2025 అక్టోబర్ 17 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu 17 October 2025
మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు చాలా సరదాగా, ఆటపాటలతో గడుస్తుంది. మిత్రులు, సన్నిహితులు సహకారంతో ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. ఈ రాశివారు పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందవచ్చు, నిర్లక్ష్యం వద్దు. ఈ రోజు మీరు కుటుంభంతో ఆనందంగా గడుపుతారు. ఆర్ట్ & కళా రంగంలో ఉన్నవారు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. భార్య భర్తల మధ్య అన్యోనత పెరుగుతుంది. మీ అదృష్ట సంఖ్య : 9 , కలిసొచ్చే రంగు : గులాబీ. హనుమంతునికి ఎర్రటి పువ్వులు,బెల్లం సమర్పిస్తే మరింత అనుకూలంగా ఉంటుంది.
వృషభ రాశి (Taurus Horoscope)
ఈ రాశి వారికి ఈరోజు శుభ ప్రదం. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుంచి బయట పడతారు. ఈ రోజు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. రోజంతా ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది, ఫ్యామిలీతో కలిసి ఆనందంగా గడుపుతారు. అనవసరమైన విషయాలలో తల దూర్చకండి. జీవిత భాగస్వామి మద్దతుతో సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీ అదృష్ట సంఖ్య 6 . కలిసొచ్చే రంగు : తెలుపు. లక్ష్మీదేవి ఆరాధన మంచిది.
మిథున రాశి (Gemini Horoscope)
ఈ రోజు మీరు సంతోషంగా గడుపుడుతారు. అంతే కాదు కష్ట సమయాల్లో మీకు సహాయం చేసిన వారిని కలిసి కృతజ్ఞతలు తెలుపుతారు. జీవిత భాగస్వామితో సమయం గడుపుతారు. ప్రయాణాలు చేయాల్సి వస్తే అప్రమత్తంగా ఉండండి. ప్రేమికులకి అనుకూల దినం. మీ అదృష్ట సంఖ్య : 5 , కలిసొచ్చే రంగు : ఆకుపచ్చ. గణేష్ ఆరాధన మంచిది. వినాయకుడికి దూర్వాలు, లడ్డూలను సమర్పించండి.
కర్కాటక రాశి (Cancer Horoscope)
ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి. పని ఒత్తిడి వలన కొంచెం ఆలసటగా ఫీల్ అవుతారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రేమికులకి కూడా కష్టమైన రోజు. ఈ రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. బాల్య జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటారు. భార్యా- భర్తల మధ్య పరస్పర అవగాహన అవసరం. మీ అదృష్ట సంఖ్య : 2 , కలిసొచ్చే రంగు : తెలుపు. చంద్రునికి పాలు చక్కెర నైవేద్యంగా సమర్పించండి.
సింహ రాశి (Leo Horoscope)
ఈ రాశి వారికి ఈ రోజు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. బీపీ, షుగర్ ఉన్నవాళ్లు ఈ రోజు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన ఆదాయ అవకాశాలు వస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. కెరీర్‌లో పురోగతికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి మీ పై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. భార్యా భర్తల మధ్య పరస్పర నమ్మకం పెరుగుతుంది. మీ అదృష్ట సంఖ్య : 1 , కలిసొచ్చే రంగు : బంగారు వర్ణం . సూర్యా ఆరాధన చేస్తూ నీటిని సమర్పించి, రాగి నాణెం నీటిలో వేయండి.
కన్యా రాశి (Virgo Horoscope)
ఈ రోజు ఈ రాశి వారికి మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ, ఆనందంగా గడుపుతారు. ఈ రోజు మీరు చాలా హుషారుగా ఉంటారు. ఆర్థిక విషయాలలో తొందరపాటు వద్దు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. దురాశకు పోకండి. కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుతారు. భార్యతో ఏకాంతంగా గడుపుతారు. స్నేహితులు, బంధువులు ఇంటికి వచ్చే ఛాన్స్ ఉంది. మీ ఆనందం కోసం మీకు కావల్సిన వారు ఆరాట పడతారు. మహిళలు ఈ రోజు ఇంటికి సంబంధించిన కొన్ని ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటారు. మీ అదృష్ట సంఖ్య : 7 , మీకు కలిసొచ్చే రంగు : లేత ఆకుపచ్చ. దుర్గామాతని ఆరాధన అనుకూలం.
తులా రాశి (Libra Horoscope)
ఈ రాశి వారికి ఈ రోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. తోబుట్టువుల సహాయ సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. స్నేహితులు కూడ మీకు అనుకూలంగా ఉంటారు. భార్యా భర్తల మధ్య వివాదాలకి అవకాశం ఉంది. అనుకున్న పనులు సమయానికి నెరవేరుతాయి. కుటుంబంలో పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మీ అదృష్ట సంఖ్య : 4 , మీకు కలిసొచ్చే రంగు : నీలం. తులసితో కృష్ణా ఆరాధన మంచిది.
వృశ్చిక రాశి (Scorpio Horoscope)
వృశ్చిక రాసి వారికి ఈ రోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది. కుటుంభ సభ్యుల సహకారం అన్నిటిలో ఉంటుంది. పిల్లలు పెద్దలతో ఆనందంగా గడుపుతారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనే ఛాన్స్ ఉంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన నెకొంటుంది. జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇంటి నిర్వహణ పట్ల శ్రద్ద పెడతారు. నూతన వస్తు ప్రాప్తి. మీ అదృష్ట సంఖ్య : 8 , మీకు కలిసొచ్చే రంగు : ముదురు ఎరుపు. బిల్వ పత్రాలతో శివుడికి పూజ చేస్తే శుభ ఫలితాలు పొందుతారు.
ధనుస్సు రాశి (Sagittarius Horoscope)
ఈ రోజు ఈ రాశి వారికి అన్నిటా శుభ సూచికం. సమాజంలో మీ గౌరవ పరిత్స్థలు పెరిగే ఛాన్స్ ఉంది. మీ ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక పురోగతి మెండుగా ఉంది. స్నేహితులను, బంధువులని కలిసే అవకాశం ఉంది. ఈ రోజు మీరు ప్రశాంతమైన లైఫ్ ని గడపటానికి ఇష్టపడతారు. జీవిత భాగస్వామి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. మీ అదృష్ట సంఖ్య : 3 , మీకు కలిసొచ్చే రంగు : పసుపు. పసుపు రంగు పువ్వులతో విష్ణువుని పూజించండి. అరటిపండ్లు దానం చేయండి.
మకర రాశి (Capricorn Horoscope)
ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక విషయాలలో అనుకూలంగా ఉంటుంది. అధిక ఖర్చులను నియంత్రణలో ఉంచుతారు. నూతన పెట్టుబడికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఆస్తి వ్యవహారాల్లో వివాదాలు ముగిసి విజయం సాధిస్తారు. కుటుంబం సభ్యులు, జీవిత భాగస్వామి మద్దతుతో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ప్రేమికుల మధ్య వివాదాలు నెలకొనే అవకాశం ఉంది. మీ అదృష్ట సంఖ్య : 10 , మీకు కలిసొచ్చే రంగు : బూడిద రంగు . శనీశ్వరునికి ఆవాల నూనెతో అభిషేకం చేసి, నల్ల నువ్వులు దానం చేయండి.
కుంభ రాశి (Aquarius Horoscope)
ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అధిక కోపం తగ్గి శాంత పరులుగా మారుతారు. ధన నష్టం లేదా దొంగతనం జరిగే అవకాశం ఉంది, అప్రమత్తంగా ఉండండి. కుటుంబంతో ప్రశాంతంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి అనవసర విషయాలు ప్రస్తావించకండి. వ్యాపారస్తులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మీ అదృష్ట సంఖ్య : 11 , మీకు కలిసొచ్చే రంగు : ఊదా. శనీశ్వరుడి ఆరాధన శుభప్రదం .
మీన రాశి (Pisces Horoscope)
ఈ రాశి వారికి ఈ రోజు అత్యంత శుభదినం. అన్నిటా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు సానుకూల ఫలితాలు లభిస్తాయి. పెద్దల నుంచి మద్దతు, గౌరవం లభిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. నియంత్రణలో ఉంటే మంచిది. దగ్గర బంధువుల నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. మీ అదృష్ట సంఖ్య : 7 , మీకు కలిసొచ్చే రంగు : లేత నీలం. విష్ణు సహస్రనామం పఠించండి.