ZPTC MPTC Results Live Updates: వైసీపీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది.. ఈ ఫలితాలే నిదర్శనం: పెద్దిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల తాజా అప్ డేట్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 19 Sep 2021 06:37 PM

Background

కాసేపట్లో ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కౌంటింగ్‌ కోసం అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 206...More

ఎన్టీఆర్ సొంత గ్రామం నిమ్మకూరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలుపు

మాజీ సీఎం, దివంగత నేత ఎన్టీఆర్ సొంత గ్రామం నిమ్మకూరులో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి 8 ఓట్ల తేడాతో విజయం సాధించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి దత్తత తీసుకున్న గ్రామం నిమ్మకూరు కావడం విశేషం. అక్కడ అధికార పార్టీ అభ్యర్థి గెలుపొందారు.