India-Pakistan War: జమ్ము కశ్మీర్‌లోని పహల్గాం (pahalgam terror attack) లో 2025 ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై ఆగ్రహం మరింత పెరిగిపోయింది. అసలే శత్రుదేశం కావడంతో క్రికెట్ మ్యాచ్ నే యుద్ధంలా భావిస్తాం..అలాంటిది పర్యాటకుల ప్రాణాలు బలితీసుకున్న ఉగ్రమూకని పెంచి పోషిస్తోన్న పాక్ కి బదులుచెప్పకుండా ఉండగలమా? పైగా ఈ కుట్రకు పాకిస్తాన్ అండదండలు ఉన్నాయనేందుకు స్పష్టమైన ఆధారాలు లభించాయని నిఘా వర్గాలు బయటపెట్టాయి. దీంతో భారత్ ప్రతీకార చర్యలకు దిగుతుందనే గుబులు దాయాది దేశంలో మొదలైంది. యుద్ధం జరుగుతుందేమో అనే చర్చలు జరుగుతున్నాయి. మరి గ్రహసంచారం ఏం చెబుతోందో తెలుసా.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రస్తుతం గ్రహాల స్థితి కూడా యుద్ధ వాతావరణాన్ని సూచిస్తోందంటున్నారు పంచాంగ కర్తలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్-పాక్ మధ్య యుద్ధం జరిగితే ఏ గ్రహం పెద్ద పాత్ర పోషిస్తుందో అనే అంచనాలు వేస్తున్నారు.మీన రాశిలో శని సంచారం నడుస్తోంది. పైగా ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి రాజు శని. ఫలితంగా శత్రుదేశంలో వివాదాలు , సంఘర్షణలు తగ్గే బదులు పెరిగే అవకాశం ఉందని సూచిస్తుంది. రాహులు కూడా ప్రస్తుతం మీన రాశిలో ఉన్నాడు..ఈ ఫలితంగా POKపై భారతదేశం పెద్ద చర్య తీసుకునే వాతావరణం కనిపిస్తోంది. రాహువు రాశి మారిన తర్వాత కూడా పరిస్థితి శాంతించే బదులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. 2025 మే 18న రాహువు మీన రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల దేశంలో ఆందోళనలు మరింత పెరుగుతాయ్. బృహస్పతి సంచారం కూడా ప్రపంచవ్యాప్తంగా యుద్ధం, ఒత్తిడి, ఆధిపత్యం కోసం పోరాటాన్ని సూచిస్తోంది. మహాభారత కాలంలో కూడా గురువు సంచారం ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడే కురుక్షేత్ర సంగ్రామం జరిగిందని చెబుతారు. ఫలితంగా ఇప్పడు భారత్-పాక్ మధ్య పెద్ద యుద్ధం జరిగే సూచనలున్నాయి.
ఇక మీనరాశిలో శని, రాహు, శుక్రుడితో కలసి బుధుడితో ఏర్పడిన చతుర్గ్రహి యోగం కూడా భారత్-పాకిస్థాన్ యుద్ధంలో పెద్ద పాత్ర పోషించవచ్చు. ఈ సమయంలో భారతదేశం పాకిస్థాన్‌పై పెద్ద యుద్ధ చర్య తీసుకునే అవకాశం ఉంది. ఏప్రిల్ 01 నుంచి జూన్ 30వరకు చాతుర్గహ కూటమి, త్రిగహయోగం ఏర్పడుతోంది. ఫలితంగా మే16 నుంచి జూన్ 4 వరకు కాలసర్పయోగం, ఇతర గ్రహయోగాలు వల్ల దేశంలో, రాష్ట్రంలో పరిపాలన సజావుగా నడవదు. పాలకులకు ప్రతీరోజు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. రాజస్థాన్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతాయి. అధిక వాహనప్రమాదాలు జరుగును. అగ్నిప్రమాదాలు అధికంగా జరిగి ప్రాణనష్టం ఆస్తినష్టం ఎక్కువగా ఉంటుంది. ఓ రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది. దేశంలో ఉగ్రవాద చర్యలు పెరుగుతాయి. సరిహద్దు ప్రాంతాల్లో చైనా, పాకిస్తాన్ వారు దురాక్రమణకు పాల్పడతారు. మనసైన్యం చాలా చాకచక్యంగా యుద్ధవ్యూహాలతో తిప్పికొడతారు. ముస్లిం దేశాల్లోనూ బాంబులు పేరి జననష్టం జరుగుతుంది. పశ్చిమాసియాదేశాల్లో యుద్ధవాతావరణం ఉంటుంది. ఉత్తరాదిరాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడి రహదారులుమూతపడతాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. ఏబీపీ దేశం ఈ సమాచారాన్ని ధృవీకరించదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేముందు నిపుణుల సలహాలు స్వీకరించండి.