Chandra Grahan 2025 Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహణం ఓ వ్యక్తి మనస్సు, కెరీర్, సంబంధాలు, ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఒక్కో రాశివారిపై, ఒక్కో తేదీలో జన్మించినవారిపై గ్రహణం వేర్వేరు ప్రభావం చూపిస్తుంది. కొంతమందికి ఇది కష్టాలు ,మానసిక ఒత్తిడితో నిండిన సమయం కావొచ్చు, మరికొందరికి ఇది శుభప్రదంగా ఉండవచ్చు, మరికొందరికి ఆత్మపరిశీలన సమయం కావచ్చు.
సంఖ్యాశాస్త్రం ప్రకారం 2025 సెప్టెంబర్ 7 రాత్రి 9.56 నుంచి 1.26 వరకూ మొత్తం 3 గంటల 30 నిముషాల పాటు ఏర్పడే సంపూర్ణ చంద్ర గ్రహణం ప్రభావం మీపై ఎలా ఉంటుందో తెలుసుకోండి
నంబర్ 1, 10, 19, 28
చంద్రగ్రహణం సమయంలో ఆ ప్రభావం మీ ఆత్మవిశ్వాసంపై పడుతుంది. పనిచేసే ప్రదేశంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగం, వ్యాపారంలో చిన్న చిన్న అడ్డంకులు ఎదురవుతాయి. చేసిన పనినే మళ్లీ చేయాల్సి రావొచ్చు.
నంబర్ 2, 11,20,29
ఈ తేదీల్లో జన్మించినవారికి చంద్రగ్రహణం ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయంలో మానసిక సమతుల్యత, భావోద్వేగ స్థితిపై ప్రభావం చూపిస్తుంది. సంబంధాలలో విభేదాలు రావొచ్చు..అనుకోని దూరం ఏర్పడుతుంది. ఆరోగ్యం కోసం ధ్యానం , మెడిటేషన్ చేయడం మంచిది.
నంబర్ 3, 12, 21, 30
ఈ గ్రహణం ఈ తేదీల్లో జన్మించిన వారి కెరీర్ , సామాజిక జీవితంలో మార్పులు తెస్తుంది. ఏదైనా పనిలో ఆటంకం ఏర్పడుతుంది, కానీ సహనంతో ఉండటం వల్ల ప్రయోజనం ఉంటుంది.
నంబర్ 4, 13, 22, 31
ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు ఆకస్మికంగా ఆర్థిక హెచ్చుతగ్గులను చూడాల్సి వస్తుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అనవసర ప్రయాణాలు చేయొద్దు. ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి.
నంబర్ 5, 14, 23
చంద్రగ్రహణం సమయంలో కొంచెం సవాలుగా ఉంటుంది. సంబంధాలలో అపార్థాలు ఎదురవుతాయి. పనిచేసే ప్రదేశంలో అనుకోని సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఏదైనా కొత్త ప్రారంభానికి దూరంగా ఉండండి.
నంబర్ 6, 15, 24
చంద్రగ్రహణ సమయం వ్యక్తిగత జీవితం, ప్రేమ సంబంధాల్లో ఒత్తిడిని కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. పాత వివాదాలకు దూరంగా ఉండండి.
నంబర్ 7, 16, 25
ఈ సమయం మీకు ఆత్మపరిశీలన , ఆధ్యాత్మిక దృష్టిని బలపరిచేదిగా ఉంటుంది. మానసిక అలసట , ఒంటరితనం అనిపించవచ్చు. పుస్తకాలు చదవడం లేదా ప్రయాణం చేయడం మీకు శాంతినిస్తుంది.
నంబర్ 8, 17, 26
చంద్రగ్రహణం సమయంలో వ్యాపారం , ఉద్యోగంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. గుడ్డిగా ఎవరినైనా నమ్మడం వల్ల నష్టం వాటిల్లుతుంది. డబ్బుకు సంబంధించిన విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.
నంబర్ 9, 18, 27
గ్రహణం మీ ఉత్సాహం, మీ శక్తిని ప్రభావితం చేస్తుంది. కోపం తెచ్చుకోకుండా ఉండండి . కుటుంబంలో వివాదాలకు చోటివ్వవద్దు.. సంయమనం పాటించండి. ఆరోగ్యానికి సంబంధించిన చిన్న సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.
2025 సెప్టెంబర్ 07 ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం సమయం, సూతకాలం, ఏ రాశివారు గ్రహణం చూడకూడదు? పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
బాబా వాంగ 2025లో ఏం జరగబోతోందో చెప్పిన భయంకరమైన భవిష్యవాణి ప్రభావం భారతదేశంలో కనిపిస్తోందా! పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.