Horoscope Today 27th January 2023: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం. 


మేష రాశి
ఈ రాశి ఉద్యోగులకు పురోభివృద్ధితో పాటూ ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీరు ఓ చెడు పనిలో విజయం సాధిస్తారు. రోజంతా సంతోషంగా ఉంటారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. 


వృషభ రాశి
ఈ రోజంతా ప్రయాణంలో గడిచిపోతుంది. కార్యాలయ పనులతో బిజీగా ఉంటారు.బంధువులను కలుస్తారు. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.   


మిథున రాశి
ఈ రోజు మీకు ఆకస్మిక ద్రవ్య లాభాలు అందవచ్చు. పనిలో శ్రమ తర్వాత విజయం తక్కువగా ఉంటుంది... అందుకే కొంత ఓపిక అవసరం. పనికి సంబంధించి చేసే ప్రయత్నాల్లో జాప్యం జరగొచ్చు. మనోబలం తగ్గకుండా చూసుకోవడం మంచిది


కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశి వ్యాపారులు, ఉద్యోగులకు మంచి రోజు. ఉద్యోగులకు ఉన్నతాధికారులనుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ సంబంధాలు బావుంటాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.  


Also Read: ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆచార్యుడు ఈ తరానికి సమతా మూర్తి చినజీయర్ స్వామి!


సింహ రాశి
ఈ రోజంతా మీరు చాలా బిజీగా ఉంటారు. కెరీర్ పరంగా కొన్ని ప్రత్యేక మార్పులు ప్లాన్ చేసుకుంటారు. పిల్లల చదువుకి సంబంధించి కొంత సమయం కేటాయించండి. ఆహారం విషయంలో ఎలాంటి అజాగ్రత్త వద్దు. 


కన్యా రాశి
ఈ రోజు మీ ప్రేమ జీవితానికి పరీక్షలా ఉంటుంది. మీ ప్రియమైన వారు మీతో చెప్పిన విషయం మిమ్మల్ని బాధిస్తుంది...కానీ ఓపికపట్టండి. కోపం తగ్గించుకోవడం మంచిది. కుటుంబానికి సమయం కేటాయంచి మాట్లాడడం ద్వారా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. 


తులా రాశి 
ఈ రోజు మీ ఖర్చులు పెరుగుతాయి..ఇది మీ ఇబ్బందులకు కారణం కావొచ్చు. కుటుంబంతో మీ సమన్వయం బావుంటుంది. ఎదుటివారు చెప్పేది పూర్తిగా విన్నాక..వారికి సహకరించాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఉద్యోగులు, వ్యాపారులు తమ పనులపై శ్రద్ధ వహించండి.


వృశ్చిక రాశి 
ఈ రోజు మీ మనసులో కొత్త ఆలోచనలు వస్తాయి. రాబోయే కొద్ది రోజుల్లో మీరు కొన్ని పెద్ద పని కోసం ప్లాన్ చేసుకోవచ్చు. కుటుంబంతో కలిసి మాట్లాడి సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు.


Also Read: రథసప్తమి రోజు తలపై జిల్లేడు ఆకులు -రేగుపళ్లు పెట్టుకుని స్నానం చేయాలంటారెందుకు!


ధనుస్సు రాశి 
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఆదాయం పెరగడంతో పాటూ ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి. మీ ఆలోచనా విధానం బావుంటుంది...మంచి మార్గంలో జీవిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. 


మకర రాశి 
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. మానసికంగా  ఒత్తిడికి లోనవుతారు..ఈ కారణంగా మీరు ఏ నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉంటారు. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు పెద్దగా మార్పులుండవు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి.


కుంభ రాశి
ఈ రోజు దూర ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సివస్తే  తల్లిదండ్రుల నుంచి అనుమతి తీసుకుని వెళ్లడం మంచిది. బాధ్యతారహితమైన వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది..వారి ప్రభావం మీపై పడుతుందని తెలుసుకోండి. 


మీన రాశి 
ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఈరోజు పూర్తవుతాయి. స్నేహితుల నుంచి సహాయం పొందుతారు. ప్రత్యర్థులను దూరం ఉంచుతారు. మీ ఆలోచన కొంతమంది కుటుంబ సభ్యుల దృక్పథాన్ని మార్చవచ్చు. ఇతరులపై మీ అభిప్రాయాన్ని రుద్దకండి.