NavPancham Rajyog 2025: హిందూ వైదిక జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలన్నీ ఓ నిర్ధిష్ట కాలం తర్వాత రాశి మార్చుకుంటాయి. బుధుడు నెలలో రెండుసార్లు రాశిని మారుస్తాడు, గురువు స్థానంలో సంవత్సరానికి ఒకసారి మార్పు కనిపిస్తుంది. అయితే ఈ ఏడాది మాత్రం గురువు  అక్టోబర్ లో 2 సార్లు కర్కాటక రాశిలో ప్రవేశించాడు. డిసెంబర్ నెలలో గురువు మరోసారి మిథున రాశిలోకి తిరిగి వస్తారు. ఈ 2 నెలల సమయంలో ఏదో ఒక గ్రహంతో కలయిక లేదా దృష్టి ద్వారా శుభ-అశుభ యోగాల నిర్మాణం జరుగుతుంది. అక్టోబర్ 24న గురువు బుధుల కలయికతో శక్తివంతమైన నవపంచమ యోగం ఏర్పడుతోంది, ఇది మూడు రాశుల వారిపై శుభ ప్రభావాన్ని చూపుతుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం  

Continues below advertisement

నవపంచమ రాజయోగం ఎప్పుడు ఏర్పడుతుంది

అక్టోబర్ 24 రాత్రి 8:35 గంటలకు గురు-బుధులు ఒకరికొకరు 120 డిగ్రీల వద్ద ఉంటారు, దీని కారణంగా నవపంచమ యోగం ఏర్పడుతుంది. అక్టోబర్ 24న మధ్యాహ్నం సమయంలో బుధుడు వృశ్చిక రాశిలో ప్రవేశిస్తాడు. అప్పుడు గురువు వృశ్చిక రాశిలో తొమ్మిదవ స్థానంలో ,కర్కాటక రాశిలో బుధుడు ఐదవ స్థానంలో ఉంటారు, దీని కారణంగా నవపంచమ యోగం ఏర్పడుతుంది.

Continues below advertisement

వృశ్చిక రాశి (Scorpio Zodiac)

వృశ్చిక రాశి వారికి నవపంచమ రాజయోగం లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి లగ్నంలో బుధుడు .. తొమ్మిదవ స్థానంలో గురువు ఉన్నారు. వృశ్చిక రాశి వారు అన్ని రంగాల్లోనూ అపార విజయం సాధించడంతో పాటు ప్రేమ జీవితంలో భాగస్వామి ప్రేమను పొందుతారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. అదృష్టం పెరగడంతో పాటు సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆత్మవిశ్వాసం పెరగడంతో ఉద్యోగంలో పదోన్నతికి మంచి అవకాశాలు ఉన్నాయి. 

మకర రాశి (Capricorn Zodiac)

మకర రాశి వారికి కూడా నవపంచమ యోగం చాలా ఫలవంతంగా ఉంటుంది. ఈ రాశి వారు నవపంచమ రాజయోగం సమయంలో కర్మ-ధర్మాలకు సంబంధించిన విషయాలలో సానుకూల ఫలితాలను చూస్తారు. ఆదాయం పెరుగుతుంది. భూమి, ఆస్తి విషయాల్లో విజయం సాధిస్తారు. చాలా కాలంగా నిలిచిపోయిన ఆస్తి పని పూర్తవుతుంది. స్నేహితులతో మంచి సమయం గడిపే అవకాశం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరగుతుంది. మేష రాశి (Aries Zodiac)

మేష రాశి వారికి కూడా నవపంచమ రాజయోగం ఏర్పడటం చాలా లాభదాయకంగా ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పని పూర్తవుతుంది. ధన ధాన్యాల విషయంలో సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. కెరీర్‌లో ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. పని చేసే చోట సీనియర్ అధికారులతో మీ సంబంధాలు కాలక్రమేణా మెరుగుపడవచ్చు. మీరు చాలా కాలంగా చేస్తున్న పనిలో విజయం సాధించవచ్చు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించిన సమాచారం మాత్రమే . ABP దేశంఎటువంటి నమ్మకాన్ని, సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

కార్తీక మహాపురాణం కథ DAY-1: కార్తీకమాస పవిత్రత, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, శివభక్తి, దీపారాధన మహత్యం!

కార్తీక మహాపురాణం కథ DAY-2 : కుక్కగా జన్మించిన నిష్టురికి మోక్షం ఎలా లభించింది?

కార్తీక మహాపురాణం కథ DAY-3 : బ్రహ్మరాక్షసులకు శాప విమోచనం