Astrology Tips:  భారతదేశంలో నెమలికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఆధ్యాత్మిక పరంగానూ మయూరానికి ప్రాముఖ్యత ఉంది..ఎందుకంటే నెమలి కార్తికేయుడి వాహనం. అయితే నెమలి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. అవి అకస్మాత్తుగా కనిపిస్తే శుభప్రదంగా భావిస్తారు. 

తెల్లవారుజామున అకస్మాత్తుగా కనిపిస్తేతెల్లవారుజామున అకస్మాత్తుగా నెమలి మీ ఇంటికి వస్తే అదృష్టం మీ వెంటే ఉన్నట్టు. దీనితో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. అదృష్టం పెరుగుతుంది. ఇంట్లో కొన్ని శుభ కార్యాలు జరుగుతున్నాయనేందుకు ఇది సూచనగా చెబుతారు

బయటకు వెళ్లేటప్పుడు నెమలి కనిపిస్తేఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో అకస్మాత్తుగా నెమలి కనిపించిందంటే.. మీకు రోజు ఆరంభం అదిరిందని అర్థం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఉదయాన్నే నెమలి గొంతు వినడం లేదా నెమలి ఈకలను చూడటం కూడా శుభప్రదమే.

ఎగిరే నెమలి కనిపిస్తేఎగిరే నెమలిని చూడటం అరుదు. అలాంటి దృశ్యం చూసిన వారి సంఖ్య చాలా తక్కువ. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలాంటి దృశ్యాలను చూసినవారికి మంచి ఫలితాలు వస్తాయి. అన్నింటా విజయం మీదే..

Also Read: ధంతేరాస్ రోజు బంగారం, వెండి మాత్రమే కాదు ఈ వస్తువులు కొన్నా మంచిదే!

వాస్తు ప్రకారం నెమలి

  • బెడ్‌రూమ్‌లో నెమలి పింఛాన్ని కంటికి కనిపించేటట్టుగా పెట్టి తెల్లవారు జామున లేవగానే దానిని చూడటం వల్ల రాహుగ్రహ దోషాల నుంచి నివారణ కలుగుతుంది
  • నెమలి  పించంతో తయారైన చిత్ర పటాలను పడకగదిలో ఉంచడం ద్వారా శుభఫలితాలుంటాయి
  • నెమలి శరీరం నుంచి నేలరాలే నెమలి  పించాలను తీసుకొచ్చి ఇంట్లోని పూజగదిలో ఉంచితే వాస్తుదోషాలు తొలగిపోతాయి
  • ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెమలి పించం పెడితే ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గిపోతుంది
  • నెమలి పించంతో పాటూ పూజగదిలో వినాయకుడికి ప్రీతికరమైన గరిక, విష్ణుమూర్తికి ఇష్టమైన తులసీ దళాలను వుంచడం ద్వారా వాస్తు దోషాలను తొలగించుకోవచ్చునని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

Also Read: రాశిమారుతున్న కుజుడు ఈ ఆరు రాశులవారికి అన్నీ శుభఫలితాలే!

కలలో నెమలి కనిపిస్తే

  • మీ కలలో నెమలి కనిపిస్తే, అది ఖచ్చితంగా శుభసూచకమే. శాస్త్రాల ప్రకారం కలలో నెమలిని చూడటం శుభప్రదంగా భావిస్తారు.
  • కలలో పాము -నెమలి పోట్లాటను చూస్తున్నట్లయితే అలాంటి కలలు మీకు మంచి సంకేతం. అంటే ఇకపై మీకు శత్రువులు తగ్గుతారు, వారు మీపై పన్నిన కుట్ర విఫలమవుతుంది.
  • కలలో శనిదేవుడు నెమలితో కనిపిస్తే అలాంటి కల రావడం అరుదే కానీ వస్తేమాత్రం అధ్భుతమే అంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. శని చాలీసా ప్రకారం అలాంటి కలలు వస్తే మీరు డబ్బు పొందుతారు. ఆర్థిక పురోగతికి కూడా అనేక అవకాశాలు ఉంటాయి.
  • తెల్లని నెమలి కలలో కనిపిస్తే ధనవంతులవుతారట. త్వరలోనే డబ్బు బాగా సంపాదించే అవకాశాలున్నాయని అర్థం
  • కలలో నెమలి పించం కలిసి కనిపిస్తే అది ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలను సక్సెస్ చేస్తుంది. వివాహితులకు కనిపిస్తే మీ జీవిత భాగస్వామితో మంచి అనుబంధం ఉందని, ప్రేమ ఇంకా పెరుగుతుందని అర్థం