YSRCP Vs TDP: గన్నవరం ఘటనపై మంత్రి సీదిరి అప్పల రాజు స్పందించారు. పట్టాభి రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తే.. వైసీపీ శ్రేణులు వెంటబడే ప్రయత్నం చేశారని తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు పట్టాభిని రక్షించారని వివరించారు. పట్టాభి ఇష్టానుసారం మాట్లాడినా బట్టలు ఊడదీసి తంతామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సైకో పాలన పోవాలంటూ కామెంట్లు చేస్తున్నారని, ఎవరు సైకోనో ప్రజలకు తెలుసని చెప్పుకొచ్చారు. చంద్రబాబు తమ ఏమ్మేల్యే లను సంతలో పశువులు కొన్నట్లు  కొన్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏది ప్రజాస్వామ్యం, ఏది అప్రజాస్వామ్యం అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చిన హామి అమలు కోసం ముద్రగడ దీక్ష చేస్తే.. ఇష్టానుసారంగా  ఆయన్ని ఇబ్బందులు పెట్టారని మంత్రి సీదిరి గుర్తు చేశారు. ప్రస్తుత మంత్రి రోజా.. నాడు కామ సిఏం అంటేనే సంవత్సరం సస్పెండ్ చేశారని చెప్పుకొచ్చారు. అలాగే పోలీసులు లేకుండా వస్తే.. నడిరోడ్డు మీద తేల్చుకుందాం అంటూ చంద్రబాబు సవాల్ విసిరారని వివరించారు. 


లోకేష్ డైలాగ్స్ అచ్చం బాద్ షాలో బ్రహ్మానందం డైలాగ్లలా ఉన్నాయి..


14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇలా మాట్లాడుతారా అంటూ ఫైర్ అయ్యారు. ముహూర్తం పెట్టి తేల్చుకోవడానికి  ఇదేమైనా సినిమానా అని ప్రశ్నించారు. 2024 ఎలక్షన్లలో తేల్చుకుందాం రా చంద్రబాబు అంటూ కామెంట్లు చేశారు. నీ పేరు చెప్తే... గుర్తొచ్చే ఒక్క మంచి పని అయినా చేశావా అంటూ అడిగారు. నువ్వు చూపిన కులహంకారం.. వెనుకబడిన తరగతి వారు ఎవరూ మర్చిపోరని అన్నారు. రావణాసురుడితో యుద్దం చేస్తామని.. రావణాసురుడే చెప్పడం హాస్యాస్పదం అన్నారు. నువ్వు వంచించిన వర్గాలు.. నీకు బుద్ది చెప్పేందుకు సిద్దమంటున్నారని చెప్పారు. ప్రతీ ఇంటికి  ఏం చేసామో గడప గడపకూ వెళ్లి చెప్పగలుగుతున్నామన్నారు. మీరు అలా చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. గ్రామాల్లో సర్పంచ్, వీఆర్వో కూర్చోవడానికి ఈ డెబ్బై ఏళ్లలో ఒక్క బిల్డింగ్ లేదన్నారు. ఇప్పుడు ప్రతీ పంచాయితికి అద్భుతమైన బిల్డింగ్  కట్టిచ్చామన్నారు. లోకేష్ డైలాగ్ లు చూస్తుంటే... బాద్ షా లో బ్రహ్మానందం డైలాగ్స్ లా ఉన్నాయని అన్నారు. 


సీఎం జగన్ లా పాదయాత్ర చేసి లోకేష్ సీఎం అవ్వాలనుకుంటున్నారు..


లోకేష్ యువగళంలో వేషాలు వేస్తున్నారని మంత్రి సీదిరి అప్పల రాజు ఎద్దేవా చేశారు. జగన్ ని అనుకరిస్తూ.. జగన్ లా సీఏం అయిపోదామని కలలు కంటున్నారని అన్నారు. చంద్రబాబు ఒక్క బూతు తిడితే... లోకేష్ పది బూతులు తిడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు చేతకాని తనాన్ని లోకేష్ చెబుతున్నాడంటూ ఎగతాళి చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు ఎలా పక్కన పెట్టాడో అందరికీ తెలుసని.. జూనియర్ విజ్ఞాత కలిగిన వ్యక్తి కాబట్టి తొందరపడడని అన్నారు. కౌన్సిల్ రద్దు కోరామని కానీ.. కేంద్రం నుండి ఆమోదం రాలేదన్నారు. కాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలను పూర్తి చేయాలి కదా అన్నారు. అందుకే ఎన్నికల్లో అభ్యర్దులను నిలబెడుతున్నామన్నారు. రేపు కౌన్సిల్ రద్దు చేసిన అబ్యంతరం లేదని.. తమ తీర్మానానికి కట్టుబడి ఉన్నామని మంత్రి సీదిరి అప్పల రాజు వివరించారు.