BMW Vision CE  Latest News: BMW కంపెనీ తాజాగా రిలీజ్ చేసిన కొత్త బైక్ కి సంబంధంచిన వివ‌రాలు మార్కెట్ ను షేక్ చేస్తున్నాయి. స‌రికొత్త టెక్నాల‌జీతో రాబోయే ఈ బైక్ ..ఫ్యూచ‌ర్ బైకింగ్ మాన్యుఫాక్చ‌ర్ నే మారుస్తుంద‌ని నిపుణులు అంటున్నారు.   BMW ఇటీవల పరిచయం చేసిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ పేరు BMW Vision CE. ఈ స్కూటర్ ముఖ్యంగా నగర రవాణాలో స‌రికొత్త‌ మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా రూపొందించబడింది. 25 ఏళ్ల క్రితం వచ్చిన BMW C1 మోడల్‌కి ఇది ఒక ఎక్స్టెండెట్ వెర్ష‌న్ లా గా నిలుస్తుంది. Vision CE లో హెల్మెట్ లేకుండా, పెద్దగా రైడింగ్ గేర్ అవసరం లేకుండా సురక్షితంగా ప్రయాణించవచ్చని భావిస్తున్నారు. ఈ కాన్సెప్ట్‌లో ముఖ్యమైన అంశం మెటల్ ట్యూబ్‌తో చేసిన ‘కేజ్’ సేఫ్టీ సెల్. ఇది ఒక రోల్ కేజ్‌లా పనిచేస్తుంది, ఇందులో రైడర్  సీటుబెల్ట్ తో సెఫ్టీ ద‌క్కుతుంది. దీనివల్ల ప్రయాణికుడు సాధారణంగా ద్విచక్ర వాహనాల్లో ఉండే ప్రమాదాలకు గురి కాకుండా ఉంటాడు. దీని వల్ల హెల్మెట్ లేకుండా కూడా ప్రయాణించడం సాధ్యమవుతుంది.

అద్భుత‌మైన డిజైన్..డిజైన్ విషయానికి వస్తే, Vision CE కు లాంగ్ వీల్‌బేస్ ఉంది, ఇది వాహనానికి ఒక స్టైలిష్ , స్ట్రెచ్డ్ లుక్‌ను ఇస్తుంది. తక్కువ ఎత్తులో ఉండే కేజ్ స్ట్రక్చర్, ఓపెన్ & ఎయిరీ డిజైన్ స్కూటర్‌కు డైనమిక్ లుక్ ను అందిస్తుంది. స్కూటర్ మొత్తం కోటెడ్ అల్యూమినియం ఫ్రేమ్, మ్యాట్ వైట్ పెయింట్ స్కీమ్, బ్లాక్, నీయాన్ రెడ్ హైలైట్స్ కలవడంతో గ్రేట్ లుక్ వస్తుంది. ఈ స్కూటర్‌లో ఉన్న సెల్ఫ్-బాలెన్సింగ్ టెక్నాలజీ అద్భుతంగా ఉంది. స్వయంగా తన బ్యాలెన్స్‌ను ఈ స్కూటీ నిర్వహించగలదు. ఇది కొత్తగా వాహనాన్ని నడిపే వారికీ, ట్రాఫిక్‌లో ఎక్కువ టైం ఆగాల్సి వచ్చే నగరప్రాంతాల్లో ప్రయాణించే వారికీ ఎంతో ఉపయోగపడుతుంది.

త్వ‌ర‌లోనే మార్కెట్లోకి..BMW ఈ Vision CE ద్వారా భవిష్యత్తు ఎలక్ట్రిక్ రంగంలో సంచ‌ల‌నాలు సృష్టించే అవ‌కాశం ఉంది. ఇది అధికారికంగా మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుందన్నది స్పష్టంగా తెలియనప్పటికీ, త్వ‌ర‌లోనే ప్రొడక్షన్‌కి తీసుకురావాలని కంపెనీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.  షార్ట్ డిస్టెన్స్ కమ్యూటింగ్ కోసం ఇది సరైన పరిష్కారంగా మారే అవకాశాలు ఉన్నాయి. సాధారణ ద్విచక్ర వాహనాల కంటే దీనిలో రైడర్‌కు చాలా ఎక్కువ సేఫ్టీ ఉంటుంది. మొత్తానికి, BMW Vision CE ఒక విప్లవాత్మక కాన్సెప్ట్ స్కూటర్. ఇది మార్కెట్లోకి వ‌చ్చాక బైక్ రైడింగ్ నిర్వ‌చ‌న‌మే మారిపోతుంద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.