... 2025 డిసెంబర్ లోగా ప్రళయం రాబోతోందనే ప్రచారం చేశారు...
ఒక పెద్ద ఖగోళ వస్తువు భూమికి చాలా దగ్గరగా రాబోతోందని అంటున్నారు. అలా జరిగితే మహాసముద్రాలు పొంగిపొర్లుతాయని, భారీ భూకంపాలు వస్తాయని, మానవ నాగరికత అస్తవ్యస్తం అవుతుందని వారు వాదిస్తున్నారు. అయితే, ఈ వాదనలను శాస్త్రీయ కోణంలో చూస్తే, పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది, ఎందుకంటే ఈ వినాశనాన్ని ధృవీకరించే ఒక్క ఆధారం కూడా ఇంతవరకు లభించలేదు.
నాసా స్పష్టంగా చెప్పేసింది
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇటీవల విడుదల చేసిన నివేదికల్లో, భూమి వైపు అలాంటిదేమీ రాలేదని, అది ఢీకొట్టే ప్రమాదం లేదని స్పష్టం చేసింది. రాబోయే కాలంలో ఏదైనా తోకచుక్క లేదా గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం లేదని తేల్చేశారు. భూమి సమీపంలోకి వచ్చే వస్తువులపై నిరంతరం నిఘా ఉందని.. కానీ 2025 నాటికి ఎటువంటి ప్రమాద సంకేతాలు లేవని స్పష్టం చేశారు. అయితే సూర్యకాంతిలో దాగి ఉన్న కొన్ని గ్రహశకలాలు ఒక్కోసారి రాత్రికి రాత్రే కనిపించే అవకాశం ఉందని కూడా శాస్త్రవేత్తలు అంగీకరించారు కానీ ప్రస్తుతం భూమికి ముప్పుగా భావించే ఒక్క వస్తువు కూడా సమీపంలో లేదన్నారు
రియాజ్ గౌహర్ షాహీ ఎవరు?
పాకిస్తాన్ కు చెందిన రియాజ్ అహ్మద్ గౌహర్ షాహీని ఆయన అనుచరులు భవిష్యత్ వక్తగా భావిస్తారు. 2001లో ఆయన లండన్ నుంచి అకస్మాత్తుగా అదృశ్యమయ్యారాయన...ఆయన జీవించే ఉన్నారని అనుచరులు భావిస్తుంటారు. ఆయన భవిష్యవాణిలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. చాలా మంది ఆయనను నాస్ట్రడామస్ తో పోల్చుతారు.
2025లో నిజంగానే ప్రళయం రానుందా?
శాస్త్రవేత్తల ప్రకారం, 2025లో తోకచుక్క ఢీకొంటుందనే వాదన పూర్తిగా మతపరమైన వివరణలు మరియు నమ్మకాలపై ఆధారపడి ఉంది, శాస్త్రీయ పరిశోధనపై కాదు. భూమి వాతావరణం, ఖగోళ శాస్త్రం నిఘా వ్యవస్థ, ఆధునిక సాంకేతికత గ్రహాలు ..ఉపగ్రహాలను నిరంతరం గమనిస్తున్నాయి. దీని కారణంగా, రాబోయే సంవత్సరాల్లో ఏదైనా పెద్ద ప్రమాదం గురించి ముందే తెలుసుకోవచ్చు. ఈ ఏడాది ఇప్పటివరకూ అలాంటి సంకేతాలు లేవు.. 2025లో ప్రళయం రాబోతోందనే భయం అవసరం లేదంటున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించిన సమాచారం మాత్రమే. ఇక్కడ ABPదేశం ఏదైనా నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
'వారణాసి' ఈ పేరెలా వచ్చింది? అక్కడ ప్రత్యేకతలు , వింతలు ఏంటి? రాజమౌళి - మహేష్ సినిమాకు ఈ టైటిల్ ఎందుకు?