Chanakya Niti in telugu: కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం మొదటి ప్రకరణంలో ఆదర్శ పాలకుడికి ఉండాల్సిన లక్షణాల గురించి వివరించాడు. చతుర్విధ ఆశ్రమాల్లో ఎప్పుడు ఏ విధులు నిర్వర్తించాలో సువివరంగా చెప్పాడు చాణక్యుడు...


బ్రహ్మచర్యాశ్రమం చాలా కీలకం


ఆదర్శ పాలకుడు బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నప్పుడు విద్యపై పూర్తిస్థాయిలో దృష్టిసారించాలి. గురువుల దగ్గర్నుంచి అన్ని శాస్త్రాలు..ముఖ్యంగా తత్వశాస్త్రం, వేదాలు, అర్థశాస్త్రం, రాజ్యపరిపాలనా శాస్త్రం క్షణ్ణంగా నేర్చుకోవాలి. పరిపాలకుడికి క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. క్రమశిక్షణ రెండు రకాలు... ఒకటి జన్మతః వచ్చింది మరొకటి గురువు నుంచి నేర్చుకునేది. ఈ విధంగా నేర్చుకున్నా కానీ క్రమశిక్షణ అనేది అవసరం..ఇలాంటి వ్యక్తులే గురువుపట్ల విధేయత కలిగిఉంటారు, చెప్పింది అర్థం చేసుకుని గుర్తుంచుకుంటారు. ఇలా అన్ని శాస్త్రాలు అభ్యసించి బ్రహ్మచర్యాశ్రమాన్ని విడిచిపెడతారు.బ్రహ్మచర్యాశ్రమం పూర్తైనంత మాత్రాన విద్య పూర్తైనట్టు కాదు..విద్యానిథులైన పెద్దల సహచర్యంతో నేర్చుకున్న విద్యకు పదునుపెట్టాలి. ఆ రోజుల్లో మొదట యుద్ధవిద్య నేర్పేందుకు ఏనుగులు, గుర్రాలు, రథం నడపడం...ఆయుధం వినియోగించడంలో నిపుణత నేర్చుకోవాలి.  వాస్తవానికి పాలకులకు మాత్రమే కాదు జీవితంలో ఎదగాలి అనుకున్న ఎవరికైనా బ్రహ్మచర్యాశ్రమం చాలా కీలకం...


Also Read: అక్షయ పాత్ర మొదట ఎవరు ఎవరికి ఇచ్చారు - ఇప్పుడా పాత్ర ఎక్కడుంది!


ఈ ఆరు శత్రువులను అదుపులో ఉంచుకోవాలి


రాజుగా పట్టాభిషిక్తుడు కావాలంటే ముఖ్యంగా ఆరు శత్రువులను అదుపులో ఉంచుకోవాలి. రాజు కావాల్సిన వ్యక్తిలో ఉన్న ఆరు శత్రువులు ఎవరంటే..


1.కామము  2. క్రోధము 3. అత్యాశ 4. మోసము 5. అహంకారం 6. మూర్ఖత్వం...


ఇంద్రియాలకు సంబంధించిన శ్రవణం, స్పర్శ, దృశ్యం, రుచి, వాసన ఇవి కూడా అదుపులో ఉండాలి.


వీటిని అదుపులో ఉంచుకోలేక విలాసాలలో మునిగితేలితే...భూమి మొత్తానికి అధిపతి అయినా అతి త్వరలో వినాశనం తప్పదు. వీటిని జయించలేక ఎందరో చక్రవర్తులు తమ వినాశనాన్ని తామే కొనితెచ్చుకుంటే అంబరీషుడు అనే మహారాజు మాత్రం వీటిని అదుపులో ఉంచుకుని సామ్రాజ్యాన్ని సుదీర్ఘ కాలం పరిపాలించాడు..ఇలాంటి వారినే రాజర్షులు అంటారు...


Also Read: విభీషణుడు సహా ఇప్పటికీ జీవించి ఉన్న పురాణ పురుషులు వీళ్లే!


రాజర్షుల లక్షణాలు ఇవే!



  • పెద్దలను, పురోహితులను గౌరవిస్తాడు

  • ప్రజలను రక్షించడంలో అనుక్షణం అప్రమత్తంగా ఉంటాడు

  • పరస్త్రీలు, స్త్రీధనం పట్ల మోజు ఉండదు

  • ఇతరుల ఆస్తిపాస్తులు ఆశించడు

  • ధర్మం, అర్థం, కామం అనే పురుషార్థాలకు సమాన ప్రాధాన్యత ఇస్తాడు


పాలకుడి ఇలా న్యాయంగా ఉన్నప్పుడే ప్రజాభిమానం పొందుతాడు. పాలకులు గుణవంతులైతే వాళ్లు బలహీనంగా ఉన్నా కానీ ప్రజా మద్ధతు వాళ్లకే ఉంటుంది...అలా కానివారు ఎంత బలవంతులైనా రాజ్యభ్రష్టుడు కావాల్సిందే...


Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?


ఇలా ఆదర్శపాలకుడికి ఉండాల్సిన లక్షణాల గురించి చెప్పిన ఆచార్య చాణక్యుడు..గెలిచిన వ్యక్తి..ఓడినవారిపై ఎలాంటి ప్రతీకారం తీర్చుకోరని , గౌరవంగా చూస్తారని చెప్పాడు. ఆస్తులు స్వాధీనం చేసుకోవడం, వివిధ రకాల ఇబ్బందులకు గురిచేయడం లాంటివి చేయకుండా తనకి కూడా ఏదో బాధ్యత అప్పగించి అది సక్రమంగా నెరవేర్చేలా చూస్తాడు అని కౌటిల్యుడు వివరించాడు..


Also Read: ప్రజలకు ప్రభుత్వంపై అసంతృప్తి ఏర్పడడానికి కారణాలివే - చాణక్య నీతి !