వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విటర్ ఖాతా దుండగుల చేతుల్లోకి వెళ్లింది. బ్లూ టిక్ మార్కు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విటర్ అకౌంట్‌లో ఇప్పుడు ప్రొఫైల్‌పిక్, కవర్ ఫోటోలను హ్యాకర్లు మార్చేశారు. దాదాపు 10 గంటల క్రితం హ్యాక్ జరిగినట్లుగా తెలుస్తోంది. హ్యాక్ అయినప్పటి నుంచి ప్రొఫైల్ పిక్చర్, కవర్ ఫోటోలను మార్చడమే కాకుండా ట్విటర్ వాల్ పై రకరకాల పోస్టింగులను హ్యాకర్లు చేశారు. క్రిప్టో పేరుతో వేరే వేరే సైట్లకు సంబంధించిన లింకులు, వీడియోలు, ఫోటోలను ట్వీట్ చేశారు. ఇంకా కొన్ని ట్వీట్లను రీట్వీట్ కూడా చేశారు. దీంతో అప్రమత్తం అయిన వైఎస్ఆర్ సీపీ సాంకేతిక విభాగం రంగంలోకి దిగింది. ఈ ఘటనపై ట్విటర్ యాజమాన్యానికి వైఎస్‌ఆర్ సీపీ ఐటీ సిబ్బంది ఫిర్యాదు చేశారు.
YSRCP Twitter Account: వైఎస్ఆర్ సీపీ ట్విటర్ అకౌంట్ హ్యాక్, 10 గంటలుగా పిచ్చి పోస్టింగ్లు
ABP Desam
Updated at:
10 Dec 2022 11:29 AM (IST)
హ్యాక్ అయినప్పటి నుంచి ప్రొఫైల్ పిక్చర్, కవర్ ఫోటోలను మార్చడమే కాకుండా ట్విటర్ వాల్ పై రకరకాల పోస్టింగులను హ్యాకర్లు చేశారు.
హ్యాక్ అయిన వైఎస్ఆర్ సీపీ ట్విటర్ అకౌంట్