Sajjala On Arrest :  ఢిల్లీ లిక్కర్ స్కామంలో వైఎస్ఆర్‌సీపీకి ఎలాంటి సంబంధం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన  ఢిల్లీలో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి విజయసాయిరెడ్డి అల్లుడు కాదన్నారు. విజయసాయిరెడ్డికి ఒక్కతే కూతురు ఉందని ఆయన అల్లుడి పేరు రోహిత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు అరెస్ట్ అయింది రోహిత్ రెడ్డి అన్న శరత్ చంద్రారెడ్డి అన్నారు. అరబిందో అనేది అతి పెద్ద అంతర్జాతీయ వ్యాపార సంస్థ అని.. విజయసాయి విజయసాయిరెడ్డి వాళ్ళకి బంధువే కానీ.. వాళ్ళ వ్యాపార సంస్థ ఈయన కు సంబంధం ఏంటని మీడియాను సజ్జల   ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఢిల్లీ, కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య చాలా కాలంగా పొలిటికల్  వార్ జరుగుతుంోదని..  దానికి ఏపి ప్రభుత్వం కి, వైసీపీ కి, విజయసాయిరెడ్డి, జగన్ లకు ఏమీ సంబంధమని సజ్జల మీడియా ప్రతినిధుల్ని ప్రశ్నించారు. 


ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో  అరబిందో ఫార్మా హోల్ టైమ్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని, మరో మద్యం వ్యాపారి వినయ్ బాబును   ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ కోర్టులో ప్రవేశ పెట్టారు.  శరద్ చంద్రారెడ్డి, వినోయ్ బాబులకు కోట్లాది రూపాయల మద్యం వ్యాపారం ఉందని ఈడీ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో ఢిల్లీలో అరబిందో గ్రూపు డైరెక్టర్ పెన్నాక శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు.  అరబిందో గ్రూపులోని 12 కంపెనీలకు శరత్ చంద్రారెడ్డి  డైరెక్టరుగా ఉన్నారు. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ డైరెక్టర్‌గా కూడా శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ను కూడా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ లో చేర్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో పెనాక శరత్ చంద్రారెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి అనుగుణంగా శరత్ చంద్రారెడ్డి ఈఎండీలు చెల్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.


పెనాక శరత్ చంద్రారెడ్డి సోదరుడు పెనాక రోహిత్ రెడ్డి .. వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెను వివాహం చేసుకున్నారు. విజయసాయిరెడ్డి అల్లుడు, కుమార్తె డైరక్టర్లుగా ఉన్న కంపెనీలు ఇటీవల పెద్ద ఎత్తున విశాఖలో భూములు కొనుగోలు చేశాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన అల్లుడు సోదరుడు  ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు కావడం రాజకీయంగానూ కలకలం రేపింది. ఈ అంశంపై వైఎస్ఆర్‌సీపీ సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి దేశ స్థాయిలో లిక్కర్ మాఫియాను నడుపుతున్నారని ఆరోపిస్తున్నారు. 


గతంలో శరత్ చంద్రారెడ్డి పేరు ఢిల్లీ లిక్కర్ స్కాంలో వెలుగులోకి వచ్చినప్పుడు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఆ సమయంలో భారతి పే పేరుతో వేసిన పోస్టర్లు కలకలం రేపాయి. వాటిపై సీఐడీ కేసులు కూడా నమోదు చేసింది. ఇప్పుడు శరత్ చంద్రారెడ్డిని అరెస్టు చేయడంతో త్వరలోనే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని టీడీపీ నేతలు అంటున్నారు. గతంలో ఏపీలో ఓ బహిరంగసభలో మాట్లాడిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏపీ ప్రభుత్వ పెద్దలకు సంబంధం ఉందని ఆరోపణలు గుప్పించారు.