కొత్త సంవత్సరం వస్తుందంటే.. ఎన్నో ఆశలతో ఉంటారు. అంతా మంచి జరగాలని కోరుకుంటారు. భవిష్యత్తు కోసం కలలుగంటారు. వచ్చే ఏడాది ఎలా ఉంటుందో తెలుసుకోడానికి ఆసక్తి చూపిస్తారు. కొన్ని ప్రిడక్షన్లు భవిష్యత్తును ముందుగానే తెలియజేస్తుంటాయి. వాటిలో కొన్ని జరుగుతుంటాయి కూడా. ముఖ్యంగా శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి నుంచి ప్రాశ్చాత్య నోస్ట్రడామస్ వరకు చాలా మంది భవిష్యత్తును ముందుగానే చెప్పారు. వాటిలో కొన్ని జరిగాయి కూడా. నోస్ట్రడామస్ ఉమెన్‌గా పేరొందిన బల్గేరియన్ బాబా వంగా భవిష్యత్తులో ఏం జరగబోతోందో చెబుతున్నారు. 2023లో ప్రపంచం ఎలా ఉంటుందనే విషయాలను కూడా ఆమె అంచనా వేసి చెప్పారు.
భూమి మీద జరిగే ఒక అణు విస్ఫోటనం వల్ల భూమి తన కక్ష్యను మార్చుకోవచ్చట. రేడియేషన్ విపరీతంగా పెరిగిపోయే విధంగా సౌర తుఫాను కూడా రావచ్చు అని పేర్కొన్నారు. సైంటిఫిక్ ఆవిష్కరణలలో లాబ్‌ల నుంచి జన్మించే పిల్లలు అనేది ఒక చిన్న ఆవిష్కారం మాత్రమే అని ఆమె అభిప్రాయపడుతున్నారు. 2023లో శత్రు గ్రహాంతర వాసులు కనిపిస్తారు. ఫలితంగా భూమి మీద మిలియన్ల మరణాలు సంభవిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఆమె చెప్పేవి తలచుకుంటేనే వెన్నులో భయం కలుగుతోంది. ఇంకా ఆమె ఏమేమి చెప్పారో చూడండి.
- సూపర్ బయో వెపన్స్ గురించి కూడా ఆమె చెప్పారు. అయితే, ఉక్రెయిన్, రష్యా మధ్య సంక్షోభం వల్ల ఈ విషయం మరుగున పడిపోతుందట.
- భూమి చుట్టూ ఆవరించి ఉన్న అయాస్కాంత వలయం సునామీ, సౌరతుఫాను కారణంగా 2023లో చాలా దెబ్బతింటుంది.
- గ్రహాంతర వాసుల దాడిలో భూమి మీద మిలియన్ల జనాభా చనిపోతారు.
- బాబా వంగా చెబుతున్న దాని ప్రకారం 2023లో భూకక్ష్యలో మార్పు జరుగుతుంది.
- భూమి, దాని కాస్మిక్ ఎనర్జీ మధ్య అతి సున్నితమైన సమతుల్యత ఉంటుంది. చిన్న మార్పు కూడా పెద్ద ఫలితాలను కనబరుస్తుంది. కనుక భూవాతావరణంలో వేడి చాలా పెరిగిపోవచ్చు. పరిస్థితి ఆందోళనకరంగా కూడా మారొచ్చు.
- ల్యాబ్ లలో మనుషులు తయారవుతారట. 2023 నాటికి తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలాంటి రూపురేఖలు, తెలివి తేటలతో ఉండాలో ముందే నిర్ణయించుకుని ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఆవిష్కారం తర్వాత సరోగసి సమస్య పరిష్కారం అవుతుంది.
- పిల్లలను కనడం అనేది పూర్తిగా మనుషుల ఆధీనంలోకి వస్తుంది. వంగా చెప్పిన దాని ప్రకారం భవిష్యత్తులో పిల్లలు ల్యాబ్ లలో మాత్రమే పుడతారట.
- ఒక పవర్ ప్లాంట్ పేలి పోవడం వల్ల విషపూరిత మేఘాలు ఆసియా ఖండం మొత్తాన్ని దట్టమైన పొగమంచుతో కప్పేస్తాయి. ఫలితంగా తీవ్రమైన అంటువ్యాధులు ప్రపంచమంతా వ్యాపిస్తాయి.
Also Read: ఈ రోజు గీతా జయంతి - భగవద్గీత మత గ్రంధం కాదు మనిషిగా ఎలా బతకాలో చెప్పే మార్గదర్శి