నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన రోడ్ షోలో ఎనిమిది మంది చనిపోవడంపై అధికార పక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ దుర్ఘటనపై వరుసగా మంత్రులు స్పందించారు. చంద్రబాబు అధికార వ్యామోహం వల్లే ఈ ఘోరం జరిగిందని మండిపడ్డారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ.. విజన్‌ గురించే మాట్లాడే చంద్రబాబుకు అసలు విజనే లేదని మండిపడ్డారు. చంద్రబాబు రెండోసారి అధికారంలోకి వచ్చిన కొత్తలో గోదావరి పుష్కరాల్లో పబ్లిసిటీ పిచ్చితో 29 మందిని బలిగొన్నారని గుర్తు చేశారు. చంద్రబాబు అధికార పిచ్చి తగ్గించుంటే మంచిదని మంత్రి చెల్లుబోయిన మాట్లాడారు. 

చంద్రబాబు ఆశ, అధికార దాహం కోసం కందుకూరులో 8 మంది బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కాకాణి. లేనిది ఉన్నట్టు సృష్టించడానిక చంద్రబాబు ప్రయత్నించారని, అందుకే ఎన్టీఆర్ సర్కిల్ లో రోడ్ షో ఏర్పాటు చేశారని చెప్పారు. జనం ఎక్కువమంది కెమెరాకు కనపడాలని ఆయన వాహనాన్ని ముందుకు తెచ్చారు. 20 అడుగుల వెడల్పు ఉండే రోడ్ లో చంద్రబాబు వాహనం వచ్చింది. అక్కడ గ్రూపు రాజకీయాలున్నాయి. పోటా పోటీగా ఫ్లెక్సీలు కట్టారు. జనం అటు, ఇటు వెళ్లిపోకుండా ఫ్లెక్సీల మధ్య నిలబడితే, డ్రోన్ కెమెరాలతో చూపించాలనుకున్నారు. ఆ పొరపాట్ల వల్లే 8 మంది చనిపోయారన్నారు కాకాణి. పాపం కూలీ డబ్బులిస్తారని వచ్చి ప్రాణాలు కోల్పోయారని అన్నారు.

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. కందుకూరులో చంద్రబాబు సభ అధికార దాహానికి పరాకాష్ఠ అని అన్నారు. రోడ్ షో కూడా ఇరుకు సందుల్లో పెట్టారని, జనం తక్కువ మంది వచ్చినా ఎక్కువగా కనిపించాలనే ఉద్దేశంతో సందుల్లో పెట్టారని విమర్శించారు. చంద్రబాబు అధికార దాహానికి 8 మంది చనిపోయారని అన్నారు. చంద్రబాబు వల్ల 8 మంది చనిపోయారని, వారి పేద కుటుంబాలు రోడ్డునపడ్డాయని పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అన్నారు.

నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఇరుకు సందులో సభ పెట్టి డ్రోన్ కెమెరాలతో విజువల్స్‌ షూట్ చేయించి సభకు బాగా జనం వచ్చారని చెప్పుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సందుల్లో సభ వల్లే తొక్కిసలాట జరిగి 8 మంది చనిపోయారని అన్నారు. చంద్రబాబు లాంటి ప్రతిపక్ష నేత ఉండటం మన ఖర్మ అని ప్రజలు అనుకుంటున్నారని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.

అసలేం జరిగిందంటే..
ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు పర్యటించారు. ఇటీవల చంద్రబాబు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు అనూహ్య స్పందన వస్తోంది. ఈ క్రమంలో బుధవారం నాడు కందుకూరులో నిర్వహించిన సభ (Chandrababu Kandukur Meeting)కు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. గుండంకట్ట ఔట్‌లెట్‌లో కొందరు టీడీపీ కార్యకర్తలు జారిపడిపోయారు. మురుగునీటి కాల్వలో పడిపోయిన వారిలో ఐదుగురు చనిపోయారని చంద్రబాబు ప్రకటించారు. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇలా జరగడంతో సభ మధ్యలోనే ఆపేసి ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శిస్తున్నానని చెప్పారు. కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి గాయపడ్డ కార్యకర్తలతో పాటు చనిపోయిన కార్యకర్తల కుటుంబ సభ్యలను పరామర్శించారు.అసలేం జరిగిందంటే..

ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు పర్యటించారు. ఇటీవల చంద్రబాబు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు అనూహ్య స్పందన వస్తోంది. ఈ క్రమంలో బుధవారం నాడు కందుకూరులో నిర్వహించిన సభ (Chandrababu Kandukur Meeting)కు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. గుండంకట్ట ఔట్‌లెట్‌లో కొందరు టీడీపీ కార్యకర్తలు జారిపడిపోయారు. మురుగునీటి కాల్వలో పడిపోయిన వారిలో ఐదుగురు చనిపోయారని చంద్రబాబు ప్రకటించారు. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇలా జరగడంతో సభ మధ్యలోనే ఆపేసి ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శిస్తున్నానని చెప్పారు. కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి గాయపడ్డ కార్యకర్తలతో పాటు చనిపోయిన కార్యకర్తల కుటుంబ సభ్యలను పరామర్శించారు.