మేష రాశి


ఈ రోజు మీ జీవితంలో కొంత మెరుగుదలలు అవసరం. మీ శత్రువులు మీకు చెడు చేయాలని ప్రయత్నించినా వర్కౌట్ కాదు. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి సమయం. ఆర్థిక పరిస్థితి బావుంటుంది


వృషభ రాశి


ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఆదాయం పెరుగుతుంది అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. రోజంతా సంతోషంగా ఉంటారు. కుటుంబ వాతావరణం బావుంటుంది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వల్ల ఇంటి సభ్యుల మధ్య ఉన్న దూరం తగ్గుతుంది


మిథున రాశి 


ఈ రోజు మీరు ఒకేసారి చాలా ప్రణాళికలు వేసుకోవచ్చు. మాటతీరులో మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తే అన్నింటా మీదే విజయం.  
ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కొన్ని సందర్భాల్లో కొత్త ప్రారంభం అనే పరిస్థితి ఉంటుంది.


కర్కాటక రాశి


కొత్త బాధ్యతల భారాన్ని మీ భుజాలపై మోస్తారు. మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు మీ మాటలను ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవడం మంచిది. మీరు ప్రేమించే వ్యక్తి అనారోగ్యం అకస్మాత్తుగా ఆందోళన కలిగిస్తుంది. మిత్రుల నుంచి సహాయసహకారాలు లభిస్తాయి.


Also Read: ఉత్సాహం, ధైర్యం, ఆదాయం, అభివృద్ధి - ఈ ఉగాది నుంచి ఈ రాశివారికి మామూలుగా లేదు!


సింహ రాశి


ఈ రోజు మీకు మంచి రోజు. చాలా సౌకర్యాలను ఆస్వాదిస్తారు. వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. వ్యాపారం బావుంటుంది. ఉద్యోగులకు కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. 


కన్యా రాశి


ఈ రోజు కన్యారాశి బద్ధకానికి కేరాఫ్ లా ఉంటారు. ఆ దశ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తే మాత్రం తొందరగానే సెట్టవుతారు. కొత్త స్నేహితులను కలుస్తారు. భవిష్యత్ లో ముందుకు సాగడానికి నూతన అవకాశాలు లభిస్తాయి. మీ ఆకాంక్షలు త్వరలో నెరవేరుతాయి. ఏదైనా సమస్య గురించి ఎక్కువ ఆలోచించకపోవడం మంచిది.


తులా రాశి 


ఈ రాశివారు ఈ రోజు మనసులో ఆలోచనలను అదుపులో పెట్టుకోవడం మంచిది. వ్యాపారులకు నూతన పెట్టుబడులకు మంచి రోజు కాదు. ఆరోగ్యం బావుంటుంది..ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పాత సంబంధాలను పునరుద్ధరించడానికి మంచి రోజు. 


వృశ్చిక రాశి


ఈ రోజు మీకు ఒడిదుడుకులతో నిండిన రోజు అవుతుంది. అకస్మాత్తుగా ఖర్చులు పెరుగుతాయి, ఇది మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యం కూడా బలహీనంగా ఉంటుంది. వాహనం నడిపేవారు జాగ్రత్తగా ఉండాలి..లేదంటే ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది.


ధనుస్సు రాశి 


స్నేహితుడి భాగస్వామ్యంతో డబ్బు సంపాదించే అవకాశం లభిస్తుంది. ఇతరుల పట్ల సహకార స్ఫూర్తితో విజయం సాధిస్తారు. భాగస్వామ్యం లేదా సంబంధాల గురించి మీకు ఆందోళన ఏమైనా ఉంటే దాన్ని ఆదిలోనే పరిష్కరించుకోవడం మంచిది. 


Also Read: శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారు బాగా సంపాదిస్తారు కానీ మానసికంగా కృంగిపోతారు అంతలోనే ధైర్యంగా దూసుకెళ్తారు


మకర రాశి 


ఈ రోజు ఎలాంటి ప్రమాదకరమైన పనులు చేయకపోవడం మంచిది. మీ కుటుంబ జీవితం సౌకర్యవంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ ఉత్సాహం అందర్నీ ఆకర్షిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభఫలితాలున్నాయి. మీ లక్ష్యాలను సాధించడానికి మీరు ఇంకా కష్టపడాలి.


కుంభ రాశి


ఈ రోజు మీకు సాధారణ రోజు. మీ కష్టాన్ని నమ్మి విజయపథంలో ముందుకు సాగితేనే విజయం లభిస్తుంది. అడ్డంకులు ఎదురైనా ముందుకు సాగితేనే అనుకున్న పనులు పూర్తవుతాయి. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. 


మీన రాశి


ఈ రోజు మీరు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఓపికగా పనిచేయండి సమయాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబంలో కొన్ని విషయాలు అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. మీ మనస్సులో ఒకేసారి  చాలా విషయాలపై మథనం జరుగుతుంది.. చాలా ప్రణాళికలు వేస్తారు.