మీ నక్షత్రం ఏంటో మీకు తెలుసా?
నక్షత్రం తెలిసినా ఏ రాశిలో ఫలితం చూసుకోవాలో క్లారిటీ ఉందా?
ఎందుకంటే కొన్ని నక్షత్రాలు ఓ రాశిలో రెండు, మూడు పాదాలు..మరో రాశిలో ఒకపాదం ఉంటాయి ( ఒక నక్షత్రానికి నాలుగు పాదాలుంటాయి) . అయితే నక్షత్రం, రాశి తెలియదు అనుకున్న వారు..వారి పేరులో మొదటి అక్షరం ఆధారంగా ఈ వివరాలు తెలుసుకోవచ్చు.
జాతక ఫలితాల కోసం సాధారణంగా నక్షత్రాలను పరిశీలుస్తుంటారు. మంచి చెడులు చూడాలన్నా, ముహూర్తం నిర్ణయించాలన్నా మీ నక్షత్రం ఏంటి, రాశి ఏంటని అడుగుతుంటారు. ఇక్కడే కొంతమంది గందరగోళానికి గురవుతుంటారు. ఎందుకంటే పిల్లలు పుట్టిన సమయంలో ఉండే నక్షత్రానికి సంబంధించిన అక్షరంతో పేరు నిర్ణయిస్తారు. మరికొందరు నక్షత్రం గుర్తుంటుందనే ఉద్దేశంతో పిల్లలకు నచ్చిన పేర్లు పెట్టుకుంటారు. అందుకే నామ నక్షత్రం, జన్మ నక్షత్రం అంటాం.
నక్షత్రం ఏంటో తెలిసిన వారికి మీ నక్షత్రాన్ని బట్టి రాశి ఏంటో తెలుసుకోవచ్చు
అసలు ఏ నక్షత్రంలో పుట్టారో తెలియని వారు పేరులో మొదటి అక్షరం ఆధారంగా ఎలా తెలుసుకోవాలో ఇక్కడ వివరంగా అందిస్తున్నాం
Also Read: శోభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలవారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే శూన్య ఫలితం
మొత్తం 27 నక్షత్రాలు..12 రాశులు...ఒక్కో నక్షత్రంలో నాలుగు పాదాలు..ఒక్కో రాశిలో 9 పాదాలు...
నక్షత్రం తెలిసిన వారు మీ రాశి ఏంటో ఇక్కడ చూసుకోవచ్చు...
రాశి నక్షత్రం
మేష రాశి - అశ్విని, భరణి, కృత్తిక మొదటి పాదం
వృషభ రాశి - కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు
మిధున రాశి - మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
కర్కాటక రాశి - పునర్వసు నాలుగో పాదం, పుష్యమి, ఆశ్లేష
సింహ రాశి - మఘ, పుబ్బ(పూర్వ ఫల్గుణి), ఉత్తర(ఉత్తర ఫల్గుణి)1వ పాదం
కన్యా రాశి - ఉత్తర(ఉత్తర ఫల్గుణి) 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
తులా రాశి - చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
వృశ్చిక రాశి - విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ
ధనస్సు రాశి - మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
మకర రాశి - ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు
కుంభ రాశి- ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
మీన రాశి- పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలుంటాయని చెప్పుకున్నాం కదా. ఓ నక్షత్రం కాస్త అటు ఇటుగా 24 గంటలు ఉంటుంది. 24 ని నాలుగు భాగాలు చేస్తే 6 గంటలు. అంటే నక్షత్రంలో మొదటి 6 గంటలు మొదటి పాదం, తర్వాతి 6 గంటలు రెండో పాదం, మూడో ఆరోగంటలు మూడోపాదం..ఆఖరి 6 గంటలు నాలుగోపాదం. కొన్ని నక్షత్రాలకు సంబంధించి పాదాన్ని బట్టి మీ రాశి మారుతుందని గమనించగలరు.
Also Read: శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మేష రాశి నుంచి మీన రాశి వరకూ వార్షిక ఫలితాలు
నక్షత్రం తెలియని వారు మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా తెలుసుకోవచ్చు....
అశ్వని: చూ/చే/చో/ లా
భరణి: లీ/లూ/లే/లో
కృత్తిక: ఆ/ఈ/ఊ/ ఏ
రోహిణి: ఈ/వా/వీ/వూ
మృగశిర: వే/వో/కా/కీ,
ఆరుద్ర:కూ/ ఖం/ జ/ ఛా
పునర్వసు: కే/కో/ హ/ హీ/
పుష్యమి: హు/హే/హో/డా
ఆశ్లేష: డీ/డూ/డే/డో
మఖ: మా/ మి/ మూ/మే
పూర్వ ఫల్గుణి: మో /టా/ టీ/ టూ
ఉత్తర ఫల్గుణి: / టే/టో/ పా /పీ
హస్త: వూ/షం /ణా/ ఢా
చిత్త: పే/పో/రా/రి
స్వాతి: రూ/ రే/ రో /లా
విశాఖ: తీ/తూ/తే /తో
అనూరాధ: /నా /నీ /నూ /నే
జ్యేష్ట:నో /యా /యీ/యూ
మూల: యే /యో /బా/ బీ
పూర్వాషాడ: బూ/ ధా /భా /ఢా
ఉత్తరాషాడ: బే/బో / జా / జీ
శ్రవణం: జూ/జే /జో/ ఖా
ధనిష్ట: గా/ గీ/ గూ/గే
శతభిషం: గో /సా/ సీ /సూ
పూర్వాభాద్ర: సే /సో/ దా/దీ
ఉత్తరా బాధ్ర: ధు/శ్చం/చా/ధా
రేవతి: దే/దో/చా/చీ