Horoscope Today 17th December 2024
మేష రాశి
మేషరాశి వారి కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది. అధికారి వర్గం మీపై చాలా ఆధారపడి ఉంటుంది. ప్రభావవంతమైన వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి. మీరు కొత్త ఆస్తి లేదా ఇంటిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకుంటారు. వైద్య రంగానికి సంబంధించిన వ్యక్తులు మంచి ఫలితాలు పొందుతారు.
వృషభ రాశి
వృషభ రాశి వారికి వ్యాపారానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. విద్యార్థులు చదువు విషయంలో చాలా చురుగ్గా ఉంటారు. తప్పుడు మార్గాలను ఎంచుకోవద్దు. ఈ రోజు మీ మనస్సు కొన్ని వ్యక్తిగత సమస్యల కారణంగా పరధ్యానంగా ఉండవచ్చు.
మిథున రాశి
మిథున రాశి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీరు మీ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రేమ సంబంధాలకు తగినంత సమయం దొరుకుతుంది. కొత్త ఇల్లు కొనే ఆలోచన చేయవచ్చు. వ్యాపారస్తులు భారీ లాభాలను ఆర్జిస్తారు.
Also Read: ఈ వారం ఈ రాశులవారికి గుడ్ న్యూస్ తో మొదలై అలానే ఎండ్ అవుతుంది - డిసెంబరు 16 - 22 వారఫలాలు!
కర్కాటక రాశి
మీ నిర్ణయాలకు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. ఇంటి పనిపై శ్రద్ధ ఉండదు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది. కార్యాలయంలో అవమానం ఎదుర్కోవాల్సి రావొచ్చు.
సింహ రాశి
ఈ రాశి నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. నూతన ఉద్యోగం సాధిస్తారు. ఈ రోజు పెండింగ్ లో ఉన్న విషయాలు క్రమంగా పరిష్కారమవుతాయి. సమాజంలో మీ ప్రభావం పెరుగుతుంది. ఆకస్మిక ఆర్థిక లాభం కూడా ఉండవచ్చు. స్నేహితులను కలుసుకున్న తర్వాత మీరు సంతోషంగా ఉంటారు.
కన్యా రాశి
కన్యారాశివారు భౌతిక బలహీనత గురించి ఆందోళన చెందుతారు. ఈ రోజు చాలా పనులు పూర్తిచేస్తారు. మిమ్మల్ని చూసి చాలామంది స్ఫూర్తి పొందుతారు. కమిషన్ సంబంధిత వ్యాపారంచేసేవారు ప్రయోజనం పొందుతారు. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
తులా రాశి
ఈ రాశివారు ఈ రోజు వ్యాపారంలో చాలా శ్రద్ధ వహించాలి. మీ మానసిక స్థితిని సానుకూలంగా ఉంచండి. మీ అలవాట్లను అంతా విమర్శించవచ్చు. గత పరిచయాల నుంచి ప్రయోజనాలను పొందుతారు. మీ జీవిత భాగస్వామి పట్ల ప్రేమ పెరుగుతుంది.
వృశ్చిక రాశి
కార్యాలయంలో మీ బాధ్యత నిర్వహించేందుకు నిర్లక్ష్యం చేయవద్దు. ఈరోజు మీరు అకస్మాత్తుగా కొన్ని అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు ప్రేమ సంబంధాలలో మోసపోయే అవకాశం ఉంది. రక్తపోటు, షుగర్ వ్యాధిగ్రస్తులు మందుల వాడకంలో అజాగ్రత్తగా ఉండకూడదు.
ధనుస్సు రాశి
ఈ రాశి ఉద్యోగులకు పని ప్రదేశాల్లో సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. చిల్లర వ్యాపారుల ఆదాయం పెరుగుతుంది. గతంలో మీరు పడిన కష్టానికి తగిన ఫలితం పొందుతారు. మీరు ఆర్థిక సమస్యల గురించి ఆందోళన చెందుతారు. ఎవరికీ సలహాలు ఇవ్వకండి.
Also Read: 6 నెలలు చికాకులు 6 నెలలు ప్రశాంతత .. గృహం , వాహన యోగం - మిథున రాశి వార్షిక ఫలితాలు 2025!
మకర రాశి
మీరు కార్యాలయంలో కొత్త బాధ్యతలు పొందుతారు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి నుంచి సలహాలు తీసుకుని అనుసరించండి. మీరు బంధువుకు సహాయం చేయవలసి రావచ్చు. ఇది మీ మనసుకు ఎంతో సంతోషాన్నిస్తుంది. స్నేహితుల సహాయంతో మీ పనులు పూర్తవుతాయి.
కుంభ రాశి
ఇతరుల విషయాలపై పెద్దగా ఆసక్తి చూపించవద్దు. ఇంటి పెద్దల ఆశీశ్సులు పొందుతారు. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు ఈ రోజు మంచిది. చేపట్టిన పనిలో ఎదురయ్యే అడ్డంకుల వల్ల మానసికంగా బాధపడతారు. ఎవరినీ గుడ్డిగా నమ్మేయవద్దు.
మీన రాశి
ఈ రాశివారికి కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. సామాజిక విషయాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. వ్యక్తిగత సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. అదనపు పనిభారం వల్ల ఈ రోజు ఆందోళన చెందుతారు. మీ ఖర్చులను పరిమితంగా, సమతుల్యంగా ఉంచండి.
Also Read: 6 నెలలు చికాకులు 6 నెలలు ప్రశాంతత .. గృహం , వాహన యోగం - మిథున రాశి వార్షిక ఫలితాలు 2025!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.