Ashadha Amavasya 2023 Donts: ఈసారి ఆషాఢ అమావాస్య జూలై 17న రానుంది. ఈ రోజు నదీస్నానం, దానధర్మాలు, పితృపూజలకు విశేష ప్రాధాన్యత ఉంది. ఆషాఢ అమావాస్య లేదా భీమా అమావాస్య రోజున, పుణ్యం కోసం అనేక కార్యాలు నిర్వహిస్తారు. అయితే కొన్ని చేయ‌కూడ‌ని ప‌నులపై నిషేధించారు. తెలిసో తెలియకో ఆషాఢ అమావాస్య నాడు మనల్ని దోషులుగా మార్చే కొన్ని పనులు చేస్తుంటాం. ఆషాఢ అమావాస్య రోజు మనం ఏమి చేయకూడదో తెలుసా..?


మొక్కలు నాటండి
ఆషాఢ అమావాస్య రోజు చెట్లు, మొక్కలకు సేవ చేయడానికి.. కొత్త వాటిని నాటడానికి అనుకూలమైన రోజు. ఇలా చేయడం వల్ల గ్రహ దోషం, పితృ దోషాలు తొలగిపోతాయి. ఈ రోజు మీరు చెట్లకు, మొక్కలకు హాని చేయకూడదు. ఒక‌వేళ తెలిసో, తెలియ‌కో మొక్క‌ల‌కు హాని చేస్తే మీరు గ్రహ దోషం లేదా పితృ దోషానికి గురికావ‌చ్చు.       


Also Read : ఆషాఢ అమావాస్య 2023 శుభ ముహూర్తం, ఆరాధన విధానం, ప్రాముఖ్యత తెలుసా!


పితరుల ఆగ్రహానికి గురికావద్దు
ఆషాఢ అమావాస్య నాడు పూర్వీకుల తృప్తి కోసం తర్పణ, పిండాన, శ్రాద్ధ కర్మ తదితర పూజలు చేస్తారు. ఈ రోజు మీరు ఏమి చేయాలని నిర్ణయించుకున్నా, అది మీ తల్లిదండ్రులకు కోపం తెప్పించకూడదని గుర్తుంచుకోండి. పూర్వీకుల కోపం కారణంగా, మీరు వారి శాపంలో భాగం అవుతారు. ఫలితంగా, పనిలో వైఫల్యం, ఆస్తి నష్టం, ఆర్థిక సంక్షోభం, సంతానం సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.        


జీవుల‌ను హింసించవద్దు
ఈ అమావాస్య రోజున కుక్కలు, ఆవులు, కాకులు మొదలైన వాటికి హాని క‌లిగించ‌వద్దు. ముఖ్యంగా వాటికి ఆహారం ఇస్తున్నప్పుడు లేదా ఆహారం కోసం మీ ఇంటికి వచ్చినప్పుడు ఎలాంటి హాని త‌ల‌పెట్ట‌వద్దు. అమావాస్య రోజున కుక్క, ఆవు లేదా కాకికి ఆహారం తినిపిస్తే పూర్వీకులు ప్రసన్నమ‌వుతార‌ని నమ్మకం. మీరు ఈ జంతువులను, పక్షులను చంపినా లేదా హాని చేసినా మీ పూర్వీకుల ఆగ్ర‌హానికి గురికావ‌చ్చు.        


యాచకులను అవమానించవద్దు
అమావాస్య రోజున భిక్షాటన కోసం మీ ఇంటికి వచ్చిన వారిని వట్టి చేతులతో పంపకండి. మీ సామర్థ్యానికి అనుగుణంగా వారికి ఆహారం, దుస్తులు లేదా ఏదైనా దానం చేయండి. మత విశ్వాసాల ప్రకారం, ఈ విరాళాన్ని పూర్వీకులే స్వీక‌రిస్తార‌ని భావిస్తారు.


Also Read : జూలై 16న పాతబస్తీ సింహవాహినికి బోనం - ఆషాడ అమావాస్యతో బోనాలు ముగింపు!


పెద్దలను అవమానించవద్దు   
అమావాస్య నాడు మీ కుటుంబ పెద్దలను అవమానించకండి లేదా వారికి అవ‌మానం క‌లిగేలా తప్పుడు పనులు చేయకండి. ఇది వారి ఆత్మలను క్షోభించేలా చేస్తుంది.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.