మేష రాశి


ఈ రోజు మీ ప్రవర్తన అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది. మీ సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది. అనుకున్నపనులు పూర్తవుతాయి


వృషభ రాశి


ఈ రోజు మీకు చాలా మంచి రోజు. కొన్నాళ్లుగా కొనసాగుతున్న ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది, ప్రేమ జీవితంలో ఉన్నవారికి మీ మనసు అర్థమవుతుంది. వైవాహిక జీవితం బావుంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు మంచి ఫలితాలు పొందుతారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెడతారు.


మిథున రాశి


ఈ రోజు మీకు మంచి రోజు. ఉద్యోగులకు పనిఒత్తిడి పెరుగుతుంది. కొన్ని మంచి విషయాలు నేర్చుకుంటారు. పిల్లలతో సంతోష సమయం గడుపుతారు. వ్యాపారులు లాభాలు పొందుతారు. 


కర్కాటక రాశి 


మీరు మీ పనికి ప్రశంసలు అందుకుంటారు. ఎవ్వర్నీ బాధపెట్టకూడదు అని భావిస్తారు..అందుకు తగ్గట్టుగానే నడుచుకుంటారు. మీ నుంచి కొందరికి సహాయం అవసరం పడుతుంది. బద్ధకాన్ని వీడండి...ఆరోగ్యం, ఆహారంపై శ్రద్ధ పెట్టండి.


Also Read: రావణుడికి అయోధ్య ఇస్తానన్న రాముడు, శ్రీరామచంద్రుడి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలివే!


సింహ రాశి


ఈ రోజు ఈ రాశివారికి పనిభారం ఉంటుంది. రావాల్సిన ఆదాయం నిలిచిపోతుంది. ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు...ఎన్ని సమస్యలున్నా మీలో ఆత్మవిశ్వాసం మాత్రం చెక్కుచెదరదు.


కన్యా రాశి


కన్యారాశి వారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇంటా బయటా గౌరవం పొందుతారు. మీ మనసులోని మాటను ఎవరికైనా చెప్పాలనుకుంటే ఈ రోజు మీకు చాలా మంచి రోజు అవుతుంది. మీ పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి.


తులా రాశి


ఈ రాశి ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణ ఫలితాలున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం..చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకరి పట్ల మీ ఆకర్షణ పెరుగుతుంది..ఆ ప్రభావం మీ పనిపై పడుతుంది. మీరు జాగ్రత్తపడడం మంచిది


వృశ్చిక రాశి 


ఈ రోజు మీకు సాధారణ రోజు అవుతుంది. మధ్యాహ్నాం తర్వాత పరిస్థితిలో చాలా మార్పు వస్తుంది..ఉదయం నుంచి ఉన్న చికాకు తగ్గుతుంది. ఆగిపోయిన పనులు కొన్ని పూర్తవుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారు శుభవార్త వింటారు.


Also Read: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి


ధనుస్సు రాశి 


కుటుంబ సభ్యుల నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సహకారం అందుతుంది. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. వైవాహిక జీవితం బావుంటుంది. 


మకర రాశి


ఈ రోజు ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ఉద్యోగులు పని విషయంలో శ్రద్ధ వహించండి. ప్రేమికులకు మంచి రోజు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. తలపెట్టిన పనిపై ఏకాగ్రత అవసరం.


కుంభ రాశి


ఈ రోజు మీకు మంచి రోజు. ఉద్యోగులు తమ పనితీరుకి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు లాభాలు పొందుతారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వైవాహిక జీవితంలో శుభవార్తలు అందుతాయి. పరస్పరం ప్రేమ పెరుగుతుంది. 


మీన రాశి


ఈ రోజు మీరు ఒక ఆస్తిని కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు. దానికి సంబంధించిన ప్రణాళికలు వేస్తారు. ప్రేమికులు బహుమతులు అందుకుంటారు. ఇంట్లో సౌకర్యాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మీరు తలపెట్టిన పనికి కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.