Myths Related To Eclipse 2024:  భాద్రపద శుక్ల పూర్ణిమ రోజు చంద్రగ్రహణం ఏర్పడుతోంది. సెప్టెంబరు 18 బుధవారం (18-09-2024) రాహుగ్రస్త ఖంజగ్రాస చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఈ గ్రహణం టర్కీ, బల్దేరియా, అమెరికా, లండన్, గ్రీస్, ఈజిప్ట్, క్యూబా, ఇటలీ, బ్రెజిల్, రష్యా, జర్మనీ, మెక్సికో, అర్జెంటీనాలో కనిపిస్తుంది. మన దేశంలో ఎక్కడా కూడా చంద్రగ్రహణం కనిపించదు. 2024 సెప్టెంబరు 18 బుధవారం చంద్రగ్రహణం మాత్రమే కాదు.. పితృపక్షం ప్రారంభం. 


గ్రహణం మన దేశంలో కనిపించనప్పుడు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. సూతకాలం కూడా పట్టించుకోనవసరం లేదు. అయినప్పటికీ మీడియాలో చంద్రగ్రహణం గురించి జరుగుతున్న హడావుడి చూసి ప్రజలు గ్రహణ నియమాలు పాటించాలనే అపోహలో ఉన్నారు.  


Also Read: దసరా నవరాత్రుల్లో పూజించాల్సిన నవ దుర్గలు - దేవీ కవచంలో ఉన్న అలంకారాలివి!


భాద్రపదమాసం, ఫాల్గుణమాసంలో పూర్ణిమకు చంద్రగ్రహణం... అమావాస్యకు సూర్ గ్రహణం ఏర్పడుతోంది..అయితే మన దేశంలో కనిపించదు కాబట్టి నియమాలు అవసరం లేదు..కానీ ఈ గ్రహణాలు ఏ ఏ దేశాల్లో కనిపిస్తాయో..ఆ ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాలు, ఆ దేశానికి చెందిన పాలకులకు కొత్త కష్టాలు తప్పవు. ఆయా దేశాల్లో ఊహించని చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉంది. భూకంపం సంభవించే ప్రమాదం కూడా ఉంది. 


మతపరమైన దృక్కోణంలో చంద్ర గ్రహణాలు సాధారణంగా అశుభమైనవిగా పరిగణిస్తారు. అందుకే గ్రహణాలకు సంబంధించి కొన్ని అపోహలు ప్రచారంలో ఉన్నాయి..
 
సాధారణంగా గ్రహణ సమయంలో దురదృష్ట ఘటలు లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని చాలామంది  నమ్ముతారు. పురాతన నాగరికతలలో భూమి  నీడ చంద్రుడిని కప్పి ఉంచడాన్ని ఖగోళ హెచ్చరికగా పరిగణిస్తారు.


ఇప్పటికీ కొన్ని సంస్కృతులలో గ్రహణాలు దురదృష్టాన్ని కలిగిస్తాయని విశ్వసిస్తారు..అందుకే ఆ సమయంలో ప్రయాణాలు చేయరు,  కొత్తగా ఏ పనులు ప్రారంభించరు. శుభకార్యాలు అస్సలే నిర్వహించరు...
 
చంద్రగ్రహణ సమయంలో గర్భిణి స్త్రీలు పొట్టలో ఉండే శిశువుకి హాని కలుగుతుందని మరికొందరి విశ్వాసం. అందుకే ఆ సమయంలో ప్రతికూల ప్రభావాలను నివారించేందుకు గర్భిణిలు ఇంటినుంచి బయటకు అడుగు పెట్టరు..పూర్తిగా చీకటిలో ఉండిపోతారు. కొందరైతే కదలకుండా పడుకునే ఉంటారు...కదలరు రెప్పకూడా వేయరు.  ఈ సమయంలో  కదిలినా కూడా గ్రహణ ప్రభావం లోపలున్న బిడ్డపై పడుతుందని భయపడతారు..
 
గ్రహణం సమయంలో పదునైన వస్తువులను కట్ చేయడం , పదునైన వస్తువులతో పని చేయడం లాంటివి చేయరు. ఇలాంటి పనులు చేస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని విశ్వసిస్తారు. 


Also Read: శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి మొదలు.. దసరా ఏ రోజు వచ్చింది - ఇంద్రకీలాద్రిపై అమ్మవారి అలంకారాలివే!
 
గ్రహణ సమయంలో తినడం ఆరోగ్యానికి హానికరం అనే ప్రచారం మన దేశంలో ఉంది. అందుకే సూతకాల సమయంలో ఆహారం వండరు, ఆహారం తినరు. ఎందుకంటే గ్రహణ సమయంలో వచ్చే రేస్ ఆహారంపై పడి విషంగా మారుతుందని విశ్వసిస్తారు. దీనిని బలపర్చేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ ఈ నమ్మకం బలపడిపోయింది. అందుకే గ్రహణం ఆరంభం నుంచి ముగింపు వరకూ ఉపవాసం ఉంటారు.. నీళ్లు కూడా తీసుకోరు..


వాస్తవానికి గ్రహణం మనకు కనిపించినప్పుడే కొన్ని నియమాలు పాటించాలి..మన దేశంలో ఎక్కడా కనిపించదు కాబట్టి అసలు ఈ రోజు చంద్రగ్రహణం అని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు...


Also Read: అష్టాదశ శక్తిపీఠాలు ఎక్కడున్నాయి - అవి ఎలా ఏర్పడ్డాయి -ఎందుకంత పవర్ ఫుల్!