కొన్ని నమ్మకాలను ప్రశ్నించకుండా పాటిస్తూ వస్తున్నారు. ఏదైనా శుభకార్యం తలపెట్టెందుకు వెళ్తున్నపుడు ముగ్గురు వెళ్ల కూడదు అంటుంటారు. అలాగే కొత్త పనేదైనా ప్రారంభించేందకు ముగ్గురు పూనుకోకూడదు అంటుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఇద్దరు లేదా నలుగురు లేదా అంతకు మించి వెళ్లాలని కూడా అంటారు. అలా ముగ్గురు కలిసి తలపెట్టిన పని ముందుకు సాగదని కూడా నమ్మకం. కొందరు నిదర్శనాలు కూడా చూపుతుంటారు. ఇలాంటి నమ్మకాలలో ఒకటి తినే ఆహారం విషయంలో కూడా ప్రాచూర్యంలో ఉంది. 


మూడు సంఖ్యలో వడ్డించరు


చాలా ఇళ్లలో ఒకటే సారి 3 రోట్టెలు వండించరు, ప్యాక్ చేసి కూడా ఇవ్వరు. దీని వెనుక అసలు కారణం చాలా మందికి తెలియదు. ఇలా వండిచకూడదని మాత్రం అందరూ ఒప్పుకుంటారు. కేవలం రోటీ మాత్రమే కాదు పూరీ, పరోటాకు కూడా ఈ నియమం వర్తిస్తుంది. దీని వెనుకున్న నమ్మకం గురించి తెలుసుకుందాం.


జ్యోతిషంలో అశుభంగా 


జ్యోతిషంలో మూడు సంఖ్యను శుభసూచకంగా భావించరు. పూజలో లో మాత్రమే కాదు జీవితంలో కూడా మూడు సంఖ్యను అశుభంగా భావిస్తారు. మరణించిన వ్యక్తి పేరుతో వడ్డించే విస్తరిలో  మూడు రెట్టెలుల ఉంచాలని నమ్ముతారు. అందుకే ప్రాణాలతో ఉన్న వారికి మూడు రొట్టెలు వడ్డించకూడదని నమ్ముతారు. తినే పదార్థాలు ఏవైనా సరే అవి పూరీ, పరోటా వంటివైనా సరే మూడు వడ్డించడం అశుభంగా భావిస్తారు.


సైంటిఫిక్ రీజన్స్ ఇలా 


మూడు కలిపి తినడం వల్ల బరువు పెరుగుతారు కాబట్టి కూడా మూడు తినకూడదని అంటారు. మాములుగా రెండు రొట్టెలు ఒక  వ్యక్తికి సరిపోతాయి. ఇంకోకటి ఎక్కువ తినడం వల్ల శరీరంలో ఎక్కువ కాలరీలు చేరుతాయనేది ఒక సైంటిఫిక్ రీజన్. ఎక్కువైన కాలరీల వల్ల కొవ్వు చేరుతుంది. ఒంట్లో కొవ్వు చేరితే మలబద్దకం కూడా పెరుగుతుంది. అంతే కాదు బద్దకం కూడా పెరుగుతుంది. అందుకని రొట్టెలు మూడు వడ్డంచ వద్దు అని అంటుంటారని దాని వెనుకున్న లాజిక్ గా భావించవచ్చు. ఎవరైనా అవసరానికి మించి తినకూడదని దీని వెనుకున్న భావం అయి ఉంటుంది.


శాస్త్ర బద్ధ ఆధారమేమీ లేదు


ప్లేట్ లో మూడు రోట్టెలు వడ్డించ కూడదనే శాస్త్రీయ ఆధారాలేమీ లేవు. దీని వెనకుండే విశ్వాసం గురించి ఎవరికీ పెద్దగా లేదు. ఇలా మూడు రొట్టెలు వడ్డించ కూడదని పెద్దలు చెప్పారు కనుక పాటించాలని అని శతాబ్ధాలుగా ఈ ప్రథ కొనసాగిస్తున్నారు. దీని వెనుకున్న అసలు కారణాన్ని మాత్రం ఏ జ్యోతిష శాస్త్రం కానీ ఇతర శాస్త్రాలు కానీ వివరించలేదు. ఇది జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న విషయం మాత్రమే. శతాబ్ధాలుగా పాటిస్తూ వస్తున్నారు కనుక అందరూ పాటిస్తున్నారు. ఇలాంటి చిన్నచిన్న నమ్మకాలను పాటించడం వల్ల పెద్దగా నష్టం ఉండదు కానీ కొన్ని నమ్మకాలు లాజిక్ లేకుండా నష్టపరుస్తుంటాయి. అలా నష్టం వాటిల్లే నమ్మకాల విషయంలో మాత్రం కాస్త చూసుకుని పాటించడం అవసరం. నమ్మకాల విషయంలో జాగ్రత్త గా ఉండాలి అనేది అన్నింటికంటే ముఖ్యమైన నమ్మకంగా ఉండడం అవసరం.