మార్చి 03 రాశిఫలాలు


మేష రాశి


ఈ రోజు మీకు బలహీనమైన రోజు. అనవసరమైన కోపం హాని కలిగిస్తుంది. ప్రేమ సంబంధాలకు రోజు శుభప్రదమైనది కాదు. మీరు ఉద్యోగంలో అధికారులతో సంబంధాలు కొనసాగించాలి. మీ విలువైన వస్తువులను జాగ్రత్త చేయండి.


వృషభ రాశి


ఈ రోజు డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. మహిళలు ఈ రోజు గృహోపకరణాల విషయంలో జాగ్రత్తగా ఉపయోగించాలి. రహస్య విభాగాలపై  మీ ధోరణి పెరుగుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి రోజు శుభప్రదమైనది కాదు. ఉత్సాహం తగ్గుతుంది. ఇతరుల వివాదంలోకి మీరు పోవద్దు. 


మిథున రాశి


ఈ రోజు మీకు శుభఫలితాలున్నాయి. గడిచిన రోజుకన్నా మరింత ఉత్సాహంగా ఉంటారు. ఇంటి నిర్మాణంలో మెరుగుదల ఉంటుంది. భవిష్యత్తును చాలా ఆలోచనాత్మకంగా ప్లాన్ చేస్తారు. స్నేహితులతో మీ సంబంధం మధురంగా ​​ఉంటుంది.


కర్కాటక రాశి


ఈ రోజు మీ ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో ఘర్షణ పడతారు. చేపట్టిన పని నెమ్మదిగా పూర్తవుతుంది. ఓపికగా వ్యవహరించాలి. అనుకోని పర్యటనలు ఇబ్బందిపెడతాయి. 


సింహ రాశి


మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు మతపరమైన విషయాల గురించి చాలా చురుకుగా ఉంటారు.  ఇతరుల తగాదాలలో మీ సమయాన్ని వృథా చేయవద్దు. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. పనిపట్ల ఉత్సాహం చూపిస్తారు. నూతన పెట్టుబడుల గురించి తొందరపడకండి.


కన్యా రాశి


ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఉత్సాహం లేకుండా ఉంటారు. అధిక కోపంతో వ్యవహరిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండం మంచిది. వ్యాపారంలో ప్రయోగాలు చేయొద్దు.


తులా రాశి


ఈ రోజు మీరు ఆధ్యాత్మికం విషయాలపై ఆసక్తి చూపిస్తారు. స్నేహితుల నుంచి సహకారం అందుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగంలో లాభపడతారు. విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారి కల ఫలిస్తుంది. ఏదైనా అత్యవసర పనిలో డబ్బు ఖర్చు చేయవచ్చు.


వృశ్చిక రాశి


ఈ రోజు వ్యాపారాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. విద్యార్థులు ఉన్నత విద్యలో విజయం సాధిస్తారు. ఉద్యోకులకు ప్రమోషన్ వస్తుంది. అవసరమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఈ రోజు శుభప్రదమైనది.


ధనుస్సు రాశి


ఈ రోజు చేయాల్సిన పనిపట్ల మీకు ఆసక్తి ఉండదు. ఇతర వ్యవహారాలపై ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగులు సహోద్యోగులతో గొడవ పడతారు. వ్యాపారంలో మీ క్రియాశీలత పెరుగుతుంది. నూతన పెట్టుబడులు పెట్టొద్దు. పరిచయాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. 


మకర రాశి


ఈ రోజు తలనొప్పి సమస్య ఉండవచ్చు. అనవసరమైన పరుగు కారణంగా అలసిపోతారు. మీ రహస్య విషయాలను ఎవరితోనైనా పంచుకోవద్దు. స్వచ్ఛతను జాగ్రత్తగా చూసుకోండి. బయట తినవద్దు.


కుంభ రాశి


ఈ రోజు మీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వ్యాపారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మీకు బలమైన సలహా ఇవ్వగలరు,అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు.
 
మీన రాశి


ఈ రోజు మీ జీవిత భాగస్వామితో వివాదం ఉండవచ్చు. చిన్న విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వొద్దు. అప్పులు చేయాలనే ఆలోచనే వద్దు.  ఉద్యోగం గురించి ఆందోళన , ఒత్తిడి ఉండవచ్చు. మీ మాటల్లో వినయం ఉంచండి.


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.