Venus Transit Scorpio 2024: వృశ్చికంలోకి శుక్రుడు.. నవంబరు 07 వరకూ ఈ 6 రాశులవారిక కుబేరయోగం!

Shukra Gochar Vrishchik 2024: నెలరోజులకు ఓ రాశిలో సంచరించే శుక్రుడు అక్టోబరు 13న వృశ్చికరాశిలో ప్రవేశించాడు. ఈ సంచారం కొన్ని రాశులవారికి అత్యంత ఫలవంతంగా ఉండబోతోంది..

Continues below advertisement

Shukra Gochar October 2024: సెప్టెంబరు 18 నుంచి తులా రాశిలో సంచరించిన శుక్రుడు అక్టోబరు 13న తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడు విలాసాలకు అధిపతి. జాతకంలో శుక్రుడి సంచారం బావుంటే ఆర్థికంగా నిలదొక్కుకుంటారు, ఆనందంగా ఉంటారు, భోగాలు అనుభవిస్తారు, వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. పైగా..శని సంచారం బాగాలేనివారికి శుక్రుడు శుభ స్థానంలో ఉంటే ఆ ప్రభావం కూడా తగ్గుతుంది. అందుకే శుక్ర సంచారం బావుంటే చాలు జాతకంలో ఎలాంటి దోషాలున్నా వాటి ప్రభావం అంతగా ఉండదని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ప్రస్తుతం వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు. నవంబరు 07 వరకూ ఇదే రాశిలో ఉండి..  ఆ తర్వాత ధనస్సు రాశిలోకి పరివర్తనం చెందుతాడు.  శుక్రుడు రాశిమార్పు కొన్ని రాశులవారికి విశేష ప్రయోజనాలను అందిస్తోంది.   ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Continues below advertisement

వృషభ రాశి

వృశ్చిక రాశిలో శుక్రుడి సంచారం ఈ రాశివారికి ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు, ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు..ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులుపెట్టేవారు మంచి లాభాలు అందుకుంటారు. శుక్రుడి సంచారంలో వైవాహిక జీవితంలో ఉండే కలతలు తొలగిపోతాయి. ప్రేమికులు పెళ్లి దిశగా అడుగేసేందుకు మంచిసమయం.

Also Read: రాశులవారికి ఈ వారం (అక్టోబరు 14 to 20 ) 'గురిపెట్టినా ఎర పడదు' - శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ!

కర్కాటక రాశి

ఈ రాశివారికి అష్టమ శని ఉన్నప్పటికీ శుక్రుడి సంచారంతో అంతా మంచే జరుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది. అనవసర చర్చలకు దూరంగా అవసరమైన పనులు చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబానికి సమయం కేటాయించలేనంత బిజీగా ఉన్నప్పటికీ వివాదాలుకు అవకాశం ఇవ్వరు. అవివాహితులకు వివాహం జరుగుతుంది..సంతానం కోసం ఎదురుచూసే జంటలకు సంతానయోగం ఉంటుంది.  

సింహరాశి

సింహ రాశివారికి వృశ్చికరాశిలో శుక్రుడి సంచారం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఇది శుభసమయం. నూతన వ్యాపారం ప్రారంభఇించాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి..నూతన ఆదాయవనరులు ఏర్పడతాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. 

Also Read: అక్టోబరు 14 to 20 .. ఈ వారం ఈ 4 రాశులవారికి పట్టిందల్లా బంగారమే - అన్నీ అనుకూల ఫలితాలే!

తులారాశి

వృశ్చిక రాశిలో శుక్రుడి సంచారం తులా రాశివారికి ఆదాయాన్నిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేస్తుంది. ఈ నెల రోజుల పాటూ సంతోషం మీ సొంతం అన్నట్టుంటుంది. కుటుంబంలో,కార్యాలయంలో, వ్యాపారంలో ప్రతి చోటా విజయం తథ్యం.

వృశ్చిక రాశి

శుక్రుడు సంచారం మీ రాశిలోనే ఉంటోంది..ఈ సమయంలో అనుకున్న పనులన్నీ అనుకున్నట్టే నెరవేరుతాయి. ప్రణాళిక ప్రకారం అన్నీ పూర్తిచేస్తారు. జీవిత భాగస్వామితో మంచి బంధం ఏర్పడుతుంది. నూతన పెట్టుబడులు కలిసొస్తాయి. ఆర్థికపరంగా అడుగు ముందుకుపడుతుంది.

lso Read: అక్టోబరు 14 to 20.. ఈ రాశులవారికి శుభం-అశుభం మిశ్రమంగా ఉంటుంది - ఈ 3 రంగాలవారికి విశేష జయం!

మకర రాశి

వృశ్చిక రాశిలో శుక్రుడి సంచారం మకర రాశివారికి శుభపలితాలను ఇస్తోంది. గత కొన్నాళ్లుగా వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సంతోషంగా ఉంటారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఈ సమయంలో నూతన కార్యక్రమం ఏం ప్రారంభించినా సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. 

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

Continues below advertisement
Sponsored Links by Taboola