Mars Transit in Leo 7 June 2025 to July 27th: స్థిరాస్తులు, భూములకు సంబంధించిన వ్యాపారాలు, ఆకస్మిక ధనలాభానికి, పట్టుదలకు కారకుడు కుజుడు. ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్న కుజుడు జూన్ 5 న సింహంలో ప్రవేశించి జూలై 27 వరకూ ఇదే రాశిలో ఉంటాడు. కుజుడు అనుకూల సంచారం ఉంటే ఇప్పటివరకూ మీరు ఎదుర్కొనే భూ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లోనూ పురోగతి ఉంటుంది. రాజకీయాల్లో ఉండేవారు శుభ ఫలితాలు పొందుతారు. సింహ రాశిలో కుజుడి సంచారం ఏ రాశులవారికి శుభ ఫలితాలు ఇస్తుందో చూద్దాం.. మేష రాశి
ఈ రాశి నుంచి కుజుడు ఐదో స్థానంలో సంచరిస్తాడు. ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. నైపుణ్యం మెరుగుపర్చుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు లాభాలనిస్తాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం లభిస్తుంది. జీవితంలో స్థిరపడతారు.
మిథున రాశి
మీ రాశి నుంచి మూడో స్థానంలో కుజుడి సంచారం ఉద్యోగంలో పురోగతిని సూచిస్తోంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లఫిస్తుంది. ఆస్తివివాదాలు పరిష్కారం అవుతాయి. సోదరుల కారణంగా ఆస్తి సమస్యలు తీరిపోతాయి. ఆరోగ్యం బావుంటుంది. ప్రయామంలో లాభపడతారు. ఏ ప్రయత్నం చేసినా సఫలం అవుతుంది.
కర్కాటక రాశి
మీ రాశి నుంచి రెండో స్థానంలో కుజుడి సంచారం మీకు అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది. ఆదాయం పెరుగుదల మొదలవుతుంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో మీరు ఊహించనంత వృద్ది ఉంటుంది. సొంత ఇంటిని సమకూర్చుకుంటారు. వ్యాపార ఒప్పందాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం బావుంటుంది.
సింహ రాశి
మీ రాశిలోనే కుజుడి సంచారం మీకు అద్భుత ఫలితాలను అందిస్తుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారంలో లాభాలంటాయి. విదేశాలకు వెళ్లాలి అనుకునే విద్యార్థుల కల ఫలిస్తుంది. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది.
కన్యా రాశి సింహంలో కుజుడి సంచారం మిమ్మల్ని లక్ష్యం దిశగా నడిపిస్తుంది. వ్యాపారంలో నష్టాల నుంచి బయటపడతారు. ఉద్యోగులు తమ లక్ష్యాలను చేరుకుంటారు. బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది.
తులా రాశి
జూన్ 5 నుంచి జూలై 27 వరకూ ఈ రాశివారికి కుజుడి సంచారం సత్ఫలితాలు ఇస్తుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మీపై మీకు విశ్వాసం పెరుదుతుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు శుభప్రదంగా ఉంటాయి. ఆరోగ్యం బావుంటుంది, ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులు నూతన ఉద్యోగం సాధిస్తారు.
వృశ్చిక రాశి
మీ రాశి నుంచి దశమ స్థానంలో కుజుడి సంచారం మీకు రాయయోగం ఉంటుంది. ఉద్యోగ జీవితంలో ఊహించని పురోగతి ఉంటుంది. జీతం పెరుగుతుంది. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే శుభసమయం. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు. అవివాహితులకు వివాహం నిశ్చయం అయ్యే సూచన ఉంది.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.
పాకిస్థాన్ ఆలయంలో మన ఘంటసాల పాట.. ఓ వ్యక్తి భక్తితో ఆలపిస్తున్న అద్భుత దృశ్యం... వీడియో చూసేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి!
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి