Daily Horoscope for 17th October 2024 

మేష రాశి

ఈ రోజు మీరు చేపట్టే పనులకు ఆటంకాలు తప్పవు. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించండి. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగించండి. ఉద్యోగం, వ్యాపారంలో నూతన ప్రణాళికలు అమలుచేసేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. 

వృషభ రాశి

ఆర్థిక విషయాలకు సంబంధించి సమస్యలు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తిని కలిగి ఉంటారు.  శత్రువులపై విజయం సాధిస్తారు. మీ గురువు పట్ల విధేయత కలిగి ఉండండి. కొత్త వ్యాపార ఆలోచనలు రావచ్చు. మీరు నమ్మకద్రోహ స్నేహితులను గుర్తించగలరు 

మిథున రాశి

వైవాహిక బంధంలో ఉండే వివాదాలను పరిష్కరించుకోగలరు. ప్రణాళికలను సమక్రంగా అమలుచేస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వస్తు సౌఖ్యం ఉంటుంది. పిల్లలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. 

Also Read: నవంబర్ ఫస్ట్ వీక్ గడిచే వరకూ ఈ 3 రాశులవారికి కష్టాలు తప్పవు - ఆర్థికంగా, ఆరోగ్యపరంగా! కర్కాటక రాశి

ఈ రోజు పని వాతావరణం కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. అధికారులు మీ పనితీరుని గుర్తిస్తారు. కొత్త అవకాశాలు వస్తాయి..ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వివాదాస్పద సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త.

సింహ రాశి

సామాజిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపార పరిస్థితి బాగుంటుంది. కొంతమంది తమ వర్కింగ్ స్టైల్ గురించి ఆందోళన చెందుతారు. స్నేహితులతో సమయం గడుపుతారు. కెరీర్ సంబంధిత చదువులపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వంకర వ్యక్తుల సహవాసానికి దూరంగా ఉండండి. ప్రియమైన వారితో వాదించకండి.

కన్యా రాశి

మీ దినచర్య క్రమబద్ధంగా ఉంటుంది. పని చేసే ప్రాంతంలో క్రమశిక్షణతో ఉంటారు. వ్యాపారంలో అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. మీరు స్టాక్ సంబంధిత పథకాలలో డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. ఓపికగా పని చేయాలి. మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆందోళనలు తొలగిపోతాయి

తులా రాశి

ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో ఏదైనా సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ ప్రణాళికలను వెల్లడించవద్దు. బంధువులను కలుస్తారు. మీ మాటతీరు మెచ్చుకోలుగా ఉంటుంది. మీ ఆలోచనలతో రాజీ పడొద్దు. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.

Also Read: రాశులవారికి ఈ వారం (అక్టోబరు 14 to 20 ) 'గురిపెట్టినా ఎర పడదు' - శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ!

వృశ్చిక రాశి

కెరీర్లో  ఎదురయ్యే ఆటంకాలు ఈ రోజు తొలగిపోతాయి. మీ సంపద  పెరుగుతుంది. చాలా కాలంగా ఉన్న టెన్షన్ తొలగిపోతుంది. డబ్బు ఆదా చేసేందుకు ప్రయత్నిస్తారు. జీవితంలో వచ్చే మార్పులను అంగీకరించండి. 

ధనస్సు రాశి

వైవాహిక జీవితంలో సహకార ఆలోచనలు ఉంటాయి. సోమరితనం పెరుగుతుంది. అపార్థం వల్ల స్నేహితులతో వివాదం జరిగే అవకాశం ఉంది.  యోగా , ప్రాణాయామం మీ దినచర్యలో భాగంగా చేసుకోండి.  ఉద్యోగుల పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. అవగాహన లేకుండా షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టకండి.

మకర రాశి

ఈ రాశివారికి ఈ రోజు పని ఒత్తిడి పెరుగుతుంది. ఆలోచనల్లో ప్రతికూలతకు అవకాశం ఇవ్వొద్దు. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు లాభిస్తాయి. ప్రభుత్వ పనుల్లో విజయం సాధిస్తారు. మంచి సాంగత్యం వల్ల లాభాలు ఉంటాయి. 

Also Read: అక్టోబరు 14 to 20 .. ఈ వారం ఈ 4 రాశులవారికి పట్టిందల్లా బంగారమే - అన్నీ అనుకూల ఫలితాలే!

కుంభ రాశి

ఈరోజు ఉద్యోగస్తులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. అహంకారానికి దూరంగా ఉండాలి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. కొత్త పనులకు సంబంధించి ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోండి. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. 

మీన రాశి

ఎవరి పనిలోనూ జోక్యం చేసుకోకండి. పెద్ద కంపెనీలో చేరడానికి లేదా భాగస్వామిగా ఉండటానికి అవకాశం పొందవచ్చు. అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తిచేస్తారు. కెరీర్‌కు సంబంధించి పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.  

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.