Bihar Election 2025: భారత్ ఎన్నికల సంఘం 2025 అక్టోబర్ 6 సోమవారం సాయంత్రం 4 గంటలకు బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటించారు. ఈ సమయం కేవలం పరిపాలనాపరంగానే కాకుండా జ్యోతిష్యపరంగా కూడా చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఈ సమయంలో, కమిషన్ ప్రజల ముందు తేదీలను ఉంచినప్పుడు..చతుర్థశి పూర్తై శరద్ పూర్ణిమ ప్రారంభమైంది. చంద్రుడు తన పూర్తి ప్రకాశంతో ఉన్నాడు..కానీ అదే సమయంలో భద్ర, వర్జ్య పంచక్ కూడా ప్రభావవంతంగా ఉంటాయి.
శరద్ పూర్ణిమ రోజున తేదీల ప్రకటన!
అక్టోబర్ 6, 2025న మధ్యాహ్నం 12:23 గంటలకు అశ్విన్ శుక్ల పూర్ణిమ తిథి ప్రారంభమవుతుంది..అక్టోబర్ 7 ఉదయం వరకూ పౌర్ణమి తిథి ఉంది. శరద్ పూర్ణిమ రోజు చంద్రుడు పదహారు కళలతో నిండిన ప్రకాశంతో ఉంటాడు. శాస్త్రాలలో దీనిని పూర్తి సిద్ధి కాలం అని పిలుస్తారు. బ్రహ్మ వైవర్త పురాణం, గరుడ పురాణం ప్రకారం.. ఈ తేదీన ప్రారంభమయ్యే పనులు ప్రజలపై లోతైన ప్రభావాన్ని చూపుతాయి. భద్ర ప్రభావం
ముహూర్త చింతామణి , కాలామృత ముహూర్త సారం ప్రకారం 'విష్టి కరణే ప్రారంభం కర్మం వివాదం జనయేత్' అంటే భద్రలో ప్రారంభించిన పని వివాదం లేదా వ్యతిరేకతకు కారణమవుతుంది.
అక్టోబర్ 6 భద్ర మధ్యాహ్నం 12:25 గంటల నుంచి రాత్రి 10:55 గంటల వరకు ప్రభావవంతంగా ఉంది. ఈ కరణం కఠినమైనదిగా పరిగణిస్తారు. ఈ సమయంలో ముహూర్త ప్రకటన కఠినమైన నిర్ణయాలు, వివాదాలు లేదా బహిరంగ చర్చలకు దారి తీస్తుంది. దీని అర్థం పని విఫలమవుతుందని కాదు, కానీ ప్రారంభంలో వ్యతిరేకత ఉండవచ్చు, కానీ చివరికి స్థిరత్వం కనిపించవచ్చు.
రాజకీయ కోణం నుంచి ఈ ముహూర్తం ప్రకటన ప్రారంభ దశలో ప్రతిస్పందనలు తీవ్రంగా ఉంటాయని సూచిస్తుంది, కానీ కాలక్రమేణా నిర్ణయం స్థిరంగా ఉంటుంది.
పంచక్ ప్రభావం
మంద-సిద్ధాంత పంచాంగం .. మైదీని జ్యోతిష్యంలో పంచక్ ప్రజల జీవితానికి సంబంధించిన అస్థిరత కాలంగా చెబుతారు. పంచక్ అనేది చంద్రుడు కుంభం , మీన రాశులలో ఉన్న కాలం.. అంటే ధనిష్ట ఉత్తర పాదం నుంచి రేవతి వరకు ఐదు నక్షత్రాల సమూహం.
అక్టోబర్ 6 సాయంత్రం చంద్రుడు మీన రాశిలోని ఉత్తరాభాద్రపద నక్షత్రంలో ఉన్నాడు, దీని కారణంగా పంచక్ నడుస్తోంది. మైదీని గ్రంథాల ప్రకారం పంచకే జనచేతన చంచల భవతి. అంటే పంచక్ లో ప్రజల మనస్సు అస్థిరంగా ఉంటుంది.
రాజకీయ కోణం నుంచి..దీని అర్థం ప్రజల ప్రతిస్పందన ఈ రోజున భావోద్వేగంగా, అనిశ్చితంగా ఉండవచ్చు. ప్రకటనపై మద్దతు వ్యతిరేకత రెండూ వేగంగా పెరగవచ్చు.
వర్జ్య కాలం అంటే సంభాషణ పరీక్ష
కమిషన్ ప్రకటన సమయంలో వర్జ్యం ఉంది. ముహూర్త చింతామణి , నిర్ణయామృతంలో స్పష్టంగా ఏం రాశారంటే 'వర్జ్యే కర్మ న కర్తవ్యం, ప్రాయశ్చిత్తం తతః పరం'అంటే వర్జ్య కాలంలో చేసిన పని తర్వాత పునరుద్ధరణ లేదా వివరణను కోరుతుంది...స్పష్టంగా చెప్పాలంటే ేఓట్ల లెక్కింపు తేదీ లేదా నోటిఫికేషన్ వివరణ వంటి కొన్ని అంశాలపై గందరగోళం లేదా పునఃవివరణ ఉండవచ్చు.
ధ్రువ యోగం - పూర్ణిమ సానుకూల అంశం
మధ్యాహ్నం 1:13 గంటల తర్వాత ధ్రువ యోగం ప్రారంభమవుతుంది. ముహూర్త చింతామణి ప్రకారం' ధ్రువః స్థిరకరణః సర్వకార్యేషు శుభః'అంటే ఈ యోగం అన్ని రకాల స్థిరమైన దీర్ఘకాలిక పనులకు శుభప్రదం అని చెబుతారు
పూర్ణిమ , ధ్రువ యోగం కలయిక ప్రారంభంలో విభేదాలు లేదా వివాదాలు ఉన్నప్పటికీ, ఈ నిర్ణయం దీర్ఘకాలం పాటు స్థిరంగా ప్రభావవంతంగా ఉంటుందని సూచిస్తుంది. రాజకీయ కోణం నుంచి ఈ సమయం ప్రకటన యొక్క శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది, అంటే ఈ ప్రకటన రాబోయే నెలల్లో రాజకీయ దిశను నిర్ణయిస్తుంది.
సూర్యుడు - చంద్రుని కలయిక ఈ సమయంలో సూర్యుడు కన్యారాశిలో ఉన్నాడు.. ఇది వివేకం, సంస్థ పరిపాలనకు చిహ్నం. అదే సమయంలో చంద్రుడు మీన రాశిలో ఉన్నాడు, ఇది భావోద్వేగం, సున్నితత్వం , ప్రజలకు ప్రతినిధి. రెండు రాశులు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి, కాబట్టి ఈ కలయిక ప్రభుత్వం - ప్రజల మధ్య సమతుల్యతను సూచిస్తుంది. ఈ పరిస్థితిలో తీసుకున్న నిర్ణయాల్లో పరిపాలనా స్థిరత్వం ఉంటుంది, కానీ భావోద్వేగ ప్రతిస్పందన కూడా తీవ్రంగా ఉంటుంది. అంటే, ఈ ప్రకటన ఒక వైపు సంస్థాగత దృఢత్వాన్ని సూచిస్తుంది, మరోవైపు ప్రజలలో అలజడిని కూడా కలిగిస్తుంది.
మైదీని జ్యోతిష్యం నుంచి ఆశ్చర్యకరమైన సంకేతాలు!
మైదీని లేదా మండేన్ జ్యోతిష్యం ప్రకారం, ఒక రాష్ట్రం లేదా దేశం నిర్ణయాలు మీనంలో చంద్రుడు ఉన్నప్పుడు, ప్రజల అభిప్రాయంలో ప్రారంభ అసమతుల్యత కనిపిస్తుంది, కానీ కాలక్రమేణా అది స్థిరత్వాన్ని పొందుతుంది. ధ్రువ యోగం, పూర్ణిమ , శని-కుంభం పరిస్థితి ఈ నిర్ణయం ప్రభావం రాజకీయ సమతుల్యతను దీర్ఘకాలం పాటు కొనసాగిస్తుందని సూచిస్తుంది.
మీన రాశిలో చంద్రుడు ఉండటం వల్ల ప్రజల సానుభూతి పెరుగుతుంది, కాబట్టి ఎన్నికల ప్రకటన తర్వాత ప్రజల దృష్టి పూర్తిగా బీహార్ రాజకీయాలపై కేంద్రీకృతమవుతుంది.
అక్టోబర్ 6, 2025 సాయంత్రం 4 గంటలకు శరద్ పూర్ణిమ, భద్ర, పంచక్ వర్జ్య కాలం సంగమం. ముహూర్త చింతామణి , మైదీని సిద్ధాంతాల ప్రకారం, ఈ కలయిక సున్నితమైనది కానీ శాశ్వతమైన నిర్ణయ సమయాన్ని చేస్తుంది. ఈ సమయంలో తీసుకున్న నిర్ణయం ప్రారంభంలో వివాదాస్పదంగా ఉండవచ్చు, కానీ దాని ప్రభావం లోతైనది మరియు మన్నికైనదిగా ఉంటుంది.
ఈ ముహూర్తం ప్రజలను కదిలించేదిగా పరిగణిస్తోంది జ్యోతిష్య శాస్త్రం...కానీ సంస్థాగతంగా బలంగా ఉంటుంది. శరద్ పూర్ణిమ చంద్రుడు, ధ్రువ యోగం స్థిరత్వం, భద్ర కాఠిన్యం ఈ ఎన్నికల ప్రక్రియను కష్టతరమైన ప్రారంభానికి, నిర్ణయాత్మక ఫలితానికి దారి తీస్తుంది. ఈ క్షణం బీహార్ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించవచ్చు.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.