Jaya Ekadashi 2024 Budh Gochar:  ప్రతి నెలా శుక్ల పక్షం -  కృష్ణ పక్షంలో ఏకాదశి తిథి నాడు శ్రీమహావిష్ణువు ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. మాఘమాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి రోజున జయ ఏకాదశి జరుపుకుంటారు. ఈ ఏడాది జయ ఏకాదశి  ఫిబ్రవరి 20న వచ్చింది.  మత విశ్వాసాల ప్రకారం జయ ఏకాదశి రోజు ఉపవాసం పాటించడం, శ్రీమహావిష్ణువు ఆరాధన ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. ఈ ఏకాదశి సమయంలో గ్రహాల రాకుమారుడు బుధుడు రాశి పరివర్తనం చెందాడు. మకర రాశిలో సంచరించిన బుధుడు...ఫిబ్రవరి 18 నుంచి కుంభ రాశిలోకి ప్రవేశించాడు. ఈ ప్రభావంతో కొన్ని రాశులవారికి  అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం...


మేష రాశి ( Aries)


ఈ రాశివారికి మానసిక ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమచారం వింటారు. పితృ ఆస్తుల ద్వారా ధనలాభం ఉంటుంది. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది.  ఆరోగ్యం మెరుగుపడుతుంది.ప్రేమ సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది.


Also Read: జయ ఏకాదశి - ఈ రోజు ఇలాచేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి!



వృషభ రాశి  (Taurus)


కుంభ రాశిలో బుధుడి సంచారం వల్ల జయ ఏకాదశి నుంచి వృషభ రాశివారికి అన్నింటా శుభఫలితాలే కనిపిస్తున్నాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ధన ప్రవాహానికి మార్గాలు సుగమం అవుతాయి. వస్తుసౌఖ్యాలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి బలపడుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా మదింపు అవకాశాలు పెరుగుతాయి. అనేక ఆదాయ మార్గాల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి.



సింహ రాశి (Leo)


బుధుడి సంచారం సింహ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయాన్ని అందిస్తాయి. స్నేహితుల నుంచి సహకారం ఉంటుంది. వ్యాపారంలో పురోభివృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో సీనియర్ అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. నూతన ఉద్యోగం వెతుకుతున్నవారి ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. 


Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే


తులా రాశి  (Libra)


మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ధార్మిక ప్రదేశాన్ని సందర్శిస్తారు.ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏ పని ప్రారంభించినా జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. 


Also Read: ఈ రాశులవారు ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి 


ధనుస్సు రాశి (Sagittarius)


జయ ఏకాదశి నుంచి ఈ రాశివారికి మంచి రోజులు మొదలవుతున్నాయి. ఈ రాశి ఉద్యోగులకు అనుకూల సమయం ఇది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. ఆదాయం పెరిగే కొద్దీ కొత్త అవకాశాలు ఏర్పడతాయి. కార్యాలయంలో సీనియర్ అధికారుల నుంచి సహకారం ఉంటుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బావుంటుంది. 


గమనిక:  ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.