Dhanteras 2025: ఈ సంవత్సరం ధనత్రయోదశి పండుగ అక్టోబర్ 18శనివారం జరుపుకుంటారు. అయితే ఈ సమయంలో (అక్టోబర్ 17 ) గ్రహాల రాజు సూర్యుడు తులారాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుని సంచారంతో తులారాశిలో సూర్యుడు-కుజుడు కలయిక ఏర్పడుతుంది. సూర్యుడు-కుజుడు కలయిక వల్ల నాలుగు రాశులపై శుభ ప్రభావం ఉంటుంది. ఏ రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం.
వృషభ రాశి (Taurus Horoscope)
సూర్యుడు-కుజుడు కలయిక వృషభ రాశిపై శుభ ప్రభావాన్ని చూపుతుంది. ఈ రాశి వారికి ధన లాభం కలిగే అవకాశాలు ఉన్నాయి, అలాగే ఈ సమయంలో ఆస్తిలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది అనుకూల సమయం. కొత్త వాహనాలు, ఇల్లు లేదా బంగారం, వెండి కొనడం శుభప్రదంగా ఉంటుంది. ఓ వ్యక్తి చాలా కాలంగా ఏదైనా విషయం గురించి ఆందోళన చెందితే ఈ రోజు దాని పరిష్కారం లభిస్తుంది.
సింహ రాశి (Leo Horoscope)
అక్టోబర్ 17న ఏర్పడే సూర్యుడు-కుజుడు కలయిక వల్ల ధంతేరస్ రోజున సింహ రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది. ఈ సమయంలో లక్ష్మీదేవి, కుబేరుడి ప్రత్యేక అనుగ్రహం మీపై ఉంటుంది. వ్యాపారులు, ఉద్యోగస్తులకు ధన లాభం కలుగుతుంది. మీరు చేస్తున్న పనుల్లో ఎదురవుతున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
తులా రాశి (Libra Horoscope)
సూర్యుడు, కుజుడు కలయిక మీ రాశిలో శుభ ప్రభావాన్ని కలిగిస్తుంది. ఇంట్లో ఆనందం రావచ్చు .. శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ధనం పొందడానికి సమయం అనుకూలంగా ఉంటుంది, కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. పాత అప్పులు లేదా ఖర్చులకు సంబంధించిన సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పూర్వీకుల ఆస్తి లేదా గతంలో ఇచ్చిన ఏదైనా రుణాల నుంచి ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశం ఉంది.
కుంభ రాశి (Aquarius Horoscope)
సూర్యుడు-కుజుడు కలయిక శుభ యోగం వల్ల ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. కెరీర్‌లో పురోగతి ఉండవచ్చు. వ్యాపారులకు లాభం , ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల సహకారంతో ఏదైనా ముఖ్యమైన పనిలో ఉపయోగకరంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో వైద్యం లేదా అనారోగ్యంపై చేసే ఖర్చులు తగ్గుతాయి.. దీనివల్ల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి. మీ వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య శాస్త్రం పండితులను సంప్రదించండి....
నరక చతుర్దశి 2025 ఎప్పుడు! 19 లేదా 20 అక్టోబర్ 2025 ? పూర్తివవరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి