Numerology prediction September 30th : న్యూమరాలజీ ప్రకారం సెప్టెంబరు 30 శుక్రవారం రోజు ఏఏ తేదీల్లో పుట్టినవారికి ఎలా ఉంటుందో.... ఫలితాలు తెలుసుకుందాం...


నంబర్ 1 (పుట్టిన తేదీలు 1, 10, 19, 28)
ఈ తేదీల్లో పుట్టినవారు ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికంగా బలంగా ఉంటారు. అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. వ్యాపారంలో అధిక లాభాలు పొందవచ్చు. రోజంతా సరదాగా ఉంటుంది.


నంబర్ 2 (పుట్టిన తేదీలు 2, 11, 20,29)
ఈ రోజు మీ మనస్సు చంచలంగా ఉంటుంది. ఉద్యోగ సంబంధిత బాధ్యతలు పెరగవచ్చు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే, సరిగ్గా ఆలోచించండి. పెద్ద సంస్థలతో సమన్వయం ఉంటుంది.


నంబర్ 3 (పుట్టిన తేదీలు 3, 12, 21, 30)
ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. ఆధునిక విషయాల పట్ల ఆకర్షితులవుతారు. మీరు శక్తివంతంగా ఉన్నట్టు అనుభూతి చెందుతారు. మీరు కుటుంబంలోని ఒకరి నుంచి బహుమతిని పొందుతారు.


Also Read: ఐదవ రోజు లతితా త్రిపురసుందరీ దేవి, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు


నంబర్ 4 (పుట్టిన తేదీలు 4, 13, 22, 31)
కళారంగంలో ఉన్నవారికి పెద్ద అవకాశాలు లభిస్తాయి. వ్యాపార వృద్ధి కోసం ఒకే విధానాన్ని అనుసరించండి. ప్రేమ జీవితంలో అలజడి ఉంటుంది. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.


నంబర్ 5 (పుట్టిన తేదీలు 5, 14, 23)
మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీరు ఊహాజనిత ఆలోచనలలో మునిగిపోతారు. పని ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల  తలనొప్పి రావచ్చు. ఉద్యోగులు తమ పనితీరుతో సీనియర్ అధికారులను మెప్పిస్తారు.


నంబర్ 6 (పుట్టిన తేదీలు 6, 15, 24)
ఈ రోజు మీ మనస్సు ప్రశాతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. సోదరుడి సహకారంతో పనులు సాగుతాయి. ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ వ్యక్తిగత వ్యక్తులతో సమయాన్ని ఆస్వాదించగలుగుతారు.


నంబర్ 7 (పుట్టిన తేదీలు 7, 16, 25)
ఈరోజు జీవితంలో కొన్ని కొత్త మార్పులు రావచ్చు. ఎప్పటి నుంచో కొనసాగుతున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.  ఆస్తికి సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రేమికుడిని కలుస్తారు.


నంబర్ 8 (పుట్టిన తేదీలు 8, 17,26)
ఈ తేదీల్లో పుట్టినవారికి ఈ రోజు ఏ పనిపైనా ఆసక్తి ఉండదు.  మీ మనసుకు అనుగుణంగా లేని కొన్ని పనులు చేయాల్సి రావచ్చు. విద్యార్థులు పరీక్షల కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఆదాయ వనరులు లభిస్తాయి.


Also Read: ఈ రాశివారు స్నేహమంటే ప్రాణమిస్తారు, మీ రాశికి ఏ రాశివారితో స్నేహం కుదురుతుందో చూసేయండి


నంబర్ 9 (పుట్టిన తేదీలు 9, 18,27)
ఈ తేదీల్లో పుట్టిన వారు ఈరోజు... పనికిరాని చర్చల్లోకి తలదూర్చకుండా ఉండడం మంచిది. వ్యక్తిగత సంబంధాల్లో వివాదాలకు అస్సలు అవకాశం ఇవ్వకపోవడమే  మంచిది. పనుల్లో మీ అడ్డంకులు తొలగిపోతాయి.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. ఎవరికైనా అప్పు ఇవ్వవలసి రావచ్చు.