Horoscope 11th September 2022: ఈ రోజు మేష రాశి వారికి డబ్బు సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. వృషభ రాశి వారికి కుటుంబ మద్దతు లభిస్తుంది.  సెప్టెంబరు 11 ఆదివారం ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.


మేష రాశి
స్నేహితుల సహకారంతో  మీసమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. వ్యాపారులు లాభపడతారు, ఉద్యోగులు ఇది మంచి సమయం.


వృషభ రాశి
ఈ రోజు వృషభ రాశి వారు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. వ్యాపారలు కొత్త ప్రణాళికలు వేసుకునేందుకు ఇదే మంచి సమయం. ఎనర్జటిక్ గా ఉండండి. ప్రముఖ వ్యక్తులను కలవడం వల్ల మీ భవిష్యత్ కి ఉపయోగపడతారు. ఎనర్జటిక్ గా ఉంటారు.


మిథున రాశి
ఈ రోజు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి ఆశ నెరవేరుతుంది. ఏ పని చేసినా సక్సెస్ అవుతారు. ప్రేమ జీవితంలో మాధుర్యం ఉంటుంది. ధనలాభం కోసం కొత్త ప్రణాళికలు వేస్తారు.


కర్కాటక రాశి
ఈ రోజు కార్కాటక రాశివారికి కార్యాలయంలో పనిభారం ఉంటుంది. స్వర్ణకారులు వ్యాపారం విషయంలో జాగ్రత్త పడాలి. నూతన పెట్టుబడులకు ఇది అనుకూలమైన రోజు. మీ ప్రియమైన వారితో అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. 


Also Read: అక్టోబరు, నవంబరులో రెండు గ్రహణాలు - ఈ రాశులవారు చూడకూడదు!


సింహ రాశి
ఈ రోజు మీరు మీ చర్యలకు ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యాన్ని ఆశ్రద్ధ చేయవద్దు. ఏదో విషయంలో కొంత చిరాగ్గా ఉంటారు. అనుభవజ్ఞుల నుంచి సలహాలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.


కన్యా రాశి
ఓ శుభకార్యానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులు, వ్యాపారులకు కలిసొచ్చే సమయం. సృజనాత్మక విషయాలపై ఆసక్తి ఉంటుంది.


తులారాశి
ఈ రోజు తులా రాశి వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం మానుకోండి. కంటికి సంబంధించిన సమస్యలు రావొచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.



వృశ్చిక రాశి
వృశ్చిక రాశివారు వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటే ఆ ప్రయత్నం ప్రారంభించండి. ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. భావోద్వేగాలు నియంత్రించుకోండి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి.


ధనుస్సు రాశి
వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం మరియు ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. రక్తపోటు సమస్య పెరగవచ్చు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు.


మకర రాశి
ఈ రాశి అవివాహితులకు సంబంధం కుదురుతుంది. వీరు శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రణాళికలు కలిసొస్తాయి. ఈ రోజు ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయకండి.


కుంభ రాశి
కుంభరాశి ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే అవకాశాలు ఉన్నాయి. మీ దినచర్యలో ధ్యానం, యోగా చేర్చండి. వ్యక్తిగత సంబంధాలు బలంగా ఉంటాయి.   


మీన రాశి
ఈ రోజు మీ ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ కోపాన్ని నియంత్రించుకోండి. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. భవిష్యత్ కోసం ప్రణాళికలు వేసుకుంటారు. ఇంట్లో సంతోషం ఉంటుంది.