2021 ఆగస్టు 10 మంగళవారం రాశిఫలాలు


మేషం


మీ ప్రవర్తన కొంత చిరాకుగా ఉంటుంది. సకాలంలో ఈ సమస్యపై శ్రద్ధ వహించండి. శనిదేవుని విగ్రహానికి నూనెతో అభిషేకం చేసి పేదలకు సాయం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యంపై ఆందోళన చెందుతారు. విద్యార్థులకు మంచిరోజు.


వృషభం


మీకు మీ భాగస్వామికి మధ్య అసమ్మతి ఉండొచ్చు. మాట్లాడే ముందు ఆలోచించండి. మీ ఉద్దేశాన్ని చెప్పాలనుకున్న వారికి సూటిగా చెప్పండి. దగ్గరి వ్యక్తులను కలుస్తారు. మీ టీమ్ సభ్యులను ప్రోత్సహించండి మంచి ఫలితాలు పొందుతారు.


మిథునం


సరిగ్గా ప్లాన్ చేసుకుంటే నిలిచిన పనులు పూర్తవుతాయి. మీరు మీవారుగా భావించేవారు ఎవరైనా రహస్యాలను బహిర్గతం చేసే అవకాశం ఉంది. కొన్ని పనులు పూర్తిచేసినందుకు సంతృప్తి చెందుతారు..




కర్కాటక రాశి


అనవసరమైన విషయాలలో సాగదీత వద్దు. ప్రశాంతంగా ఉండటం మంచిది. వాదనలు, తగాదాలు వచ్చే అవకాశం ఉంది. కొంత కొత్త సమాచారం అందుతుంది. ఖర్చు చేసే విషయంలో జాగ్రత్త వహించండి. వ్యాపారం మందకొడిగా సాగుతుంది. కుటుంబ జీవితంలో కొత్త మలుపు ఉంటుంది. పాత సమస్యలు తొలగిపోతాయి.


సింహం


ఈ రోజు మీకు బాగా కలిసొస్తుంది. ఆర్థికంగా పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యుల కోసం మెరుగైన వస్తువులను కొనుగోలు చేయాలనుకుంటున్నారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. కొత్త బాధ్యతల కారణంగా మీరు బిజీగా ఉంటారు. ఆఫీసులో మంచి వాతావరణం ఉంటుంది. ప్రయాణానికి ముందు పెద్దల ఆశీర్వాదాలు తీసుకోండి.


కన్య


నిలిచిపోయిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. పిల్లల విషయంలో కొన్ని సమస్యలు ఉంటాయి. అధిక ఖర్చులు సమస్యను పెంచుతాయి. సోదరుల నుంచి కొన్ని శుభవార్తలు పొందుతారు. ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. సమాజంలో గౌరవం పొందుతారు.




తులారాశి


ఈ రోజు తులారాశివారు చాలా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ మద్దతు లభిస్తుంది. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. మీకు చాల అనుకూలమైన రోజు. ఏ పనినీ అసంపూర్తిగా ఉంచొద్దు. చట్టపరమైన విషయాల్లో కొత్త మలుపు ఉండే అవకాశం ఉంది. వృద్ధుల ఆరోగ్యం క్షీణించవచ్చు.


వృశ్చికరాశి


సానుకూల సంభాషణలు ఆలోచనలకు ప్రేరణనిస్తాయి. మీ వద్ద ఉన్నదానితో మీరు సంతృప్తి చెందాలి. దేనికీ అత్యాశ పడకండి. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దగ్గరి బంధువుల సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. విద్యార్థులు కష్టపడి చదవాలి.


ధనుస్సు


ఈరోజు మీకు కొత్త బాధ్యత వస్తుంది. సృజనాత్మక పని సమాజంలో మీ గౌరవాన్ని పెంచుతుంది. వ్యాపారస్తులకు కలిసొస్తుంది. ఆర్థికంగా బలపడేందుకు కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. తెలివిగా పని చేయండి, ఇది మిమ్మల్ని ఇబ్బందుల నుంచి కూడా కాపాడుతుంది.




మకరం


ఏ పనిని పూర్తి చేయకపోవడం వల్ల ఒత్తిడికి గురవుతారు. మీ సామర్థ్యాన్ని మించి పనిచేయొద్దు. ప్రేమికులకు ఈరోజు కలసిరాదు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణిస్తుంది. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు. యోగా సాధన చేయండి ఇతరుల నుంచి సలహాలు తీసుకోవద్దు.. వాటివల్ల మరింత గందరగోళానికి గురవుతారు.


కుంభం


మీకు హాని కలిగించే ఏ నిర్ణయాన్ని తొందరపడి తీసుకోకండి. మీ నైపుణ్యాలను మెరుగుపరచడానికి మరింత ప్రయత్నించండి. వ్యాపారంలో కొలిసొస్తుంది. కార్యాలయంలో ఎవరితోనైనా వివాదం ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ ఆస్తి విషయంలో వివాదం ఉండవచ్చు. కొన్ని కొత్త మార్పుల సంకేతాలు ఉన్నాయి.


మీనం


కొత్త పనులు చేయడంలో కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఈ రోజు ప్రయాణం చేయవద్దు. వ్యాపారాన్ని పెంచడానికి కొత్త ప్లాన్ చేయండి. ఈరోజు మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది. సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటారు.