Daily Horoscope for March 23rd 2024   


మేష రాశి


ఈ విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. వ్యాపారాభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మీరున్న రంగంలో ఆశించిన విజయాన్ని పొందుతారు కానీ పోటీ వాతావరణం ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబానికి సమయం కేటాయించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.


వృషభ రాశి


కొన్ని రోజులుగా వెంటాడుతున్న మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వ్యాపారం విస్తరిస్తారు. శత్రువులపై మీరు పైచేయి సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కోపం తగ్గించుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. 


Also Read: ఈ రాశివారికి ఏలినాటి శని ఉన్నా ఈ ఉగాది నుంచి తిరుగులేదంతే - శ్రీ క్రోధి నామ సంవత్సరం వార్షిక ఫలితాలు!


మిథున రాశి


ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. వ్యాపారంలో ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో మీ పనితీరుకి ప్రశంసలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. అనవసర చర్చలు పెట్టొద్దు. డ్రైవింగ్ లో జాగ్రత్తగా ఉండాలి. 


కర్కాటక రాశి


జరిగిన చాలా ప్రతికూల సంఘటనలు మర్చిపోయి కొత్త  జీవితం ప్రారంభించేందుకు మంచి రోజు ఇది. వృత్తి ఉద్యోగాల్లో ఉండేవారు ఈ రోజు గుడ్ న్యూస్ వింటారు. పని ఒత్తిడి కూడా పెరుగుతుంది. సహోద్యోగులతో అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండండి.  పిల్లల గురించి ఆందోళన చెందుతారు. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండడం మంచిది. 


సింహ రాశి


ఈ రాశి వ్యాపారులు లాభపడతారు. విద్యార్థులు పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు కార్యాలయ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. మీ భాగస్వామి అభిప్రాయాలను గౌరవించండి. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.


Also Read:  శ్రీ క్రోధి నామ సంవత్సరం ఈ రాశివారికి యోగకాలం - ఆ ఒక్క విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు తప్పవ్!


కన్యా రాశి


తండ్రి సహకారంతో పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి.  వ్యాపార సంబంధిత నిర్ణయాలను చాలా ఆలోచనాత్మకంగా తీసుకుంటారు. ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం ఉంది. కార్యాలయంలో అనవసర వివాదాలకు దూరంగా ఉంటూ మీ నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నించాలి. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. 


తులా రాశి


ఈ రాశివారికి కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను అధిగమిస్తారు. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఈ రోజు కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. 


వృశ్చిక రాశి


వృత్తి జీవితంలో కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. నూతన ఆదాయ మార్గాలు వెతుక్కుంటారు.  కార్యాలయంలో అనవసర వాదనలకు దూరంగా ఉండండి.  కొంతమందికి పదోన్నతి లేదా బదిలీకి సంబంధించిన సమచారం వింటారు. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.


Also Read: ఉగాది నుంచి ఈ రాశివారికి చుక్కలే - మనోధైర్యమే మిమ్మల్ని నడిపించాలి - శ్రీ క్రోధి నామ సంవత్సర వార్షిక ఫలితాలు!


ధనుస్సు రాశి


న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. వృత్తి జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి.  కార్యాలయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. మీ జీవితంలో వచ్చే కొత్త మార్పులను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండండి. సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించేందుకు శ్రమించాల్సి ఉంటుంది.


మకర రాశి


మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన పనిలో సానుకూల ఫలితాలు పొందుతారు.  ప్రణాళిక ప్రకారం అన్ని పనులు విజయవంతమవుతాయి. కార్యాలయంలో చిన్న సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది కానీ సహోద్యోగుల మద్దతుతో పనిలో అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబ జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.  


కుంభ రాశి


ఈరోజు కుంభరాశి వారికి ఆస్తి వివాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాన్ని  విస్తరిస్తారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూల సమయం.ఉద్యోగులకు గుడ్ టైమ్ ఈరోజు. ఎవరితోనైనా వివాదాలు, విభేదాలు ఉంటే సమసిపోతాయి. మీ లక్ష్యాలను సాధించడానికి మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకోవాలి. కోపం తగ్గించుకోవాలి.


Also Read: ధనవ్యయం, అపనిందలు, నమ్మకద్రోహం - ఈ రాశివారు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో చాలా అప్రమత్తంగా ఉండాలి!


మీన రాశి


పాత పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు.మీ జీవితంలో ముఖ్యమైన మార్పులు ఉంటాయి. ఆఫీసులో పని విషయంలో అజాగ్రత్తగా ఉండకండి.  సహోద్యోగుల సహకారంతో పని ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ సమస్యలను కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకోవాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.


మీ నక్షత్రం, రాశి ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...

Also Read:  Ugadi Panchangam in Telugu (2024-2025) : క్రోధినామ సంవత్సరంలో మీ రాశి ఆదాయ - వ్యయాలు , గౌరవ అవమానాలు!


Note: ఓ రాశిలో ఉన్న ఫలితాలు మొత్తం ఒక్కరికే చెందుతాయని భావించరాదు...మీ గ్రహస్థితి ఆధారంగా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.