Daily Horoscope for 16th October 2024
మేష రాశి
ఈ రోజు మీరు ఏ పనిపైనా కాన్సన్ ట్రేట్ చేయలేరు. పట్టువదలని మీ ప్రయత్నాలు ప్రత్యర్థుల్ని అసూయపడేలా చేస్తుంది. తల్లిదండ్రులతో సంయమనంతో ప్రవర్తించాలి. వినోద వనరులపై డబ్బు ఖర్చు చేస్తారు.
వృషభ రాశి
కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ఆందోళన ఉంటుంది. వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. సన్నిహితులతో మీ సంబంధాలు బలపడతాయి. ఒకరి భావాలను ఒకరు గౌరవించండి. ఈ రోజు స్త్రీలకు చాలా మంచి రోజు అవుతుంది. విద్యార్థులు తమ చదువుల విషయంలో చాలా శ్ర్ధగా వ్యవహరిస్తారు.
మిథున రాశి
ఈ రోజు మీరు కార్యాలయంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. మీ జీవిత భాగస్వామి పట్ల మీ ప్రవర్తనను మంచిగా ఉంచండి. కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు. సామాజిక సేవా సంస్థలకు విశేష కృషి చేస్తారు. అదృష్టం మీ వైపు ఉంటుంది.
కార్కాటక రాశి
ఈ రోజు మీ ఆలోచనా శైలిలో మార్పు ఉంటుంది. బంధువులు, స్నేహితులకు తగినంత సమయం ఇస్తారు. కమీషన్ సంబంధిత వ్యాపారం చేసే వారికి రోజు చాలా మంచిది. యువత పురోగతికి అవకాశాలు లభిస్తాయి. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. పూర్తి విశ్వాసంతో పని చేస్తారు. అదృష్టం కలిసొస్తుంది.
Also Read: రాశులవారికి ఈ వారం (అక్టోబరు 14 to 20 ) 'గురిపెట్టినా ఎర పడదు' - శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ!
సింహ రాశి
మీ స్నేహితులు, సన్నిహితుల మాటలు చెడుగా అనిపించవచ్చు. అనవసర చర్చలకు అవకాశం ఇవ్వొద్దు. ఎవ్వర్నీ అతిగా నమ్మేయవద్దు. మీ ప్రియమైన వారి తీరు మిమ్మల్ని బాధపెడుతుంది. అనవసరమైన కోపం, చిరాకు మిమ్మల్ని శాసిస్తుంది.
కన్యా రాశి
ఈ రోజు చాలా మంచి రోజు. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ఇదే మంచి సమయం. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలపై విశ్వాసం మీకుంటే ప్రత్యర్థులు మీ ముందు తలవంచుతారు. కుటుంబంలో సమస్యలు పరిష్కారం అవుతాయి.
తులా రాశి
మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. క్రమంగా మీ పనులన్నీ సరైన దిశలో పూర్తవుతాయి. మీ భావోద్వేగాన్ని ఇతరులు అలుసుగా తీసుకుంటారు. మీ స్నేహితుల నుంచి ప్రయోజనం పొందుతారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు.
వృశ్చిక రాశి
మీ పిల్లల విజయంతో మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. సకాలంలో పనులన్నీ పూర్తవుతాయి. ప్రేమ వివాహానికి ప్లాన్ చేసుకోవచ్చు. సంగీత రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు చాలా బాగుంటుంది. రాజకీయ ప్రభావంతో నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు.
Also Read: అక్టోబరు 14 to 20.. ఈ రాశులవారికి శుభం-అశుభం మిశ్రమంగా ఉంటుంది - ఈ 3 రంగాలవారికి విశేష జయం!
ధనుస్సు రాశి
ఒత్తిడి పరిస్థితి దూరమవుతుంది. మీరు మీ కష్టానికి తగ్గట్టుగా ఫలితాలు పొందుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దు. మనసులో సందిగ్ధత ఏర్పడవచ్చు. మీరు వ్యాపారంలో పెద్ద రిస్క్ తీసుకోవచ్చు.
మకర రాశి
ఈ రోజు మీరు కెరీర్లో మరో మెట్టు ఎక్కేందుకు అడుగు ముందుకువేస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో కొత్త ప్రణాళికలపై దృష్టి కేంద్రీకరిస్తారు. వివాహ ప్రయత్నాల్లో ఉండేవారికి సంబంధం నిశ్చయమవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువులు, స్నేహితులతో ఉండే సమస్యలు సమసిపోతాయి.
కుంభ రాశి
ప్రైవేట్ కంపెనీలలో మేనేజ్‌మెంట్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు అద్భుతమైన అవకాశాలను పొందగలరు. మీ గౌరవం పెరుగుతుంది. ప్రజలు మీ పనిని మెచ్చుకుంటారు. శుభ కార్యాలలో డబ్బు ఖర్చుచేస్తారు. మీ పనులు సకాలంలో పూర్తవుతాయి.
మీన రాశి
ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది. పెద్ద కంపెనీలో చేరడానికి లేదా భాగస్వామిగా ఉండటానికి అవకాశం పొందవచ్చు. మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. ప్రేమికులకు శుభదినం.
Also Read: అక్టోబరు 14 to 20 .. ఈ వారం ఈ 4 రాశులవారికి పట్టిందల్లా బంగారమే - అన్నీ అనుకూల ఫలితాలే!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.