Love Horoscope Today 28th January 2023:  ఈ రోజు ఏ రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉందో చూద్దాం...


మేష రాశి
ప్రేమికుడితో ఏదో ఒక విషయం గురించి చర్చిస్తారు. భాగస్వామితో ప్రత్యేక ప్రదేశానికి ట్రిప్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. వైవాహిక జీవితం, ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. 


వృషభ రాశి
జీవిత భాగస్వామితో పరస్పర ప్రేమ పెరుగుతుంది. మొన్నటి వరకూ వెంటాడిన కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. ప్రేమ భాగస్వామితో ఆకస్మిక సమావేశం ఉండొచ్చు


మిథున రాశి
ఈ రాశివారు...ప్రేమించిన వ్యక్తిని రహస్యంగా కలుస్తారు. ప్రేమ జీవితంలో పరస్పరం అవగాహన పెరుగుతుంది. జీవిత భాగస్వామి కోసం అవివాహితుల అన్వేషణ దాదాపు పూర్తవుతుంది. వైవాహిక జీవితంలో  మాత్రం టెన్షన్ ఉంటుంది.


కర్కాటక రాశి
ఈ రాశివారి కుటుంబంలో కొన్నాళ్లుగా జరుగుతున్న వివాదాలు సర్దుమణుగుతాయి. బంధాలు బలపడతాయి..తద్వారా మీకు మనశ్సాంతి పెరుగుతుంది. వైవాహిక జీవితం, ప్రేమ జీవితం రెండూ బావుంటాయి. 


Also Read: రథ సప్తమి వెనుకున్న ఆధ్యాత్మిక -ఆరోగ్య రహస్యం , పూజా విధానం


సింహ రాశి 
ఈ రాశి వారు ప్రేమ వివాహం చేసుకునేందుకు ముందడుగు వేస్తారు. వైవాహిక జీవితంలో పెద్దగా మార్పులు, కొత్తదనం ఏమీ ఉండదు. జీవిత భాగస్వామితో అనవసర వాదనలు పెట్టుకోవద్దు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.


కన్యా రాశి 
ఈ రాశివారికి జీవితంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలపై వాదనలకు దూరంగా ఉండండి. సన్నిహితుల నుంచి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి 


తులా రాశి 
ఈ రాశివారికి జీవితంలో `కొన్ని ఆటంకాలు తప్పవు. వైవాహిక జీవితంలో పరస్పరం సామరస్యం ఉంటే ఇబ్బందులను సులువుగా అధిగమిస్తారు.మీ భాగస్వామితో కలసి దూర ప్రయాణం చేయాల్సి రావొచ్చు


వృశ్చిక రాశి 
ఈ రోజంతా మీరు బిజీ బిజీగా ఉంటారు. ప్రేమ జీవితంలో సంతోషం  ఉంటుంది. ఓ రొమాంటిక్ ప్రదేశానికి ట్రిప్ కి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. వైవాహిక జీవితంలో టెన్షన్ తప్పదు. 


ధనుస్సు రాశి
మీ జీవితాన్ని ఎంత సంతోషంగా ఉంచుకోవాలి అనేది పూర్తిగా మీ చేతిలో, మీ ఆలోచనా విధానంలో ఉంటుంది. కుటుంబానికి సమయం కేటాయించండి. కోపం తగ్గించుకోవడం, అనవసర వాదనకు దూరంగా ఉంటే మీ జీవితం సంతోషంగా సాగుతుంది. ప్రేమికులు పెళ్లిదిశగా అడుగేయవచ్చు.


Also Read: సూర్యకాంతిలో పొంగేపాలు సిరుల పొంగుకి సంకేతం, రథసప్తమి విశిష్టత ఇదే!


మకర రాశి 
మూడోవ్యక్తి జోక్యం వల్ల మీ వైవాహిక జీవితంలో వివాదాలు రావొచ్చు..జాగ్రత్తపడండి. సమస్య ఆరంభంలో ఉన్నప్పుడే సాల్వ్ చేసుకోవడం మంచిది. బహిరంగ ప్రదేశాల్లో మీ అతి ప్రేమను ప్రదర్శించవద్దు..దానివల్ల ఇద్దరి మధ్యా మరిన్ని ఇబ్బందులు పెరుగుతాయి.


కుంభ రాశి
ప్రేమ భాగస్వామి కోసం ఈ రాశివారి అన్వేషణ పూర్తవుతుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదన వస్తుంది. ప్రేమికులు చిన్న చిన్న విషయాలకు కోప్పడడం మానేయాలి. అనవసర విషయాలపై చర్చలు వద్దు.


మీన రాశి
ఈ రాశికి చెందిన జంటలు...భవిష్యత్ ప్రణాళికలు ఇంకొన్నాళ్లు వాయిదా వేయండి. ప్రేమ భాగస్వామికి దగ్గరయ్యేందుకు కొత్త మార్గాలు ఎంచుకుంటారు. వైవాహిక జీవితంలో చిన్న చిన్న వాదనలు మినహా అంతా బావుంటుంది.