మార్చి 17 రాశిఫలాలు

మేష రాశి

ఈ రోజు మీరున్న రంగంలో ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. ఇంతకు ముందు చేసిన కృషి నుంచి ప్రయోజనం పొందుతారు. మీరు ఆర్థిక ఇబ్బందుల గురించి కొంచెం ఆందోళన చెందుతారు. ఈ రోజు వ్యాపారంలో కొత్త ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుంది.  

వృషభ రాశి

అనుకోకుండా బంధువులకు సహాయం చేయాల్సి వస్తుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. సహోద్యోగుల సహాయంతో మీ పని త్వరగా పూర్తవుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి 

మిథున రాశి

ఈ రోజు మీరు పెద్దల నుంచి ఆశీస్సులు పొందుతారు. ఉన్నత విద్యలో ఉండేవారికి మంచిది. స్నేహితల ప్రవర్తన మిమ్మల్ని బాధపెడుతుంది. గుడ్డిగా ఎవర్నీ నమ్మొద్దు. ముఖ్యమైనపనులు అకస్మాత్తుగా చేయాల్సి వస్తుంది. 

కర్కాటక రాశి

ఈ రోజు మీరు ఏదో విషయంలో ఆందోళన చెందుతారు. సామాజిక విషయాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. వ్యక్తిగత సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది. ఈ రోజు మీరు అదనపు పనిభారం కారణంగా కలత చెందుతారు. మీ ఖర్చులను తగ్గించేందుకు ప్రయత్నించండి. 

సింహ రాశి

ఈ రోజు మీ జీవితంలో సంతృప్తిగా ఉన్న రోజుగా అనిపిస్తుంది. ప్రభావవంతమైన వ్యక్తులతో సంబంధాలు బలంగా ఉంటాయి. మీరు కొత్త ఆస్తి లేదా ఇల్లు  కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తారు. వైద్యరంగంలో ఉండేవారికి గౌరవం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది

కన్యా రాశి

ఈరోజు మీరు పరధ్యానంలో ఉంటారు. విద్యార్థులు తమ అధ్యయనాల గురించి చురుకుగా ఉంటారు. మీ స్వార్థం కోసం తప్పు మార్గాలను ఎంచుకోవద్దు. కంటికి సంబంధించిన చికాకులు ఉంటాయి. మీ ప్రేమను వ్యక్తం చేసేందుకు మంచి సమయం. తులా రాశి

ఈ రోజు అనవసర పనుల గురించి గందరగోళానికి గురవుతారు. ప్రేమ వ్యవహారాలకు తగినంత సమయం కేటాయిస్తారు. నూతన ఆస్తులు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు.

వృశ్చిక రాశి

మీ ఆలోచనలు, నిర్ణయాలకు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. పొట్టకు సంబంధించిన ఇబ్బందులు పెరుగుతాయి. ఇంటి పని గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీరు స్టాక్ మార్కెట్లో పెద్ద డబ్బును పెట్టుబడి పెట్టకుండా ఉండాలి.

ధనుస్సు రాశి

ఈ రోజు చేపట్టిన ప్రతి పనిలో సక్సెస్ అందుకుంటారు. గతంలో చిక్కుకున్న కేసుల నుంచి ఉపశమనం లభిస్తుంది. సమాజంలో మీ ప్రభావం పెరుగుతుంది. ఆకస్మిక డబ్బు పొందే అవకాశం ఉంది.  స్నేహితుల విజయంతో మనసు ఉల్లాసంగా ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది.

మకర రాశి

ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు ఈ రోజు పూర్తిచేస్తారు. మీరు చాలామందికి ప్రేరణగా నిలుస్తారు.  కమిషన్ , ఇన్సూరెన్స్ పనులు చేసేవారు లాభపడతారు. ఫిట్ నెస్ గురించి ఆందోళన చెందుతారు.

కుంభ రాశి

ఈ రోజు మీ మానసిక స్థితిని సానుకూలంగా ఉంచండి. మీ అలవాట్ల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. పాత సంబంధాల నుంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారం చేసేవారు ఉత్పత్తులు లేదా సేవల నాణ్యతపై చాలా శ్రద్ధ వహించాలి.

మీన రాశి

ఈ రోజు క్రమశిక్షణను అనుసరించండి. అజీర్ణంతో ఇబ్బంది ఉంటుంది. ఈ రోజు మీరు అకస్మాత్తుగా కొన్ని అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో మోసపోతారు. డయాబెటిక్ రోగులు మందుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు.