Love Horoscope Today 25th November 2022: ఈ రోజు ఏ రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉందో చూద్దాం...

మేష రాశిఈ రాశి ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలి..ఎలాంటి నిర్ణయాలు తీసుకోపోవడం మంచిది. ప్రయాణం చేయాల్సి రావొచ్చు.  జీవిత భాగస్వామిపై నమ్మకం ఉంటుంది...జీవితాన్ని మరింత కొత్తగా డిజైన్ చేసుకోవాలి అనుకుంటారు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. వృషభ రాశిఈ రాశివారు జీవిత భాగస్వామి నుంచి స్వచ్ఛమైన ప్రేమను పొందుతారు. రోజంతా ఆనందంగా ఉంటారు. ప్రేమికులు విహారానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.

మిథున రాశిమిథున రాశివారు కోపంతో ప్రేమకు సంబంధించిన ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. దంపతుల మధ్య అపార్థాలు తొలగిపోతాయి. ఈ రోజు ప్రయాణ ప్రణాళికలు వాయిదా వేసుకుంటారు. ప్రేమజంట మధ్య సమన్వయం ఉంటుంది. ఒకర్నొకరు అర్థం చేసుకుంటారు

Also Read: 2023లో ఆరంభంలో ఈ రాశివారు మానసికంగా బాధపడతారు, ఆర్థికపరిస్థితి మాత్రం ఆశాజనకం

కర్కాటక రాశి పెళ్లి చేసుకోవాలి అనుకున్న ప్రేమికులకు ఇదే మంచి సమయం. అయితే కుటుంబ సభ్యుల నుంచి అసంతృప్తి తప్పదు. ఈ విషయంలో ప్రేమికుల మధ్య కూడా మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. భార్య భర్త మధ్య చిన్న వివాదాలు వచ్చినా సమసిపోతాయి.

సింహ రాశిఈ రాశికి చెందిన వివాహితుల మధ్య సమస్యలు తొలగిపోతాయి. ప్రేమికులు శుభవార్త వింటారు. సాధించిన విజయాన్ని కలసి సెలబ్రేట్ చేసుకుంటారు.

కన్యా రాశిఈ రాశివారు నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే..మీ మనసులో మాట చెప్పేందుకు ఇదే మంచి రోజు. తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ జంట సోషల్ మీడియా విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. 

Also Read: ఇరుముడి అంటే ఏంటి, అయ్యప్ప స్వామి దర్శనానికి ఇరుముడి ఎందుకు!

తులా రాశివివాహితులు సంతోషంగా ఉంటారు. చాలా కాలం తర్వాత మాజీ ప్రేమికులను కలుసుకునే అవకాశం ఉంది. రోజంతా సంతోషంగా గడిపేస్తారు. కొందరు ప్రేమికులు ఫ్యూచర్ ప్లాన్స్ లో బిజీగా ఉంటారు.

వృశ్చిక రాశిఒంటరి వ్యక్తులు  ప్రేమ భాగస్వామిని పొందుతారు. ప్రేమికులకు ఈరోజు చాలా మంచి రోజు అవుతుంది. ఓ శుభవార్త వింటారు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నప్పటికీ సాధారణంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు.

ధనుస్సు రాశిప్రేమ జంట మధ్య ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. మీ మనోవేదన తొలగించడం ద్వారా కొత్త ముగింపు నుంచి సరికొత్త బంధం సాగుతుంది. కార్యాలయంలో సహోద్యోగితో డేట్ కి వెళ్లాలనే ఆళోచనతో ఉంటారు

మకర రాశివివాహితులు ఈ రోజు సంతోషంగా ఉంటారు. ప్రేమికులు కొన్ని  క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈరోజు శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. మీరు మీ స్నేహితుల నుంచి సలహా తీసుకోవచ్చు.

కుంభ రాశిఆఫీసు సహోద్యోగితో ప్రేమలో పడే అవకాశం ఉంది. కొత్త ప్రేమ జంటలు ఊహాలోకాల్లో విహరిస్తుంటారు.  రోజంతా రొమాంటిక్ మూడ్ లో ఉంటారు. మితిమీరిన ఉత్సాహంతో తప్పుడు పనులు చేయవద్దు

మీన రాశిఈ రాశుల వారికి తమ ప్రేమ భాగస్వామితో అపార్థాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో కూడా చిన్న చిన్న విషయాలపై గొడవలు తప్పవు. రోజంతా అలాగే గడిచిపోతుంది. 

2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి