Horoscope Today 29th December 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.


మేష రాశి 
ఉమ్మడి కుటుంబంలో నివసించే వ్యక్తులు తమ బంధువులతో ఏదో ఒక విషయంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వైవాహిక జీవితం బావుంటుంది. అనవసర మాటలు నియంత్రించండి. పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇల్లు మారడం వల్ల ప్రయోజనం ఉంటుంది.


వృషభ రాశి
మీరు మీ వృత్తి విషయంలో నిజాయితీగా ఉండాలి. పెద్ద ఆస్తి ఒప్పందాలు ఉండవచ్చు..జాగ్రత్తగా పరిశీలించండి.  కార్యాలయంలో పురోగతి ఉంటుంది. పెట్టుబడులు లాభసాటిగా ఉంటాయి. తొందరగా అలసిపోతారు. మీ సమయాన్ని మీ కుటుంబానికి కేటాయిస్తారు.


మిథున రాశి 
ఈ రోజు విద్యార్థులకు చదువుపై ఆసక్తి తక్కువగా..ఇతర విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మీ మనస్సులో ఏదో ఒక విషయం గురించి సందేహాలు ఉంటాయి. సృజనాత్మక పనిపై ఎక్కువ దృష్టి పెడతారు..దానిని ఆస్వాదిస్తారు. కుటుంబ సభ్యులు కూడా మీకు మద్దతు ఇస్తారు. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. ధాన్యాలపై పెట్టుబడి శుభప్రదం అవుతుంది. నూతన పెట్టుబడులు ఆలోచించి పెట్టాలి


Also Read: 7 నెలలు రకరకాల ఇబ్బందులు, 5 నెలలు ఆర్థిక ప్రయోజనాలు, 2023లో ధనస్సు రాశి వార్షిక ఫలితాలు


కర్కాటక రాశి
మీరు మీ ధైర్యంతో మాత్రమే అభివృద్ధి చెందుతారు. నూతన వస్త్రాలు పొందే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వివాదాలు పెట్టుకోకండి. శుభవార్త వినే అవకాశం ఉంది. ఉద్యోగంలో  మరింత కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. మీ ప్రవర్తనకు శత్రువులు కూడా ఫిదా అవుతారు. నిరుద్యోగులు స్నేహితుల సహాయంతో మంచి ఆఫర్ పొందుతారు


సింహ రాశి
ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్లయితే మీరు జీవితంలో ఒక కొత్త మార్గదర్శకాన్ని పొందుతారు. ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు తమకు మద్దతిచ్చే భాగస్వామి కోసం ఎదురుచూస్తారు. కార్యాలయంలో అధికారులతో వివాదాలు ఉంటాయి. మీ పొరపాటు వల్ల చేసిన పని చెడిపోవచ్చు. వ్యాపారులు లాభపడతారు


కన్యా రాశి
ప్రేమికులకు ఖర్చులు పెరుగుతాయి. వివాహితులు జీవిత భాగస్వామికోసం నూతన ప్రయోగాలు చేస్తారు. ఇద్దరి మధ్యా ప్రేమ పెరుగుతుంది కానీ ఏదో విషయంలో సందేహాలు వెంటాడుతాయి. మీరు మనసులో దాచుకోకుండా బయటపడడం మంచిది. ఆర్థిక పరిస్థితి బాగానేఉంటుంది. 


Also Read: 2023లో ఈ 5 రాశులవారు సక్సెస్ కి కేరాఫ్, కొన్నేళ్లుగా పడుతున్న కష్టాల నుంచి ఊహించనంత ఉపశమనం


తులా రాశి 
ఆర్థిక పరంగా మీకు ఈ రోజు శుభదినం. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. ఇంట్లో ఆనందం పెరుగుతుంది. ఎవరితోనూ వాదించకండి. మీ హక్కులను దుర్వినియోగం చేయవద్దు. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. పెట్టుబడులు లాభాలనిస్తాయి. మీ తెలివితక్కువ వల్ల హాని జరిగే అవకాశం ఉంది. 


వృశ్చిక రాశి
వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న మార్పులుంటాయి. చదువుపై ఆసక్తి లోపిస్తుంది. పాదాలలో నొప్పి కారణంగా ఇబ్బంది ఉంటుంది.  ఖర్చుులు పెరుగుతాయి. ఒత్తిడి పెరుగుతుంది. రిస్క్ తీసుకోవద్దు. జీవిత భాగస్వామిపై మీ విశ్వాసం బలంగా ఉంటుంది. తనలో ఏదో విషయం మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది


ధనుస్సు రాశి
మీరు పనిలో చాలా బిజీగా ఉండటం వల్ల తల్లిదండ్రులకు ఎక్కువ సమయం ఇవ్వలేరు. తోబుట్టువుల నుంచి మద్దతు పొందుతారు. వ్యాపారానికి సంబంధించి ప్రయాణం ఉంటుంది. ప్రాజెక్ట్ కోసం కొత్త భాగస్వాములొస్తారు. ఇంట్లో ఎవరికైనా అస్వస్థత ఉంటుంది. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి


మకర రాశి
ఈ రోజు మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు..మీలో సృజనాత్మకత పెరుగుతుంది. మీ ప్రవర్తన ద్వారా మంచి పేరు సంపాదించుకుంటారు. కొత్త ప్రణాళికలు తయారుచేసుకుని ప్రారంభించడం మంచిది. ఉద్యోగుల పనితీరులో మెరుగుదల ఉంటుంది. ఏదో భయం, ఆందోళన వెంటాడుతుంది. 


కుంభ రాశి
ఈ రోజు మీకు ముఖ్యమైన రోజు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. కొన్ని దివ్య ప్రదేశాన్ని సందర్శించే అవకాశం ఉంది. మతపరమైన పనుల పట్ల ఆసక్తి ఉంటుంది. పెట్టుబడి శుభప్రదంగా ఉంటుంది. రాజకీయ మద్దతు లభిస్తుంది. ప్రమాదం జరిగే అవకాశం ఉంది..దూరంగా ఉండండి. మీ ప్రవర్తన కుటుంబ సభ్యులను మీ వైపు ఆకర్షిస్తుంది. 


మీన రాశి
కుటుంబంలో సంతోషం ఉంటుంది. తల్లి తరపువారినుంచి కొన్ని శుభవార్తలు వింటారు. అవి విన్నాక మీ ప్రవర్తనలో మృదుత్వాన్ని కోల్పోవద్దు. కుటుంబ సభ్యులతో గొడవలకు దూరంగా ఉండాలి. రోజు ప్రారంభంలో సోమరితనం ఆధిపత్యం చెలాయిస్తుంది. వాహనాలు, యంత్రాలు మరియు అగ్నిప్రమాదాల వినియోగంలో జాగ్రత్తగా ఉండండి. వివాదాలకు దూరంగా ఉండండి. మితిమీరిన విశ్వాసం హానికరం.