Death Rumour Viral:  ముంబై నుంచి వచ్చిన ఒక వార్త లక్షల మందిని దిగ్భ్రాంతికి గురి చేసింది. సోషల్ మీడియాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు మరణించాడనే వార్త ఒక్కసారిగా వైరల్ అయ్యింది. కొన్ని గంటల్లోనే ఈ పుకారు దావానలంలా వ్యాపించింది, సంతాపాలు వెల్లువెత్తాయ్.. ఆయన పుట్టుక నుంచి  ప్రతి సంఘటనా మీడియాలో, సోషల్ మీడియాలో మారుమోగిపోయింది... అయితే కుటుంబ సభ్యులు వెంటనే స్పందించారు...ఆ మరణ వార్త  అవాస్తవమని స్పష్టం చేశారు.

Continues below advertisement

కానీ, శాస్త్రాల ప్రకారం, బతికున్న వ్యక్తి మరణించినట్లు తప్పుడు వార్త ప్రచారం అయితే దాని అర్థం ఏంటి? 

ఇది కేవలం పుకారేనా లేదా ఇందులో ఏదైనా జ్యోతిష్య లేదా శకున శాస్త్రపరమైన సూచన దాగి ఉందా?

Continues below advertisement

ఈ పరిస్థితిపై శాస్త్రాలు ఏమని చెబుతున్నాయి?

ప్రాచీన గ్రంథాల్లో  ఓ శ్లోకం ఉంది 

'యత్ర మృత్యుభ్రమో జాతః తత్ర ఆయుః వర్ధతే.' 

అంటే... ఎక్కడ మరణ భ్రమ కలుగుతుందో అక్కడ వ్యక్తి యొక్క ఆయుష్షు పెరుగుతుంది లేదా అతని జీవితం ఏదైనా ప్రమాదం నుంచి బయటపడుతుంది.

మరొక శ్లోకంలో ఇలాగే వర్ణించారు

'మృత్యుసంకేత అపవాదే జీవనే బలేన సంయుజ్యతే.' 

అంటే మరణం గురించి తప్పుడు చర్చల వల్ల జీవిత శక్తి తిరిగి వస్తుంది. ఈ కోణంలో ఈ రకమైన తప్పుడు వార్త ఏదైనా ప్రతికూల శకునం కాదు, కానీ ప్రమాద విముక్తి .. నవజీవనానికి సంకేతంగా పరిగణించవచ్చు. 

శకున శాస్త్రం ప్రకారం, బతికున్న వ్యక్తి యొక్క తప్పుడు మరణ వార్త మూడు అవకాశాలను సూచిస్తుంది

ప్రమాదం తొలగిపోవడం వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతుంటే, మరణ భ్రమ వ్యాధి నుంచి ఉపశమనం పొందే సంకేతం.

ప్రజల్లో చర్చ పెరగడంవ్యక్తి పట్ల ప్రజల భావోద్వేగ అనుబంధం మళ్లీ మేల్కొంటుంది.

జీవితాన్ని పునరుద్ధరించడంవ్యక్తి తన ఆరోగ్యం , దినచర్యపై శ్రద్ధ వహించాలని ఇది ఒక హెచ్చరిక కూడా.

మరణానికి సంబంధించిన నకిలీ వార్తలు, కర్మ చక్రానికి సంకేతంగా చెప్పవచ్చు. మరణం గురించి పుకార్లు వచ్చినప్పుడు  వ్యక్తి జీవించి ఉన్నప్పుడు, అతని పునర్జన్మ జరిగిందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల ఇది నవజీవనం  స్పృహ తిరిగి రావడానికి చిహ్నం కూడా. శాస్త్రాలు కూడా చెబుతున్నాయి..

 'మృత్యుభ్రమః నాశయతి మృత్యుభయం.' 

అంటే మరణ భ్రమ, మరణ భయాన్ని నాశనం చేస్తుంది.

అందువల్ల, ఈ రకమైన పుకారును కొంతమంది అశుభంగా కాకుండా శుభ శకునంగా కూడా చూస్తారు, ఎందుకంటే ఇది వారి కష్టాలు తొలగిపోయాయని   జీవితం మళ్లీ ప్రకాశవంతంగా ఉంటుందని నమ్ముతారు గమనిక : ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించింది మాత్రమే. ఆధ్యాత్మికవేత్తలు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పిన సూచనల ఆధారంగా అందించాం. ABP దేశం ఏ రకమైన నమ్మకం, సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

ధర్మేంద్రను అంబులెన్స్‌లో ఇంటికి తీసుకెళ్లిన ఫ్యామిలీ... లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏమిటంటే?

వారణాసి నుంచి శివుడి ప్రపంచ సంచారం, SSMB29 లో మహేష్ క్యారెక్టర్ పై క్లారిటీ! 'సంచారి' పాటలో శివతత్వం!