Daily Horoscope


మేష రాశి


కొత్త పనులు ప్రారంభించేందుకు ఇది సరైన సమయం కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో అస్సలు రాజీ పడొద్దు. ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ  జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసర పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. 


వృషభ రాశి


ఈ రోజు కొన్ని విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు..అప్రమత్తంగా వ్యవహరించండి. మీ శ్రమకు అర్ధవంతమైన ఫలితాలు రావడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. కొన్ని సమస్యలు పరిష్కరించడంలో బిజీగా ఉంటారు. 


మిథున రాశి
 
మీకు మంచి సమయం ఇది. చేపట్టే ప్రతి పనిలోనూ మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. హోల్ సేల్ వ్యాపారులకు ఈ రోజు బావుంటుంది. ఉద్యోగులకు శుభసమయం. 


Also Read: ఆదర్శ పాలకుడికి ఉండాల్సిన లక్షణాలివే - చాణక్య నీతి


కర్కాటక రాశి 


విదేశాలలో పని చేసేవారి ఆదాయం పెరగవచ్చు. మతపరమైన కార్యకలాపాల విషయంలో మీరు అజాగ్రత్తగా ఉంటారు. పని ఒత్తిడి అధికంగా 
ఉంటుంది. సహోద్యోగులతో మంచి స్నేహాన్ని కొనసాగించండి. కొత్తగా ఏదైనా ప్రారంభిస్తే కొంత అసౌకర్యం ఎదుర్కొంటారు. 


సింహ రాశి


మీరు చాలా నిరాశగా ఉంటారు. అవసరానికి చేతిలో డబ్బు లేకపోవడంతో మీ పనికి ఆటంకం కలుగుతుంది.  బంగారం, వెండి వ్యాపారులు నష్టపోతారు. వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి.


కన్యా రాశి 


ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పాత అప్పులు తీరిపోతాయి. వైవాహిక జీవితం బావుంటుంది. దాన ధర్మాల కోసం డబ్బులు ఖర్చు చేస్తారు.


Also Read: అక్షయ పాత్ర మొదట ఎవరు ఎవరికి ఇచ్చారు - ఇప్పుడా పాత్ర ఎక్కడుంది!


తులా రాశి


మీ కుటుంబ సభ్యులు మీ సమస్యలను అర్థం చేసుకుంటారు. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఇరుగు పొరుగు వారితో వివాద సూచనలున్నాయి. మీపై అసూయ చెందే వ్యక్తులు మీ పనికి అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నిస్తారు..


వృశ్చిక రాశి


ముక్కుసూటిగా , కఠినంగా మాట్లాడటం మీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మీరు ఈరోజు అనుభవజ్ఞులైన వారితో సమయం గడుపుతారు. స్థిరాస్తి వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. మీ ఖర్చులపై నియంత్రణను కొనసాగించండి. అనవసర ప్రయాణాల వల్ల అలసట ఉంటుంది.


ధనుస్సు రాశి


ఉద్యోగంలో ప్రత్యేక అనుకూలత ఉంటుంది. స్నేహితుల మద్దతు లభించిన తర్వాత మీ మనసు సంతోషంగా ఉంటుంది.  మీ కమ్యూనికేషన్ స్కిల్స్ నుండి మీరు ప్రత్యేక లాభం పొందుతారు . ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి బావుంటుంది.


Also Read: విభీషణుడు సహా ఇప్పటికీ జీవించి ఉన్న పురాణ పురుషులు వీళ్లే!


మకర రాశి


ఈ రాశి ఉద్యోగులకు ఈ రోజు శుభసమయం. పని ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. కుటుంబానికి సమయం కేటాయించండి. వ్యాపారులు నూతన పెట్టుబడులు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. 


కుంభ రాశి


మీరు ఒత్తిడికి దూరంగా ఉండాలి. వ్యాపారం కోసం కొంచెం కష్టపడాల్సి వస్తుంది. సామాజిక సేవా సంస్థలలో చేరేందుకు ఆసక్తి చూపిస్తారు. కుటుంబంతో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. 


Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?


మీన రాశి


వైవాహిక జీవితంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి సమయం. వ్యాపారంలో అధిక ఆర్థిక లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగం-వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. 


గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.