Donation According to Zodiac Sign: పంచాంగం ప్రకారం, ప్రతి నెలా కృష్ణ పక్షం 15వ రోజున అమావాస్య వస్తుంది. ప్రస్తుతం శ్రావణమాసం నడుస్తోంది. ఈ నెలలో అమావాస్య తిథి శనివారం, ఆగస్టు 23న ఉంది. శనివారం రోజున రావడంతో దీనిని శని అమావాస్య లేదా శనిశ్చర అమావాస్య అని కూడా పిలుస్తారు. అమావాస్య తిథి నాడు స్నానం, దానం, పితృదేవతలకు తర్పణం చేయడం చాలా ముఖ్యమైనది.
ఆగస్టు 23న శనిశ్చర అమావాస్య
| శ్రావణ అమావాస్య తిథి ప్రారంభం | ఆగస్టు 22 శుక్రవారం ఉదయం 11 గంటల 53 నిమిషాల నుంచి |
| శ్రావణ అమావాస్య తిథి ముగింపు | ఆగస్టు 23 శనివారం ఉదయం 11 గంటల 17 నిమిషాలకు |
| శ్రావణ శని అమావాస్య తిథి | శనివారం, ఆగస్టు 23 (ఉదయాతిథి ప్రకారం) |
అమావాస్య తిథి నాడు పవిత్ర నదిలో స్నానం చేసి దానం చేసే ఆచారం ఉంది. అమావాస్య నాడు చేసే దానం పితృదేవతలను తృప్తిపరుస్తుందని నమ్ముతారు. ఆగస్టు 23న ఉదయం 11 గంటల 17 నిమిషాల వరకు దానం చేసుకోవచ్చు. కానీ రాశి ప్రకారం చేసే దానం మరింత ఫలవంతంగా పరిగణిస్తారు. దీనివల్ల పితృదేవతలు సంతోషిస్తారు , జాతకంలో నడుస్తున్న అశుభ గ్రహాలు కూడా శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. శ్రావణ శని అమావాస్య నాడు రాశి ప్రకారం ఏయే వస్తువులను దానం చేయాలో తెలుసుకుందాం.
అమావాస్య 2025: రాశి ప్రకారం దానం
మేష రాశి (Aries)- ఎరుపు రంగు వస్త్రాలు, ఎర్రటి కందిపప్పు, బెల్లం దానం చేయడం ఉత్తమం.
వృషభ రాశి (Taurus)- స్నానం చేసిన తర్వాత పితృదేవతలకు తర్పణం విడిచి, తెల్లటి వస్త్రాలు, పాలు , బియ్యం దానం చేయండి.
మిథున రాశి (Gemini)- ఆకుపచ్చని వస్త్రాలు, పెసరపప్పు , ధనియాలు దానం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
కర్కాటక రాశి (Cancer)- వెండి, బియ్యం, పాలు దానం చేయండి. మానసిక శాంతి లభిస్తుంది.
సింహ రాశి (Leo)- స్నానం చేసిన తర్వాత సూర్యునికి అర్ఘ్యం సమర్పించి గోధుమలు, బెల్లం, రాగి పాత్రను దానం చేయండి.
కన్య రాశి (Virgo)- పెసరపప్పు, ఆకుపచ్చని వస్త్రాలు, ఆకుకూరలు , పండ్లను దానం చేయండి.
తుల రాశి (Libra)- తెల్లటి వస్తువులు, ధాన్యం లేదా వస్త్రాలను దానం చేయవచ్చు.
వృశ్చిక రాశి (Scorpio)- ఎరుపు రంగు వస్త్రాలు, కందిపప్పు , బెల్లం దానం చేయండి. పితృదేవతలు సంతోషిస్తారు .. మంగళ దోషం తొలగిపోతుంది.
ధనుస్సు రాశి (Sagittarius)- పసుపు రంగు వస్తువులు, పసుపు, శనగపప్పు, అరటిపండు , పసుపు వస్త్రాలు దానం చేయండి.
మకర రాశి (Capricorn)- అమావాస్య నాడు స్నానం చేసిన తరువాత శని దేవుడిని ధ్యానిస్తూ నల్లటి వస్త్రాలు, మినపప్పు, నువ్వులను దానం చేయండి.
కుంభ రాశి (Aquarius)- తృదేవతలకు తర్పణం ఇవ్వండి. నీలం రంగు వస్త్రాలు, నువ్వులు , నూనెను దానం చేయండి. సాయంత్రం శని దేవుడిని పూజించండి.
మీన రాశి (Pisces)- పసుపు రంగు వస్త్రాలు, శనగపప్పు, పసుపు పండ్లు, పువ్వులు, వస్త్రాలు దానం చేయండి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. వీటిని పరిగణలోకి తీసుకునేముందు,అమలు చేసేముందు మీకు నమ్మకమైన ఆధ్యాత్మికవేత్తల సలహాలు కూడా స్వీకరించండి.