Jupiter Transit 2025: పంచాంగం ప్రకారం.. దేవగురువు బృహస్పతి నవంబర్ 12న కర్కాటక రాశిలో తిరోగమనం చెందుతాడు జ్యోతిష్య శాస్త్రంలో ఈ గోచారాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. గురువు తిరోగమనం చెందడం యోగం కన్నా తక్కువ కాదు. దీనికి ముందు, దేవగురువు బృహస్పతి సెప్టెంబర్ 28న కర్కాటకంలో ప్రవేశించాడు. ఇప్పుడు తిరోగమనం చెందుతున్నాడు. తిరిగి డిసెంబర్ 27న మిథునంలోకి ప్రవేశిస్తాడు.
జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాల ప్రకారం 12 సంవత్సరాల తర్వాత దేవగురువు బృహస్పతి కర్కాటక రాశిలో తిరోగమనం చెందుతున్నాడు. ఈ సమయంలో గురువు అతిచార స్థితిలో ఉంటాడు. డిసెంబర్ వరకూ ఇదే స్థితిలో ఉంటాడు..ఆ తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు.
గురుడు (బృహస్పతి) జాతకంలో అత్యంత శుభగ్రహంగా పరిగణిస్తారు. గురువు ప్రభావం వ్యక్తి జీవితంలో జ్ఞానం, ధర్మం, ఆధ్యాత్మికత, సంపద, విద్య, సంతానం, గౌరవం, ఆరోగ్యం మొదలైన అంశాలపై గణనీయమైన ప్రభావం చూపుతుంది.
గురువు రాశి మార్పు..తిరోగమన స్థితితో రాశుల వారి అదృష్టం మారుతుంది. దేవగురువు బృహస్పతి వక్రీ చలనంతో ఏ రాశుల వారికి శుభ సమయం ప్రారంభమవుతుందో తెలుసుకుందాం.
వృషభ రాశి (Capricorn Horoscope)
వృషభ రాశి వారికి బృహస్పతి తిరోగమనం చెందడం వల్ల వ్యాపారంలో వస్తున్న ఇబ్బందులు నెమ్మదిగా తొలగిపోతాయి. ధనం, కెరీర్‌లో కూడా పురోగతి కనిపిస్తుంది. ఏదైనా పాత డబ్బు తిరిగి రావచ్చు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలోని పెద్దల నుంచి సహాయం అందుతుంది . ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
కన్యా రాశి (Virgo Horoscope)
కన్య రాశి వారికి దేవగురువు బృహస్పతి వక్రీ అవ్వడం అదృష్టాన్ని తెస్తుంది. కెరీర్‌లో వస్తున్న ఇబ్బందులు తొలగిపోతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. సీనియర్లు మీ పనికి సంతోషిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం రావచ్చు, ఇంట్లో .. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది.
మకర రాశి (Taurus Horoscope)
మకర రాశి వారికి బృహస్పతి వక్రీ అవ్వడం శుభ సంకేతం. ఇది మీ లక్ష్యాలపై మళ్లీ దృష్టి పెట్టడానికి .. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడానికి మీకు అవకాశం ఇస్తుంది. పాత పెట్టుబడులు లేదా ఆస్తుల నుంచి లాభం వచ్చే అవకాశం ఉంది. సంబంధాలలో ఏర్పడిన అపార్థాలు ఇప్పుడు తొలగిపోతాయి . ప్రేమ జీవితంలో మాధుర్యం పెరుగుతుంది. పని మీ కృషి , అంకితభావానికి ప్రశంసలు లభిస్తాయి. ఇది ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి. వీటిని విశ్వశించే ముందు పండితులను సంప్రదించండి
కార్తీక మహాపురాణం కథ DAY-1: కార్తీకమాస పవిత్రత, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, శివభక్తి, దీపారాధన మహత్యం!
కార్తీక మహాపురాణం కథ DAY-2 : కుక్కగా జన్మించిన నిష్టురికి మోక్షం ఎలా లభించింది?
కార్తీక మహాపురాణం కథ DAY-3 : బ్రహ్మరాక్షసులకు శాప విమోచనం