Astrology Predictions by Numbers
నంబర్ 1 (పుట్టిన తేదీలు 1, 10, 19, 28)
1, 10, 19, 28 తేదీల్లో జన్మించినవారు మంచి దౌత్యవేత్తలు. ఈ రోజు పరిచయం అయ్యే వ్యక్తుల వల్ల మీకు మంచిజరుగుతుంది. న్యూమరాలజీ ప్రకారం ఇంటా బయటా గౌరవం పొందుతారు. మీ కళ పట్ల మీకున్న ప్రేమను ప్రియమైనవారితో పంచుకోవచ్చు. అదృష్ట సంఖ్య: 15 అదృష్ట రంగు: పింక్
నంబర్ 2 (పుట్టిన తేదీలు 2, 11, 20,29)
ఈ తేదీల్లో పుట్టినవారు ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తారు. ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చులు తగ్గించాలి. లేదంటే భవిష్యత్ లో ఇబ్బంది పడతారు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు.
నంబర్ 3 (పుట్టిన తేదీలు 3, 12, 21, 30)
ఈ తేదీల్లో జన్మించినవారు ఈ రోజు సంతోషంగా ఉంటారు. జీవితాన్ని ఆస్వాదిస్తారు. కానీ మీ బలహీనతను అధిగమించేందుకు ప్రయత్నించండి. ఉద్యోగులు, వ్యాపారులు మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీ అదృష్ట సంఖ్య: 21 అదృష్ట రంగు: ఎరుపు
Also Read: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!
నంబర్ 4 (పుట్టిన తేదీలు 4, 13, 22, 31)
ఈ తేదీల్లో పుట్టినవారు ఈ రోజు ఏదైనా ఖరీదైన వస్తువు కొనుగోలు చేసేముందు ఆలోచించాలి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించడం మంచిది. ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈరోజు మీకు అంత మంచి రోజు కాదు. ప్రతి విషయంలోనూ ఆచితూచి స్పందించండి. ఓ చెడువార్త వినే అవకాశం ఉంది. మీ లక్కీ నంబర్ 11, కలిసొచ్చే రంగు బ్రౌన్.
నంబర్ 5 (పుట్టిన తేదీలు 5, 14, 23)
5, 14, 23 తేదీలలో జన్మించినవారి నంబర్ 5. ఈ రోజు మీరు ప్లాన్ చేసుకున్న ప్రయాణానికి అడ్డంకులు ఎదురవుతాయి. అనుకున్న పనులు మాత్రం పూర్తిచేసేందుకు పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే చాలా నష్టపోతారు. ఆ నిర్ణయాల వల్ల మంచి కన్నా చెడే అధికంగా ఉంటుంది. ఉద్యోగులు పనిపై దృష్టి సారించాలి. మీకు కలిసొచ్చే నంబర్ 10, రంగు గ్రే.
నంబర్ 6 (పుట్టిన తేదీలు 6, 15, 24)
ఈ తేదీల్లో జన్మించినవారు ఈ రోజు వారి న్యూమరాలజీ ప్రకారం సన్నిహితుల సలహాలను స్వీకరించాలి. ఆలోచించి వేసే అడుగు మంచి అవకాశాలను తీసుకొస్తుంది. మీ వ్యక్తిత్వం, మీ ప్రవర్తనా విధానం మంచి పేరు సంపాదించిపెడుతుంది. దృఢ సంకల్పంతో ప్రయత్నించి సక్సెస్ అవుతారు. మీకు సంతోష సంఖ్య: 19 సంతోషకరమైన రంగు: ఆరెంజ్
నంబర్ 7 (పుట్టిన తేదీలు 7, 16, 25)
ఈ తేదీల్లో జన్మించినవారు ఈ రోజు పిరికితనం వీడి ధైర్యంగా ఉండాలి. కొత్త ఆలోచనలు, నూతన ప్రణాళికలకు మంచి రోజు. మీకు మీ తోబుట్టువులే బలం అని మర్చిపోవద్దు. తొందరపాటు తనంవద్దు.మీరు మాటలు తగ్గించి ఎదుటి వ్యక్తులు మాట్లాడేది వినేందుకు ప్రయత్నించాలి. మీ అదృష్ట సంఖ్య: 29 అదృష్ట రంగు: తెలుపు
నంబర్ 8 (పుట్టిన తేదీలు 8, 17,26)
ఈ తేదీల్లో పుట్టినవారు న్యూమరాలజీ ప్రకారం ఈ రోజు ఓ పెద్ద ప్రణాళికను అమలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. విభిన్నమైన ఆలోచన చేస్తారు. ఈ రోజు ప్రారంభించే పనుల నుంచి మంచి ఫలితాలు పొందుతారు. మీకు సంతోషకరమైన నంబర్ 26, కలిసొచ్చే రంగు నీలం.
Also Read: ఆలయాల సమీపంలో ఇల్లుంటే ఏమవుతుంది, ఏ ఆలయానికి ఇల్లు ఎటువైపు ఉండాలి!
నంబర్ 9 (పుట్టిన తేదీలు 9, 18,27)
ఈ తేదీల్లో జన్మించినవారు జూలై 29న చాలా ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో ఉంటారు. ఏకాంతంగా ఉండేందుకు ఇష్టపడతారు. విశ్రాంతి తీసుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మీ అదృష్ట సంఖ్య: 31 అదృష్ట రంగు: కుంకుమపువ్వు